Wozoyo Pure Air PA1 review: ప్రస్తుతం నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఇంట్లో కూడా స్వచ్ఛమైన గాలి పీల్చడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా శ్వాసకోస సమస్యలు ఉన్నవారికి ఎయిర్ ప్యూరిఫైర్ అనేది తప్పనిసరి గాడ్జెట్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లోకి వచ్చిన సరి కొత్త కాంపాక్ట్ బడ్జెట్ ఎయిర్ ప్యూరిఫైర్ ‘Wozoyo Pure Air PA1’ టెక్ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. తక్కువ ధరలో.. లభించే ఈ ఎయిర్ ప్యూరిఫైర్ ఎలా పనిచేస్తుది? ఇందులో ఏయే ఫీచర్లు ఉన్నాయి? కొన్ని ఫీచర్లు మిస్ అవ్వడానికి కారణం ఏంటి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఈ ఎయిర్ ప్యూరిఫైర్ మెయిన్ హైలైట్ దీని సైజ్ అనే చెప్పాలి. ఇది చాలా కాంపాక్ట్ , లైట్‌వెయిట్ డిజైన్‌తో వస్తుంది. దీని వల్ల పెద్ద పెద్ద రూమ్స్ లోనే కాకుండా చిన్న బెడ్‌రూమ్‌లు, స్టడీ రూమ్‌లు లేదా ఆఫీస్ డెస్క్ మీద కూడా దీనిని చాలా ఈజీగా సర్దుకోవచ్చు. ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకువెళ్లడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీని మినిమలిస్టిక్ లుక్ ఏ ఇంటి ఇంటీరియర్‌కైనా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది.
ఇంట్లోని గాలిలో ఉండే దుమ్ము, ధూళి కణాలు, చిన్నపాటి అలర్జెన్‌లను తొలగించడంలో ఈ ప్యూరిఫైయర్ తన వంతు పాత్ర పోషిస్తుంది. గదిలోని గాలిని పీల్చుకుని దానిని శుభ్రపరిచి తిరిగి స్వచ్ఛమైన గాలిని గది అంతటా వ్యాపించేలా చేస్తుంది. రోజూ మనం పీల్చే గాలిని స్వచ్ఛంగా ఉంచడానికి ఇది బేసిక్ లెవల్ ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఈ ప్యూరిఫైర్ బడ్జెట్ ధరలో దొరికినప్పటికీ, కొన్ని లేటెస్ట్ ఫీచర్లు ఇందులో మిస్ అయ్యాయని చెప్పాలి. ప్రీమియం మోడల్స్‌లో కనిపించే రియల్-టైమ్ ఎయిర్ క్వాలిటీ డిస్‌ప్లే , ఆటోమేటిక్ స్పీడ్ అడ్జస్ట్‌మెంట్ సెన్సార్లు, స్మార్ట్ యాప్ కనెక్టివిటీ వంటివి ఇందులో కనిపించవు. అలాగే.. పెద్ద హాల్స్ లేదా విశాలమైన ప్రదేశాల కోసం ఇది సరిపోకపోవచ్చు. కేవలం చిన్న రూమ్స్‌కు మాత్రమే ఇది పరిమితం అవుతుంది.
Also Read: రూ.50 వేలలోపు కొత్త ల్యాప్‌టాప్.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కడం ఖాయం
ఈ డివైజ్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని ధర అనే చెప్పొచ్చు. పెద్ద బడ్జెట్ పెట్టలేము అనుకునే వారికి ఇది చాలా తక్కువ ధరలోనే.. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. దీని ధర కారణంగా ఎయిర్ ప్యూరిఫైర్ వాడకం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికీ ఇదొక మంచి ప్రత్యామ్నాయంగా మారుతుంది.
మీ బడ్జెట్‌లో ఎక్కువ ఖర్చు పెట్టకుండా.. చిన్న రూమ్స్ కోసం ఒక సాధారణ, కాంపాక్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ కావాలనుకుంటే.. నిస్సందేహంగా ఒక ఆప్షన్ అవుతుంది. అయితే అడ్వాన్స్‌డ్ స్మార్ట్ ఫీచర్లు, AQI డిస్‌ప్లే కోరుకునేవారు మాత్రం ఇతర హై-ఎండ్ మోడల్స్‌ను ఎంచుకోవడం మంచిది.