E-Paper
Advertisement

ఏసీ నుండి నీరు కారుతోందా? అయితే ప్రమాదంలో పడ్డట్లే.. వెంటనే ఇలా చేయండి!

ఏసీ నుండి నీరు కారుతోందా? అయితే ప్రమాదంలో పడ్డట్లే.. వెంటనే ఇలా చేయండి!
Advertisement

AC Water Leakage: ఏసీ నుంచి కొన్ని సందర్భాల్లో నీరు బయటకు వస్తూ ఉంటుంది. అయితే కూలింగ్ వస్తుంది కదా అని చాలా మంది దీనిని పట్టించుకోరు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల గోడలు పాడవటమే కాకుండా.. మిషన్ సైతం దెబ్బతినే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏసీ లీకేజీకి ప్రధాన కారణాలు ఏంటి? వాటికి చెక్ పెట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

డ్రైన్ పైపులో అడ్డంకులు

ఏసీ నుంచి నీరు కారడానికి అనే కారణాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే డ్రైన్ పైపు బ్లాకేజీ కూడా ఇందులో ఓ కారణమని స్పష్టం చేస్తున్నారు. ఏసీ నుండి నీటిని బయటకు పంపే పైపులో దుమ్ము, ధూళి లేదా నాచు పేరుకుపోవడం వల్ల నీరు వెనక్కి తిరిగి లోపలికి కారే ఛాన్స్ ఉంటుంది.

ఎయిర్ ఫిల్టర్ల అపరిశుభ్రత

Advertisement

ఫిల్టర్లలో దుమ్ము ఎక్కువగా చేరినప్పుడు గాలి ప్రసరణ సరిగ్గా జరగదు. దీనివల్ల లోపల ఉండే కాయిల్స్ గడ్డకట్టి.. ఆ తర్వాత ఆ మంచు కరిగి నీరులా కారుతుంది.

తక్కువ గ్యాస్

ఏసీలో గ్యాస్ తక్కువగా ఉన్నప్పుడు ఎవాపరేటర్ కాయిల్స్ గడ్డకడతాయి. ఇది లీకేజీకి దారి తీస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పాత ఏసీల్లో నీటిని సేకరించే ట్రే (Drain Pan) తుప్పు పట్టడం లేదా రంధ్రాలు పడటం వల్ల కూడా నీరు కారొచ్చు.

ఇన్‌స్టాలేషన్ సమస్య

Advertisement

ఏసీని సరిగా ఇన్ స్టాల్ చేయకపోయినా కూడా వాటర్ లీకేజీ సమస్య వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. నీటిని బయటకు పంపే పైప్స్ ను సరిగ్గా ఫిక్స్ చేయకపోవడం అది రివర్స్ లో వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు.

Also Read: Best Printers 2026: మీ ఇంటికి కొత్త ప్రింటర్ కావాలా? ఈ టాప్ 5 మోడల్స్ చూడాల్సిందే!

ఇలా చేస్తే సరి..

కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఏసీ వాటర్ లీకేజీ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఏసీ ఫిల్టర్లను తీసి శుభ్రం చేయడం వల్ల గాలి ప్రసరణ మెరుగవుతుంది. డ్రైన్ పైపులో ఏవైనా అడ్డంకులు ఉన్నాయేమో చూసి ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తూ ఉండండి. సంవత్సరానికి కనీసం రెండు సార్లు ప్రొఫెషనల్ టెక్నీషియన్‌తో సర్వీసింగ్ చేయించడం మందని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: బడ్జెట్ ధరలో టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్ కావాలా? అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు!

Related News

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×