BSNL Broadband Plan: ఇంట్లో వైఫై పెట్టుకోవాలంటే నెలనెలా ఎక్కువ బిల్లు చెల్లించాల్సి వస్తుందని చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే తక్కువ ధరలో మంచి స్పీడ్‌తో ఇంటర్నెట్ కావాలనుకునే వారికి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL అందిస్తున్న ఓ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఉపయోగపడేలా ఉంది. నెలకు రూ.399కే ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్‌తో పాటు మరికొన్ని సదుపాయాలు కూడా లభిస్తాయి.
BSNL అందిస్తున్న ఈ ప్లాన్ పేరు ‘ఫైబర్ స్పార్క్’. దీని సాధారణ నెలవారీ ధర రూ.449గా ఉంది. అయితే ప్రస్తుతం అందిస్తున్న ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా మొదటి 12 నెలలు నెలకు రూ.399కే ఈ ప్లాన్‌ను పొందొచ్చు. అంటే ఏడాది పాటు ప్రతి నెలా రూ.50 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. 13వ నెల నుంచి మాత్రం సాధారణ ధర అయిన రూ.449 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ప్లాన్‌లో 50 mbps వేగంతో ఇంటర్నెట్ అందుతుంది. ఇంటి నుంచి ఆఫీస్ పని చేసుకోవడం, వీడియో కాల్స్ మాట్లాడటం, ఆన్‌లైన్ క్లాసులు వినడం, సినిమాలు చూడటం వంటి సాధారణ అవసరాలకు ఈ స్పీడ్ సరిపోతుంది. అంతేకాకుండా నెలకు ఏకంగా 3300 GB డేటా లభిస్తుంది. ఈ డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 4 mbpsకు తగ్గుతుంది.
Also Read: జియో 10వ వార్షికోత్సవ కానుక.. ఆ పాపులర్ ప్లాన్‌పై 120GB డేటా, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!
ఇంటర్నెట్‌తో పాటు ల్యాండ్‌లైన్ సదుపాయం కూడా ఈ ప్లాన్‌లో ఉంటుంది. దీని ద్వారా దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే ల్యాండ్‌లైన్ ఫోన్‌ను మాత్రం వినియోగదారులే కొనుగోలు చేసుకోవాలి. ఇంటర్నెట్, ఫోన్ రెండూ ఒకే కనెక్షన్‌లో ఉండటం ఈ ప్లాన్‌లో మరో ప్రయోజనం.
ఈ ప్లాన్‌లో IFTV సదుపాయం కూడా అందిస్తున్నారు. దీని ద్వారా ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా 500కుపైగా ఉచిత టీవీ ఛానెల్స్ చూసే అవకాశం ఉంటుంది. దీంతో ఇంటర్నెట్‌తో పాటు వార్తలు, వినోద కార్యక్రమాలు, పిల్లల కోసం కార్టూన్లు వంటి వాటిని కూడా చూడొచ్చు.
రూ.399 ఆఫర్‌లో ఉన్న ఫైబర్ స్పార్క్ ప్లాన్‌కు ముందస్తుగా 6 నెలలు లేదా ఏడాది బిల్లు చెల్లించే అవకాశం లేదు. ప్రతి నెలా బిల్లు చెల్లించే విధానంలోనే ఈ ప్లాన్‌ను తీసుకోవాలి. అయితే ఈ ప్లాన్ మీ ప్రాంతంలో అందుబాటులో ఉందో లేదో ముందుగా తెలుసుకోవడం మంచిది. BSNL యాప్ లేదా సమీపంలోని BSNL కార్యాలయంలో వివరాలు తెలుసుకుని కనెక్షన్ తీసుకోవచ్చు.
Also Read: పాత ట్యాబ్‌ను కిచెన్ డిస్‌ప్లేగా ఇలా మార్చుకుంటే.. వంట చేయడం మరింత ఈజీ అవుతుంది!