E-Paper
Advertisement

Rashmika Mandanna: రష్మిక మా ఊరి కోడలే -సీఎం!

Rashmika Mandanna: రష్మిక మా ఊరి కోడలే -సీఎం!
Advertisement

Rashmika Mandanna:నేషనల్ క్రష్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రష్మిక మందన్న (Rashmika mandanna)గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ‘కిర్రిక్ పార్టీ’ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. తెలుగులో ఛలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత గీతగోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు అంటూ ఇలా పలు చిత్రాలు చేసి సంచలనం సృష్టించింది. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక మందన్న.. ఆ తర్వాత పుష్ప 2 ఛావా, సికిందర్, యానిమల్, ది గర్ల్ ఫ్రెండ్ అంటూ పలు చిత్రాలు చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 3వేల కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు తక్కువ సమయంలోనే ఈ రేంజ్ స్టార్ స్టేటస్ అందుకున్న తొలి హీరోయిన్ గా కూడా పేరు దక్కించుకుని రష్మిక మందన్న.

రష్మిక మా ఊరి కోడలు – సీఎం రేవంత్ రెడ్డి

ఇదిలా ఉండగా తెలంగాణలో 2024 – 2025 సంవత్సరానికి గాను ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గద్దర్ అవార్డులను అందజేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanthi reddy) చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి గానూ ఉత్తమ నటి విభాగంలో రష్మిక మందన్నకు గద్దర్ అవార్డు లభించింది. ఇకపోతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రష్మిక మందన్న ఈ అవార్డును అందుకున్నారు. ఇకపోతే ఈ అవార్డును అందించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..” రష్మిక మా ఊరి కోడలు” అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుతున్నాయి.

కూతురుగా వచ్చి కోడలిగా హోదా..

Advertisement

గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో రష్మిక మందన్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ నటి అవార్డును అందజేస్తూ.. రష్మిక మన ఊరి కోడలు అంటూ సంబోధించారు. ఆ సమయంలో అభిమానులు కేరింతలతో సందడి చేశారు. ఇకపోతే గతంలో నటనపై వచ్చిన ట్రోల్స్ ను గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపోతే ఇప్పుడు ప్రభుత్వ అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని.. పైగా తెలుగు ఇండస్ట్రీకి కూతురులా వచ్చి ఇప్పుడు అధికారికంగా కోడలినైనందుకు సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన్న.

also read:Poonam Bajwa: అమ్మాయిలతో బీ కేర్‌ఫుల్.. యువతకి పూనం హెచ్చరిక.. జాగ్రత్త పడాలంటూ!

విజయ్ దేవరకొండ తో ప్రేమ, పెళ్లి..

Advertisement

గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న ప్రేమలో పడిపోయారు. అప్పటినుంచి ఎనిమిదేళ్లు రహస్యంగా ప్రేమించుకుని ఎట్టకేలకు ఫిబ్రవరి 26 2026న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం తుమ్మన్ పేటకి చెందినవారు. వివాహమనంతరం తన స్వగ్రామానికి వెళ్లి గృహప్రవేశం చేసి సత్యనారాయణ వ్రతం కూడా ఆచరించారు. ప్రస్తుతం వీరిద్దరూ కలసి రణబాలి సినిమాలో నటిస్తున్నారు.. అలాగే అటు విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ తో పాటు ఇటు రష్మిక మందన్న మైసా సినిమాలో నటిస్తున్నారు.

Related News

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

Big Stories

Advertisement
×