E-Paper
Advertisement

వేసవిలో చల్లని కబురు.. టాప్ బ్రాండ్ రిఫ్రిజిరేటర్ల‌పై ఏకంగా 50% తగ్గింపు, ఎగబడి కొంటున్న జనం!

వేసవిలో చల్లని కబురు.. టాప్ బ్రాండ్ రిఫ్రిజిరేటర్ల‌పై ఏకంగా 50% తగ్గింపు, ఎగబడి కొంటున్న జనం!
Advertisement

Summer Sale 2026: వేసవి మొదలైందంటే చాలు.. మనందరికీ గుర్తొచ్చే మొదటి వస్తువు రిఫ్రిజిరేటర్. ఎండల నుంచి ఉపశమనం కోసం చల్లని నీరు, తాజా పండ్లు ఉండాలంటే ఇంట్లో మంచి ఫ్రిడ్జ్ ఉండాల్సిందే. అందుకేనేమో.. ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు ఈ సీజన్‌లో సామాన్యులు సైతం కొనగలిగేలా బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్లపై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఒకవేళ మీరు కూడా మీ పాత ఫ్రిడ్జ్‌ను మార్చాలనుకున్నా, కొత్తది కొనాలనుకున్నా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

రిలయన్స్ సైడ్ బై సైడ్ ఆఫర్లు:

చాలామందికి పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని ఆశ ఉంటుంది కానీ, బడ్జెట్ అడ్డు వస్తుంది. అయితే రిలయన్స్ డిజిటల్ ఇప్పుడు ‘సైడ్ బై సైడ్’ మోడల్స్‌పై దాదాపు 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ముఖ్యంగా శాంసంగ్, ఎల్జీ వంటి టాప్ బ్రాండ్ల మీద మంచి డీల్స్ ఉన్నాయి. లక్షన్నర పైన ఉండే ప్రీమియం ఫ్రిడ్జ్‌లు ఇప్పుడు ఆఫర్ల తర్వాత చాలా అందుబాటులోకి వచ్చాయి. ఇవే కాకుండా క్రెడిట్ కార్డులు వాడితే మరికొంత క్యాష్‌బ్యాక్ కూడా దొరుకుతోంది.

Advertisement

Also Read: రిమోట్ పనిచేయనప్పుడు ఒక్కటి ఇస్తాం చూశారా.. దాని వెనుకున్న అసలు గుట్టు ఇదే!

అమెజాన్ గ్రేట్ సేవింగ్స్:

అమెజాన్ ఇండియాలో ఎప్పుడూ ఏదో ఒక సేల్ జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం గృహోపకరణాలపై భారీ తగ్గింపులు నడుస్తున్నాయి. ఇక్కడ హేయర్, వర్ల్‌పూల్ బ్రాండ్ల సింగిల్ డోర్ ఫ్రిడ్జ్‌లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న మోడల్స్‌పై 30 నుండి 40 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది. ముఖ్యంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్లలో పాత ఫ్రిడ్జ్‌కు మంచి ధర పలుకుతుండటం ఇక్కడి ప్రత్యేకత.

ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ సేల్:

Advertisement

ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ ఫాబ్‌గ్రాబ్ ఫెస్ట్ వంటి సేల్స్ నడుస్తున్నాయి. దీనిలో కేవలం ఫ్లాట్ డిస్కౌంట్లు మాత్రమే కాకుండా.. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉండటంతో సామాన్యులకు భారం అనిపించదు. గోద్రెజ్, ఎల్జీ డబుల్ డోర్ మోడల్స్ ఇక్కడ సెల్లింగ్ పాయింట్‌గా ఉన్నాయి. కొన్ని నిర్దిష్ట బ్యాంకు కార్డుల మీద అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తోంది.

టాటా క్లిక్, క్రోమా డీల్స్:

ఒకవేళ మీకు బ్రాండెడ్ ఫ్రిడ్జ్‌లు కావాలనుకుంటే.. టాటా క్లిక్, క్రోమా వెబ్‌సైట్లలో కూపన్ కోడ్స్ వాడుకోవచ్చు. ఇక్కడ ఎల్జీ, బాష్ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లపై ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు ఉంటున్నాయి. కొన్ని ప్రీమియం మోడల్స్‌పై రూ.20,000 నుండి రూ.30,000 వరకు నేరుగా ధర తగ్గుతోంది. అయితే ఏ ఫ్రిడ్జ్ కొనాలన్నా.. స్టార్ రేటింగ్ చెక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే.. ఫ్రిడ్జ్ ధర తగ్గినా, కరెంట్ బిల్లు తక్కువ వచ్చేలా చూసుకోవడం కూడా ముఖ్యమే కదా!

Also Read: ఓరినాయనో.. 100 ఇంచుల భారీ 4K టీవీ ఇంత తక్కువ ధరలోనా?

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×