E-Paper
Advertisement

టెక్ ప్రియులు ఎంతగానో వెయిట్ చేసిన డీల్ ఇదే.. Galaxy S25 Ultraపై అద్భుతమైన ధర తగ్గింపు!

టెక్ ప్రియులు ఎంతగానో వెయిట్ చేసిన డీల్ ఇదే.. Galaxy S25 Ultraపై అద్భుతమైన ధర తగ్గింపు!
Advertisement

Galaxy S25 Ultra Price Drop: ఇటీవలే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చి టెక్ ప్రియుల మనసు దోచుకున్న శాంసంగ్‌ అల్ట్రా సిరీస్‌కు మంచి క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గతేడాది జనవరిలో వచ్చిన Galaxy S25 Ultra ఇప్పటికీ ట్రెండ్‌లోనే ఉంది. మార్కెట్లోకి కొత్త మోడల్స్ వచ్చినా కూడా దీని క్రేజ్ మాత్రం తగ్గలేదు. ధర ఎక్కువున్నా కూడా దీని కెమెరా, పర్ఫార్మెన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. అలాంటి వారందరికీ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది. మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ ధరకే ఈ ఫోన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

రూ.లక్ష లోపే ప్రీమియం ఫోన్:

అమెజాన్ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ అసలు ధర రూ.1,29,999. కానీ ఇప్పుడు సేల్‌లో భాగంగా ఏకంగా 23% భారీ డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో ఫోన్ రేటు నేరుగా రూ.99,999కి వచ్చేసింది. ఇది కాకుండా మరో రూ.2,000 అదనపు డిస్కౌంట్ కూపన్ కూడా అందుబాటులో ఉంది. ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు వాడకపోయినా సరే, దీన్ని రూ.97,999కే సొంతం చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ప్రీమియం ఫోన్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్ అన్నమాట.

Advertisement

Also Read: AC కొనే ప్లాన్‌లో ఉన్నారా? ఆన్‌లైన్ వర్సెస్ ఆఫ్‌లైన్.. ఎక్కడ కొంటే డబ్బులు మిగుల్చుకోవచ్చో తెలుసా?

బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు:

కంపెనీ ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే.. మరో రూ.3,000 వరకు అదనంగా తగ్గించుకునే ఛాన్స్ ఉంది. ఈ ఆఫర్లన్నీ కలిపితే Galaxy S25 Ultra ఫోన్ జస్ట్ రూ.94,999కే లభిస్తుంది. భారత్‌లో ఈ ఫోన్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే లోయెస్ట్ ప్రైస్ అని చెప్పాలి. అందుకే మంచి ఫోన్ తీసుకోవాలి అనుకునే వాళ్లకి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్.

Galaxy S25 Ultra ఫీచర్లు:

Advertisement

ఈ ఫోన్ ఇచ్చే పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్‌ అనే చెప్పాలి. దీనిలో వాడిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, 200MP మెయిన్ కెమెరా అసలు సిసలైన ఫొటోగ్రఫీ అనుభూతిని ఇస్తాయి. 6.9 అంగుళాల పెద్ద స్క్రీన్ మీద వీడియోలు చూస్తుంటే సినిమా థియేటర్ ఫీల్ కలుగుతుంది. ఇక గేమ్స్ ఎక్కువగా ఆడేవారికి కూడా ఈ ఫోన్ బాగా నచ్చుతుంది. రూ.లక్ష లోపు మంచి టాప్ క్లాస్ ఫోన్ కావాలనుకుంటే.. ఈ అమెజాన్ సేల్‌ను మిస్ చేసుకోవద్దు.

Also Read: వన్‌ప్లస్ vs ఒప్పో.. 7000mAh బ్యాటరీతో రచ్చ లేపుతున్న ఈ రెండింటిలో ఏది కొనాలి?

Related News

Google Pixel 11పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.19,000 ఆదా చేసుకునే అవకాశం!

ఇది మామూలు ఫోన్ కాదు భయ్యా.. 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో ఒప్పో సరికొత్త రికార్డ్!

Apple Watch Series 11పై అమెజాన్‌లో క్రేజీ డీల్.. యాపిల్ ప్రియులకు ఇంత కంటే మంచి ఛాన్స్ రాదు!

5Gకి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది..త్వరలోనే జియో 6G ఇంటర్నెట్

రూ.25 వేల బడ్జెట్‌లో ఐదు అదిరిపోయే ఫోన్ ఆఫర్లు.. ఏది కొనడం బెస్ట్ అంటే?

ఫేక్ ఇ-ఇన్‌వాయిస్ మెసేజ్‌లతో మోసపోకండి..అసలు,నకిలీ బిల్లులను ఇలా గుర్తించండి!

సమయాన్ని కొలవడంలో సరికొత్త విప్లవం.. న్యూక్లియర్ క్లాక్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

డబ్బులు కట్ అయ్యి మనీ పడలేదా?ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

Big Stories

Advertisement
×