E-Paper
Advertisement

ఓయో రూమ్ లా మారిపోయిన రైల్వే రెస్ట్ రూమ్.. అబ్బా ఏం వాడకం గురూ!

ఓయో రూమ్ లా మారిపోయిన రైల్వే రెస్ట్ రూమ్.. అబ్బా ఏం వాడకం గురూ!
Advertisement

Indian Railway Viral Video: సాధారణం రైల్వేకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అవుతుంటాయి. సీట్ల కోసం కొట్లాడుకోవడం, ఫుడ్ కంప్లైంట్స్, టికెట్ లేని ప్రయాణాలకు సంబంధించిన వీడియోలు తరచుగా నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. కానీ, తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇలాంటి వారిపై  వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

రెస్ట్ రూమే ఓయో రూమ్ గా!

తాజాగా ఓ రైల్లోని వాష్‌ రూమ్‌ ను ఒక జంట మిస్ యూజ్ చేసిన ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఒక యువ జంట రైల్వే టాయిలెట్‌ లోకి కలిసి వెళ్లిన దృశ్యాలు కనిపించడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజా ప్రదేశాల్లో ఇలాంటి ప్రవర్తన సరికాదంటూ చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ ఆ వైరల్ వీడియోలో ఏముందంటే..

Advertisement

బ్లాక్ శారీ.. రెడ్ బ్లౌజ్.. లూజ్ హెయిర్ తో ఉన్న ఓ అందమైన మహిళ కనిపిస్తుంది. ఎదురుగా ఉన్న యువకుడిని రమ్మని సైగ చేస్తూ, రైల్లోని టాయిలెట్ కు వెళ్తుంది. ఆమె వెళ్లిన కాసేపటికే, సదరు యువకుడు ఆమెతో పాటు లోపలికి వెళ్లి డోర్ వేయడం కనిపిస్తుంది. ఈ తతంగం అంతా చుట్టుపక్కల వాళ్లు చూస్తూనే ఉన్నారు. అయినా, వాళ్లు అందరు చూస్తుండగానే లోపలికి వెళ్లారు. ఈ ఘటనను ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాసేపట్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

నెటిజన్లు ఏమంటున్నారంటే?

Advertisement

వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. అందరూ చూస్తుండగానే అలా వాష్ రూమ్ లోకి వెళ్లడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. రైల్వే టాయిలెట్‌ ను ఓయో రూమ్‌ లా మార్చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు “భారతీయ రైల్వేకు స్వాగతం.. ఇక్కడ ఫుడ్, వాటర్ మాత్రమే కాదు, ఓయో రూమ్ లు కూడా రెడీగా ఉన్నాయి” అంటూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి ఘటనలపై రైల్వే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా ప్రశ్నిస్తున్నారు.

ఈ వీడియో ఏ రైలులో జరిగింది అనేది కచ్చితంగా తెలియదు. ఎప్పుడు జరిగిందో స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు. అయితే, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ ఫారమ్‌ లలో వేలాది మంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. రోజూ లక్షలాది మంది ప్రయాణించే రైళ్లలో అందరూ రూల్స్ పాటించాలంటున్నారు. ఇలాంటి వారివల్ల ఇతర ప్రయాణికులకు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రైల్వే భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ముఖ్యంగా సుదూర రైళ్లలో టిటిఈలు, ఆర్పీఎఫ్ సిబ్బంది తరచుగా తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని అంటున్నారు. కొందరు ప్రయాణికులు  రైల్వే టాయిలెట్ల దగ్గర సీసీ కెమెరాల పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడుతున్నారు.

Read Also: జారి బయటపడేవురా అయ్యా.. జీపు గోవిందా.. జీపులోని మనుషులు గోవిందా!

Related News

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

Big Stories

Advertisement
×