E-Paper
Advertisement

వివేక్ ఆత్రేయతో బాలయ్య మూవీ.. గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్!

వివేక్ ఆత్రేయతో బాలయ్య మూవీ.. గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్!
Advertisement

Balakrishna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బాలకృష్ణ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 6 పదుల వయసు దాటినా సరే ఇప్పటికీ మాస్ యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తూ ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తున్నారు. అలాంటి ఈయన తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై అభిమానులలో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ఈయన.. తాజాగా వివేక ఆత్రేయతో చేయబోయే సినిమాకు సంబంధించిన ఒక వార్త అభిమానులను మరింత అలరిస్తోంది.

వివేక్ ఆత్రేయ మూవీ నుండి అదిరిపోయే న్యూస్..

ఇకపోతే బాలకృష్ణ హీరోగా.. దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో బాలయ్య డ్యూయల్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. బాలయ్య కోసం ఒక పవర్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ కథను డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సిద్ధం చేశారట. ఈ చిత్రానికి కురుక్షేత్రం అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్టోరీ ఫైనల్ కాగా.. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని సమాచారం. ఏది ఏమైనా ఇదే గనుక నిజమైతే బాలయ్య దాదాపు 19 చిత్రాలలో డ్యూయల్ రోల్ చేసినట్లు అవుతుందని చెప్పవచ్చు. మరి వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా బాలయ్యకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Advertisement

also read:పెద్ది టీమ్ కి షాక్.. ఉరేసుకుంటానంటూ అభిమాని లేఖ!

బాలయ్య తదుపరి చిత్రాలు..

ఆ బాలయ్య తదుపరి సినిమాల విషయానికొస్తే.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా తర్వాత బాలకృష్ణ కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నారు. ఈ చిత్రానికి కార్పెంటర్ అనే ఒక భిన్నమైన టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. సాధారణంగా కొరటాల శివ సినిమాలు అంటే బలమైన సామాజిక సందేశం తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే ఇప్పుడు కార్పెంటర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. కాబట్టి ఇందులో బాలయ్య పాత్ర చాలా కొత్తగా లోకల్ సెటప్ లో అత్యంత పవర్ఫుల్గా ఉండబోతుందని మాత్రం అర్థమవుతుంది. ఇక ఇందులో బాలకృష్ణ మార్క్ డైలాగులు.. కొరటాల మార్క్ ఎమోషన్స్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం ఖాయం అనే రేంజ్ లో అభిమానులు అప్పుడే కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే బాలయ్య కొరటాల శివ మూవీ పూర్తయ్యాకే ఆత్రేయ మూవీ సెట్ లోకి అడుగు పెడతారా? లేక ముందుగానే ఈ మూవీ కోసం పనిచేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా బాలకృష్ణ ఈ వయసులో వరుస అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోతూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పవచ్చు.

Related News

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!

హార్ట్ టచ్ ఫీలింగ్.. ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్!

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

Big Stories

Advertisement
×