E-Paper
Advertisement

రూ.50 వేలలోపు కొత్త ల్యాప్‌టాప్.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కడం ఖాయం

రూ.50 వేలలోపు కొత్త ల్యాప్‌టాప్.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కడం ఖాయం
Advertisement

Infinix INBook X1 laptop: ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసులు , కార్పొరేట్ ఉద్యోగాల కోసం ల్యాప్‌టాప్‌ల అవసరం ప్రతి ఒక్కరికీ విపరీతంగా పెరిగింది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్ , ఫాస్ట్ పర్ఫామెన్స్ అందించే ల్యాప్‌ టాప్‌లను యూజర్లు ఎక్కువగా కోరుకుంటున్నారు.కస్టమర్ల ఈ ఆశలకు తగ్గట్టుగా ఇన్ఫినిక్స్ కంపెనీ.. మార్కెట్లోకి తెచ్చిన అద్భుతమైన మోడలే ఈ ల్యాప్‌టాప్. ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ మోడల్ ప్రత్యేకతలు, ధరకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1. స్లిమ్, లైట్‌వెయిట్ డిజైన్ :

ఈ ల్యాప్‌టాప్ మెయిన్ అట్రాక్షన్ దీని డిజైన్. కేవలం 1.48 కేజీల బరువు మాత్రమే ఉండే ఈ ల్యాప్‌ టాప్‌ను ఎక్కడికైనా బ్యాగ్‌లో వేసుకుని తీసుకెళ్లడం చాలా ఈజీ. దీనికి ఇచ్చిన ‘అరాధన గ్రీన్ కలర్, మెటాలిక్ ఫినిషింగ్ దీనికి ఒక లగ్జరీ లుక్‌ను ఇస్తాయి. స్టూడెంట్స్ , తరచూ ప్రయాణాలు చేసే ఉద్యోగులకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

2. పెర్ఫార్మెన్స్:

Advertisement

పెర్ఫార్మెన్స్ పరంగా ఈ ల్యాప్‌ టాప్ చాలా అద్భుతంగా ప నిచేస్తుంది. ఇందులో.. ఇంటెల్ కోర్ i5 టెన్త్ జనరేషన్ ప్రాసెసర్‌ను అందించారు. దీనికి తోడు.. 8GB RAM, 512GB SSD స్టోరేజ్ ఉండటం వల్ల ల్యాప్‌ టాప్ చాలా వేగంగా రన్ అవుతుంది. ఒకే సారి ఎక్కువ యాప్‌లను రన్ చేసినప్పటికీ ఎలాంటి లాగ్ సమస్యలు ఉండవు. అలాగే ఫైల్స్ స్టోర్ చేయడానికి 512GB ఎస్ఎస్‌డీ తగినంత స్టోరేజ్ కలిగి ఉంటుంది.

3. డిస్‌ప్లే, కీబోర్డ్ :

ఈ ల్యాప్‌టాప్‌లో 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను వాడారు. వీడియోలు చూసేటప్పుడు లేదా ఆఫీస్ ప్రెజెంటేషన్లు తయారు చేసేటప్పుడు విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే దీని బ్యాక్‌లిట్ కీబోర్డ్ చీకటిలో కూడా టైప్ చేయడానికి ఎంతగానో సహాయ పడుతుంది. ఎర్గోనామిక్ డిజైన్ కారణంగా గంటల తరబడి టైప్ చేసినా చేతులకు ఎలాంటి నొప్పి రాదు.

4. బ్యాటరీ బ్యాకప్, కనెక్టివిటీ :

Advertisement

ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం. ఇన్ఫినిక్స్ INBook X1 లో పవర్‌ ఫుల్ బ్యాటరీని అందించారు. ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. రోజంతా నిరంతరంగా పని చేసుకోవచ్చు. టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. అలాగే ఎక్కువ కనెక్టివిటీ పోర్టులు, వైర్‌ లెస్ కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Also Read: పార్టీ లవర్స్‌కు నెక్స్ట్ లెవెల్ ట్రీట్..చూడటానికి క్లాస్, సౌండ్‌లో మాస్

5. ధర:

ఇన్ని ప్రీమియం ఫీచర్లు, i5 ప్రాసెసర్ , 512GB SSD స్టోరేజ్ ఇస్తూ మార్కెట్లో.. దీని ధర కేవలం రూ. 47,999 వరకు ఉంది. బడ్జెట్ ధరలో.. ఒక నమ్మకమైన, స్టైలిష్ ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా సూపర్ డీల్.

మీ బడ్జెట్‌లో ఎక్కువ ఖర్చు పెట్టకుండా..తక్కువ బరువుతో కూడిన స్టైలిష్, ఫాస్ట్ ల్యాప్‌ టాప్ కావాలనుకుంటే .. ఈ మోడల్ మీకు పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంటెల్ i5 ప్రాసెసర్, 512GB SSD, తక్కువ ధరతో వస్తున్న ఈ ల్యాప్‌ టాప్‌ను మీరు కూడా ఆన్‌లైన్‌లో ట్రై చేసి మీ ప్రొఫెషనల్, స్టడీ లైఫ్‌ను మరింత ఈజీగా మార్చుకోండి!

Related News

నెలకు రూ.399 మాత్రమే.. 3300GB డేటాతో పాటు 500+ టీవీ ఛానెల్స్ ఫ్రీ!

పార్టీ లవర్స్‌కు నెక్స్ట్ లెవెల్ ట్రీట్..చూడటానికి క్లాస్, సౌండ్‌లో మాస్

ట్రెండింగ్‌లో బెస్ట్ స్లిమ్ పవర్ బ్యాంక్.. అసలు ధర తెలిస్తే షాక్ అవుతారు!

జియో 10వ వార్షికోత్సవ కానుక.. ఆ పాపులర్ ప్లాన్‌పై 120GB డేటా, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!

ఈ స్మార్ట్ టీవీ ఉంటే.. థియేటర్ ఎందుకు చెప్పండి!

పాత ట్యాబ్‌ను కిచెన్ డిస్‌ప్లేగా ఇలా మార్చుకుంటే.. వంట చేయడం మరింత ఈజీ అవుతుంది!

ఫాస్ట్ ఛార్జర్ పేరుతో ఈ తప్పు చేస్తున్నారా? ఫోన్‌కే కాదు.. మీకూ ప్రమాదమే!

Big Stories

Advertisement
×