E-Paper
Advertisement

జేబులో పట్టేంత JBL మినీ స్పీకర్.. అది కూడా స్మార్ట్ AI ఫీచర్లతో, ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

జేబులో పట్టేంత JBL మినీ స్పీకర్.. అది కూడా స్మార్ట్ AI ఫీచర్లతో, ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!
Advertisement

JBL Speakers: సంగీత ప్రియుల కోసం ప్రముఖ జేబీఎల్ నుంచి మరో రెండు అద్భుతమైన బ్లూటూత్ స్పీకర్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. తమ పాపులర్ మోడల్స్ అయిన ఎక్స్‌ట్రీమ్, గో సిరీస్‌లలో సరికొత్త వెర్షన్లను కంపెనీ అనౌన్స్ చేసింది. మునుపటి మోడల్స్ కంటే.. మెరుగైన బేస్, అధునాతన ఫీచర్లతో వస్తున్న ఈ స్పీకర్లు మ్యూజిక్ లవర్స్‌కు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. అంతేకాదు.. జేబీఎల్ ఎక్స్‌ట్రీమ్ 5, జేబీఎల్ గో 5 పేరుతో వస్తున్న ఈ స్పీకర్లలో ఏఐ టెక్నాలజీని కూడా జోడించడం విశేషం.

పవర్‌ఫుల్ సౌండ్‌తో ఎక్స్‌ట్రీమ్ 5:

కాస్త పెద్ద సైజులో, పవర్‌ఫుల్ సౌండ్ కోరుకునే వారి కోసం ఎక్స్‌ట్రీమ్ 5ను డిజైన్ చేశారు. మునుపటి ఎక్స్‌ట్రీమ్ 4 తో పోలిస్తే దీనిలో 10 శాతం ఎక్కువ బేస్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. దీనిలోని కొత్త అకౌస్టిక్ డిజైన్ వల్ల పాటలు ఎంత వాల్యూమ్‌లో విన్నా డిస్టార్షన్ లేకుండా స్పష్టంగా వినిపిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే డ్యూయల్ ట్వీటర్లు, సబ్‌వూఫర్ కాంబినేషన్ మ్యూజిక్ క్వాలిటీని మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 24 గంటల పాటు పాటలు వినొచ్చు. అంతేకాదు.. ప్లేటైమ్ బూస్ట్ ఫీచర్ ద్వారా మరో 4 గంటల బ్యాటరీ లైఫ్ పొందే అవకాశం కూడా ఉంటుంది.

Advertisement

Also Read: వాట్సాప్ హ్యాకర్ల కొత్త స్కెచ్.. మీ చాట్స్ సేఫ్‌గా ఉండాలంటే వెంటనే ఈ 5 సెట్టింగ్స్ మార్చండి!

చిన్న సైజులో స్మార్ట్ గో 5:

జేబీఎల్ గో 5 చూడటానికి చాలా చిన్నదిగా ఉన్నా.. దీని సౌండ్ మాత్రం మామూలుగా ఉండదు. ఈ స్పీకర్ అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నగా ఉండి.. బయటికి వెళ్లేటప్పుడు తీసుకెళ్లడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాగే దీనిలో కొత్తగా ఇచ్చిన ‘హోలో కాంటూర్ లోగో’ డిజైన్ కేవలం లుక్ కోసం మాత్రమే కాకుండా, సౌండ్ అవుట్‌పుట్‌ను పెంచడానికి కూడా ఉపయోగపడుతుందట. ఈ బుజ్జి స్పీకర్‌లో ఎయిర్ టచ్ అనే ఒక వింతైన ఫీచర్ ఉంది. రెండు గో 5 స్పీకర్లను ఒకదానికొకటి తాకించడం ద్వారా వెంటనే వాటిని స్టీరియో మోడ్‌లోకి మార్చుకోవచ్చు. దీని బ్యాటరీ లైఫ్ కూడా మునుపటి కంటే మెరుగ్గా.. సుమారు 8 నుంచి 10 గంటల వరకు పనిచేస్తుంది.

ఫీచర్ల విషయానికొస్తే:   

Advertisement

ఈ రెండు స్పీకర్లలో అత్యంత ఆకర్షణీయమైన విషయం ‘స్మార్ట్ ఈక్యూ మోడ్’. ఇది ఏఐ సహాయంతో మనం వినే కంటెంట్‌ను బట్టి సౌండ్ సెట్టింగ్స్‌ను మారుస్తుంది. ఒకవేళ మీరు పాటలు వింటున్నప్పుడు ఒక రకమైన సెట్టింగ్, పాడ్‌కాస్ట్ వింటున్నప్పుడు మాటలు స్పష్టంగా వినిపించేలా మరో రకమైన సెట్టింగ్‌ను ఇది ఆటోమేటిక్‌గా సెట్ చేస్తుంది. వీటికి ఐపి 68 రేటింగ్ ఉండటం వల్ల నీరు, ధూళి నుంచి రక్షణ లభిస్తుంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఎక్స్‌ట్రీమ్ 5 ధర రూ.35,000 వరకు ఉండగా.. గో 5 ధర కేవలం రూ.4,500 లోపే ఉండే అవకాశం ఉంది.

Also Read: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. వీవో నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్, ప్రైస్ కూడా తక్కువే!  

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×