E-Paper
Advertisement

బ్యాటరీతో పనిచేసే స్మార్ట్ ప్రొజెక్టర్.. కరెంట్ లేని చోట కూడా సినిమాలు చూసేయొచ్చు!

బ్యాటరీతో పనిచేసే స్మార్ట్ ప్రొజెక్టర్.. కరెంట్ లేని చోట కూడా సినిమాలు చూసేయొచ్చు!
Advertisement

XElectron PocketBeam: నేటి ఆధునిక యుగంలో కూడా థియేటర్లకు వెళ్లి, టికెట్ కొనుక్కుని సినిమా చూసేవాళ్లు చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పుడంతా ఇంట్లోనే సినిమా హాల్ లాంటి బిగ్ స్క్రీన్‌ కలిగి ఉన్న టీవీలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి. అయితే టీవీల సైజు పెరిగే కొద్దీ వాటి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతుంటాయి. దీనికి తోడు.. ప్రొజెక్టర్లు వాడాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు ఉండాల్సిందే. కానీ, కరెంట్ లేనిచోట కూడా పెద్ద స్క్రీన్ మీద సినిమా చూసేలా ప్రముఖ XElectron కంపెనీ సరికొత్త ‘పాకెట్‌బీమ్’ పోర్టబుల్ స్మార్ట్ ప్రొజెక్టర్‌‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

కరెంటు లేకుండానే ఫుల్ మూవీ చూడొచ్చు:

ఈ ప్రొజెక్టర్ ఇన్‌బిల్ట్ 3200mAh బ్యాటరీని కలిగి ఉండటంతో.. దీనిని వాడటానికి కరెంటు సాకెట్‌ అవసరం లేదు. ఒక్కసారి ఫుల్‌ఛార్జ్ చేస్తే.. నిరంతరాయంగా రెండు గంటలకు పైగా సినిమాను చూడొచ్చు. దీనివల్ల ట్రావెలింగ్‌లో గానీ, అవుట్‌డోర్ క్యాంపింగ్స్‌లో గానీ, లేదా కరెంట్ పోయినప్పుడు కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎలాంటి ఢోకా ఉండదు.

Advertisement

Also Read: జేబులో పట్టేంత JBL మినీ స్పీకర్.. అది కూడా స్మార్ట్ AI ఫీచర్లతో, ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

సైజు చిన్నదే.. స్క్రీన్ మాత్రం పెద్దది:

ఈ ప్రొజెక్టర్ చూడటానికి చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. దీని బరువు కేవలం 600 గ్రాములు మాత్రమే. దీంతో విహారయాత్రలు, అవుట్‌డోర్ పార్టీల కోసం ఈ ప్రొజెక్టర్‌ను బ్యాగ్‌లో పెట్టుకుని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇది 150 అంగుళాల వరకు భారీ ప్రొజెక్షన్ సైజును అందిస్తుంది. దీనిలో 720P హెచ్‌డీ రిజల్యూషన్ ఉన్నప్పటికీ.. 1080P వీడియోలను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే దీనిలోని 6000 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్ వల్ల పిక్చర్ క్వాలిటీ చాలా స్పష్టంగా ఉంటుంది.

స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్:

Advertisement

ఈ పాకెట్‌బీమ్ ప్రొజెక్టర్ ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. దీనిలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్‌లు ముందే ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. అలాగే వై-ఫై, బ్లూటూత్ సదుపాయం ఉండటం వల్ల స్మార్ట్‌ఫోన్‌ను నేరుగా వైర్‌లెస్‌గా దీనికి కనెక్ట్ చేసి స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. ఇక రిమోట్ ద్వారానే ఫోకస్ అడ్జస్ట్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

ధర ఎంతంటే?

ఈ ప్రొజెక్టర్ లోపలే స్పీకర్లు కూడా ఉన్నాయి. దీంతో విడిగా స్పీకర్ల కొనే అవసరం కూడా పెద్దగా ఉండదు. ఈ ప్రొజెక్టర్ ధరను రూ.9,990గా నిర్ణయించారు. దీనిని అమెజాన్, ఎక్స్‌ఎలక్ట్రాన్ వెబ్‌సైట్‌లలో కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రొజెక్టర్‌పై ఏడాది పాటు వారంటీ కూడా లభిస్తుంది.

Also Read: వేసవిలో చల్లని కబురు.. టాప్ బ్రాండ్ రిఫ్రిజిరేటర్ల‌పై ఏకంగా 50% తగ్గింపు, ఎగబడి కొంటున్న జనం!

Related News

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

Big Stories

Advertisement
×