Wonderchef Chef Magic: దేశంలో అత్యంత ఆదరణ పొందిన స్మార్ట్ కుకింగ్ పరికరాల్లో వండర్ చెఫ్ మ్యాజిక్ (Wonderchef Chef Magic) మ్యాజిక్ ఒకటి. ఇది భారతీయ స్మార్ట్ వంటకాల్లో విఫ్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఇది కేవలం వండటమే కాకుండా.. ఒక నిపుణుడైన షెఫ్ లాగా మనకు సహాయం చేస్తుంది. ఇంతకీ ఈ స్మార్ట్ పరికరంలోని ప్రధాన ఫీచర్లు ఏవీ? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటీ? ఈ కథనంలో పరిశీలిద్దాం.
వండర్ చెఫ్ కుక్కర్ విషయానికి వస్తే.. దానిలోనే ఆటోమేషిన్ ఫీచర్ దానిని ప్రత్యేకంగా నిలుపుతోంది. కూరగాయలను కలపడం, వేయించడం వంటి పనులను స్వయంగా అదే చేసుకుంటుంది. మనం కేవలం రెసిపీని ఎంచుకుని అవసరమైన పదార్థాలను వేస్తే సరిపోతుంది. ఇది వంట చేసేటప్పుడు మనం గంటల తరబడి పొయ్యి దగ్గర నిలబడాల్సిన అవసరాన్ని సైతం తగ్గిస్తుంది. తద్వారా మనం ఇతర పనుల కోసం ఆ సమయాన్ని కేటాయించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
ఈ పరికరంలో 500 కంటే ఎక్కువ (In-built) వంటకాలు ప్రీ లోడెడ్ అయ్యి ఉంటాయి. వీటిలో దక్షిణ భారతం, ఉత్తర భారతం, చైనీస్, కాంటినెంటల్ వంటకాలు ఇన్ బిల్ట్ గా ఉన్నాయి. ప్రతి వంటకానికి సంబంధించిన దశలను ఇది స్క్రీన్‌పై స్పష్టంగా చూపిస్తుంది. వంట రాని వారు కూడా ఈ రెసిపీ గైడ్ సహాయంతో రెస్టారెంట్ తరహా రుచికరమైన భోజనాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్ కుక్కర్ లో అత్యాధునికమైన ఆండ్రాయిడ్ ఆధారిత టచ్ స్క్రీన్ అమర్చారు. దీనికి వై-ఫై సదుపాయం ఉండటం వల్ల కొత్త రెసిపీలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాయి. యూజర్ ఫ్రెండ్లీగా ఉండటం వల్ల దీనిని వినియోగించడం చాలా తేలిక. కాబట్టి ఎవరైనా సులభంగా ఆపరేట్ చేయవచ్చు. వంట చేసే ప్రతి దశలోనూ ఇది మనకు మార్గనిర్దేశం చేయడంతో పాటు తదుపరి ఏ పదార్థం వేయాలో గుర్తు చేస్తూనే ఉంటుంది.
రుచికరమైన వంటకానికి పదార్థాల కొలత చాలా ముఖ్యం. షెఫ్ మ్యాజిక్ పరికరంలో ఈ ఫీచర్ ఇన్ బిల్ట్ గా వస్తుంది. వేసే ముందు వంటకాల బరువును ఈ మిషన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల ఉప్పు, కారం లేదా మసాలాలను ఖచ్చితమైన గ్రాముల్లో వేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ముడి పదార్థాలు తక్కువ లేదా ఎక్కువ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ప్రతిసారీ వంట ఒకే రకమైన రుచితో వస్తుంది.
వంట మాత్రమే కాకుండా మ్యాజిక్ చెఫ్ పరికరంతో పిండి కలపడం, స్టీమింగ్, బాయిలింగ్, చాపరింగ్, సాటియింగ్ వంటి అనేక పనులను చేయవచ్చు. దీనివల్ల కిచెన్‌లో విడివిడిగా మిక్సీలు, కుక్కర్లు లేదా ఇతర పరికరాల అవసరం తగ్గుతుంది. ఈ పరికరం కిచెన్ స్పేస్‌ను ఆదా చేయడంతో పాటు, క్లీనింగ్ పనిని కూడా చాలా వరకు తగ్గిస్తుంది.
Also Read: Automatic Curry Makers: ఏఐ స్మార్ట్ కుక్కర్లు.. పచ్చి కూరగాయలు వేస్తే చాలు.. మధురంగా వండేస్తాయ్!
ఈ అధునాతన స్మార్ట్ కుకింగ్ పరికరం ధరను రూ. 29,999గా నిర్ణయించారు. వండర్ చెఫ్ వెబ్ సైట్ లోకి వెళ్తే దీనిపై 16 రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి MRP ధర కంటే తక్కువకే దీనిని సొంతం చేసుకునే అవకాశముంది. ప్రస్తుతం గ్యాస్ కొరత నేపథ్యంలో ఈ వండర్ చెఫ్ కుక్కర్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోందని నిపుణులు చెబుతున్నారు.