E-Paper
Advertisement

గంటలు గడుస్తున్నా ఫోన్ ఛార్జ్ అవ్వట్లేదా? ఈ చిన్న ట్రిక్‌తో.. రాకెట్‌లా దూసుకెళ్తుంది!

గంటలు గడుస్తున్నా ఫోన్ ఛార్జ్ అవ్వట్లేదా? ఈ చిన్న ట్రిక్‌తో.. రాకెట్‌లా దూసుకెళ్తుంది!
Advertisement

Mobile fast charging tips: రోజు రోజుకూ స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ పెరుగుతోంది. మార్కెట్లోకి 60W, 120W ఫాస్ట్ ఛార్జర్లు కూడా వచ్చేశాయి. కానీ.. ఎంతటి కాస్ట్‌లీ మొబైల్ వాడుతున్నా.. కొన్నాళ్లయ్యాక చాలా మంది ఫేస్ చేసే ఒక కామన్ ప్రాబ్లం “స్లో ఛార్జింగ్”. ఫోన్ ప్లగ్‌లో పెట్టి గంటలు గడుస్తున్నా బ్యాటరీ పర్సంటేజ్ అస్సలు పెరగదు. ఇలాంటి టైంలో “కొంపతీసి ఫోన్ పాడైపోయిందా? కొత్త బ్యాటరీ వేయించాలా?” అని తెగ టెన్షన్ పడిపోతుంటారు. అయితే మీ ఫోన్ ఛార్జింగ్ నత్తనడకన సాగడానికి కొన్ని కారణాలు ఉంటాయి. మీ ఫోన్ ఎందుకు స్లోగా ఛార్జ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఫోన్ ఛార్జింగ్ నత్తనడకన సాగడానికి 5 కారణాలు:

1. క్వాలిటీ లేని యూఎస్‌బీ కేబుల్:
ఫోన్ స్లో ఛార్జ్ అవ్వడానికి 90% కారణం మీ ఛార్జింగ్ కేబుల్ పాడైపోవడమే. మనం కేబుల్‌ను పదే పదే చుట్టడం, నలపడం వల్ల లోపల ఉండే సన్నని కాపర్ వైర్లు కట్ అవుతాయి. బయటకు కేబుల్ బాగానే కనిపిస్తున్నా.. లోపల పవర్ సప్లై సరిగ్గా ఉండదు. కాబట్టి ఛార్జింగ్ స్లో అయితే మొదట కేబుల్ మార్చి చూడండి.

Advertisement

2. చౌకైన లోకల్ అడాప్టర్ వాడటం:
బాక్స్‌లో వచ్చిన ఒరిజినల్ అడాప్టర్ పాడైపోతే.. చాలా మంది తక్కువ ధరలో దొరికే లోకల్ అడాప్టర్లను కొంటుంటారు. మీ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంటే.. మీరు పెట్టే లోకల్ ఛార్జర్ కేవలం 5W లేదా 10W మాత్రమే పవర్‌ను ఇస్తుంది. దీని వల్ల ఫోన్ ఫుల్ అవ్వడానికి రోజంతా పడుతుంది.

3. ఛార్జింగ్ పోర్టులో చెత్త పేరుకుపోవడం:
మనం ఫోన్‌ను ఎప్పుడూ జీన్స్ పాకెట్స్‌లోనో లేదా బ్యాగుల్లోనో వేస్తుంటాం. దీని వల్ల ఫోన్ కింద ఉండే ఛార్జింగ్ పోర్టులోకి దూళి, దూది చేరిపోతాయి. మనం కేబుల్ పెట్టినప్పుడు ఆ దూళి వల్ల కనెక్టివిటీ సరిగ్గా ఉండదు. ఒక చిన్న టూత్‌పిక్ లేదా సాఫ్ట్ బ్రష్‌తో పోర్టును క్లీన్ చేస్తే ఈ సమస్య తగ్గిపోతుంది.

Advertisement

4. బ్యాక్‌గ్రౌండ్ యాప్స్, విపరీతమైన హీటింగ్:
ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ వేడెక్కితే.. బ్యాటరీ సేఫ్టీ కోసం సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ స్పీడ్‌ను తగ్గించేస్తుంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో హెవీ యాప్స్, జీపీఎస్ , బ్లూటూత్ రన్ అవుతున్నా లేదా ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడుతున్నా ఫోన్ అస్సలు ఛార్జ్ అవ్వదు.

5. పాతబడిన బ్యాటరీ:
మీ ఫోన్ కొని రెండు మూడు ఏళ్లు దాటిపోతే.. బ్యాటరీ లైఫ్ అయిపోవచ్చినట్టే. లిథియం-అయాన్ బ్యాటరీలు పాతబడే కొద్దీ వాటి ఛార్జ్ తీసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. అలాంటప్పుడు బ్యాటరీని మార్చడం ఒక్కటే మార్గం.

ఫోన్ రాకెట్ స్పీడ్‌తో ఛార్జ్ అవ్వాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి:
ఫ్లైట్ మోడ్ ఆన్ చేయండి: అత్యవసరంగా ఛార్జింగ్ అవ్వాలంటే ఫోన్‌ను ‘Aeroplane Mode’ లో పెట్టండి లేదా స్విచ్ ఆఫ్ చేసి ఛార్జ్ చేయండి.

ఒరిజినల్ మాత్రమే వాడండి: ఎప్పుడూ మీ బ్రాండ్‌కు చెందిన ఒరిజినల్ ఛార్జర్, కేబుల్స్ మాత్రమే ఉపయోగించండి.

కంప్యూటర్/లాప్‌టాప్ వద్దు: చాలా మంది ఆఫీసులో ల్యాప్ టాప్ యూఎస్‌బీ పోర్టుకు కనెక్ట్ చేసి ఛార్జ్ చేస్తారు. అందులో వోల్టేజ్ చాలా తక్కువగా వస్తుంది కాబట్టి ఛార్జింగ్ చాలా స్లో అవుతుంది. ఎప్పుడూ డైరెక్ట్ వాల్ సాకెట్ మాత్రమే వాడండి.

కవర్ తీసేయండి: ఛార్జింగ్ పెట్టేటప్పుడు మొబైల్ లావుపాటి పౌచ్‌లు లేదా కవర్లు తీసేస్తే.. ఫోన్ హీట్ అవ్వకుండా ఉంటుంది.

ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే.. మీ స్మార్ట్‌ఫోన్ మళ్లీ పాతపద్ధతిలో సూపర్ ఫాస్ట్‌గా ఛార్జ్ అయిపోతుంది.

Related News

వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. భారత్‌లో OxygenOS శకం ముగిసినట్లేనా?

బెడ్‌టైమ్ స్టోరీస్ కోసం మెటా కొత్త ప్రయత్నం.. ఈ StoryKit యాప్ ఎలా పనిచేస్తుందంటే?

బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్.. Vi రూ.479 రీఛార్జ్‌తో లభించే బెనిఫిట్స్ ఇవే!

వర్షాకాలంలో ACలో ఉన్న ఈ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఉక్కపోత మాయం, కరెంట్ బిల్లు సగం!

ఆన్‌లైన్‌లో మీ డేటా సేఫ్ ఉండాలంటే.. ఈ 5 గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వండి!

ఓరి నాయనో.. నిజమా? కలా? Samsung Z Fold 7పై ఏకంగా రూ.75,000 దాకా తగ్గింపు!

టీవీ కొనాలనుకుంటున్నారా? Mini LED లేదా OLED.. ఏది బెస్ట్ ఆప్షన్?

మెటా యాప్స్‌లో మన డేటాను AI వాడకుండా ఎలా ఆపాలో తెలుసా?

Big Stories

Advertisement
×