E-Paper
Advertisement

7000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే.. Xiaomi 17T Pro ఫీచర్లు లీక్, ధరెంతో తెలిస్తే షాకవ్వడం ఖాయం!

7000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే.. Xiaomi 17T Pro ఫీచర్లు లీక్, ధరెంతో తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Advertisement

Xiaomi 17T Pro: టెక్ లవర్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షియోమీ 17T సిరీస్ గురించి ఒక గుడ్‌న్యూస్ బయటకు వచ్చింది. ఈ నెల లోనే మార్కెట్లోకి రావడానికి రెడీ అవుతున్న ఈ ఫోన్.. ముఖ్యంగా బ్యాటరీ, డిస్‌ప్లే విషయంలో అంచనాలను మించిపోయేలా ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు దీని గురించే చర్చ జరుగుతోంది. ఈ ఫోన్‌లోని Pro వేరియంట్ ఫీచర్లు చూస్తుంటే.. మార్కెట్లో ఉన్న మిగతా బ్రాండ్లకు చుక్కలు కనిపించడం ఖాయం అనిపిస్తోంది.

48 గంటల బ్యాటరీ బ్యాకప్..

ఈ ఫోన్ గురించి మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది దాని బ్యాటరీ గురించే. ఏకంగా 7000mAh బ్యాటరీని షియోమీ దీనిలో సెట్ చేసింది. దీనికి తోడు 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండటంతో ఫోన్ చాలా త్వరగా ఛార్జ్ అయిపోతుంది. పైగా 50W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. కాబట్టి.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, రెండు రోజుల పాటు అసలు ఛార్జింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు.

Advertisement

Also Read: జస్ట్ రూ.250కే ఏసీ లాంటి చల్లదనం.. ఈ పిచ్చి ఎండలకు ఇదే కరెక్ట్ సొల్యూషన్!

లేటెస్ట్ ఆండ్రాయిడ్..

ఇక ఈ ఫోన్ డిస్‌ప్లే విషయానికి వస్తే.. 6.83 ఇంచుల అమోలెడ్ స్క్రీన్‌తో చాలా క్లాసీగా ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ వల్ల గేమ్స్ ఆడినా, మూవీస్ చూసినా మంచి అనుభవం ఉంటుంది. అలాగే పెర్ఫార్మెన్స్ కోసం దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 అనే పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ను వాడారు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16తో వచ్చే ఈ ఫోన్.. మల్టీ టాస్కింగ్ చేసినా సరే ఎక్కడా ఆగకుండా చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.

5x ఆప్టికల్ జూమ్ లెన్స్..

Advertisement

ఈ Xiaomi 17T Proలో 50MP మెయిన్ కెమెరాతో పాటు, దూరంగా ఉన్న వాటిని కూడా చాలా స్పష్టంగా క్యాప్చర్ చేసే 5x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియోల కోసం కూడా హై క్వాలిటీ లెన్స్‌ను వాడారు. అలాగే మెమరీ గురించి కూడా టెన్షన్ అక్కర్లేదు. 12GB RAM, 512GB స్టోరేజ్ ఆప్షన్లు ఈ హ్యాండ్ సెట్‌లో ఉండబోతున్నాయి.

ధర ఎంత ఉండొచ్చు?

ప్రస్తుతానికి లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఈ Xiaomi 17T Pro ధర రూ.90,000 వరకు ఉండొచ్చని టాక్. అదే నార్మల్ మోడల్ అయితే కొంచెం తక్కువకే రావొచ్చు. జూన్ నెలాఖరు వరకు దీనికి సంబంధించిన హడావిడి గట్టిగానే ఉండేలా ఉంది. త్వరలోనే ఇది భారత్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

Also Read: వన్‌ప్లస్ నార్డ్ CE 6 సిరీస్ వచ్చేస్తోంది.. 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో మే 7న దబిడి దిబిడే!

Related News

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×