E-Paper
Advertisement

94 ఏళ్ల ‘భీష్మాచార్యుడు’ సింగీతంపై మెగాస్టార్ చిరంజీవి క్రేజీ పోస్ట్.. నెట్టింట వైరల్!

94 ఏళ్ల ‘భీష్మాచార్యుడు’ సింగీతంపై మెగాస్టార్ చిరంజీవి క్రేజీ పోస్ట్.. నెట్టింట వైరల్!
Advertisement

Chiranjeevi Praises Singeetam: సింగీతం శ్రీనివాసరావు…మయూరి’, ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’ వంటి కల్ట్ సినిమాలని అందించిన ఈ గ్రేట్ ఫిలిమ్ మేకర్ తాజాగా తెరకెక్కించిన సినిమా ‘సింగ్ గీతం’.అది కూడా 94 ఏళ్ల వయసులో. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై ఈ తరం ట్రెండ్ సెట్టర్, ‘మహానటి’, ‘కల్కి 2898 AD’ వంటి విజువల్ వండర్స్ సృష్టించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.ఇక జూన్ 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పిన చిరు

Advertisement

ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఈ చిత్ర యూనిట్‌కు ప్రత్యేక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సింగీతం శ్రీనివాసరావు గారిని తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక భీష్మాచార్యుడిగా, ఒక అమూల్యమైన నిధిగా చిరు ఆకాశానికి ఎత్తేశారు. గతంలో చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాల ఆడియో ఫంక్షన్లలో సింగీతం  పాల్గొని బ్లెస్సింగ్స్ ఇవ్వగా, నేడు ఆయన సినిమాకు చిరంజీవి ఎక్స్ లో ప్రత్యేక పోస్ట్ పెట్టడం ఇండస్ట్రీలో ఒక బ్యూటిఫుల్ మూమెంట్‌గా నిలిచిందనే చెప్పాలి.

also read :4 నిమిషాల నాన్‌స్టాప్ కామెడీ.. అక్షయ్ ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ ట్రైలర్ సెన్సేషన్..

Advertisement

పాత తరం అపార అనుభవానికి, ఈ తరం వినూత్న ఆలోచనలకు ప్రతిరూపమైన నాగ్ అశ్విన్ తోడవ్వడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని మెగాస్టార్ ప్రశంసించారు. సీనియర్లను గౌరవిస్తూ వారిలోని ప్రతిభను బయటికి తెస్తున్న నాగ్ అశ్విన్ ని అభినందించారు.

ఇప్పటికే తమ విషెస్ తెలిపిన ప్రముఖులు 

మరోవైపు ఈ క్రేజీ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌కు టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం విశేషం. మెగాస్టార్‌కు దేవిశ్రీ ప్రసాద్ అంటే ఉన్న ఇష్టం అందరికీ తెలిసిందే, ఈ సినిమాలో డీఎస్పీ మ్యూజిక్ మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని చిరు ఆశాభావం వ్యక్తం చేశారు. రామ్ గోపాల్ వర్మ, ఎస్.ఎస్. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ వంటి పరిశ్రమ ప్రముఖులు సైతం ఈ వినూత్న చిత్రానికి తమ బెస్ట్ విషెస్ అందించారు.

also read :బాలయ్య సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా రాజశేఖర్?.. కొరటాల శివ స్కెచ్ మామూలుగా లేదుగా!

ఈ మధ్యే  జరిగిన ఈ సినిమా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు విశ్వనటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు. గతంలో సింగీతం దర్శకత్వంలో కమల్ హాసన్ చేసిన ‘అపూర్వ సహోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజు’ వంటి చిత్రాలు ట్రెండ్ సెట్ చేయగా, వీరి కాంబినేషన్ బాండింగ్ ఈ ఈవెంట్‌లో మరోసారి హైలైట్‌గా నిలిచింది.

సినిమా కథేంటంటే ..

సినిమా కథ విషయానికి వస్తే, అయాన్, అహల్య, శాలిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఒక వెరైటీ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఒక పల్లెటూరిలోని ప్రజలకు ఎదురైన వింత సమస్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఊర్లోని జనాభా అంతా సాధారణంగా మాట్లాడటం మానేసి, ఏది చెప్పాలన్నా కేవలం పాటల రూపంలోనే మాట్లాడే ఒక వింత పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోని ఈ పరిణామాలకి పరిష్కారాలను దర్శకుడు సింగీతం తనదైన మార్క్ హ్యూమర్‌తో ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైనపాటలు డిఫరెంట్ వైబ్స్ క్రియేట్ చేస్తూ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసాయి. చూడాలి జూన్ 12న రానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలకి వేదిక అవుతుందో !

Related News

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

Big Stories

Advertisement
×