E-Paper
Advertisement

Xiaomi Grand Finale Sale: స్మార్ట్‌ఫోన్స్, టివి, టాబ్లెట్, వాచ్‌లపై రూ.35,000 డిస్కౌంట్.. షావోమి స్పెషల్ సేల్

Xiaomi Grand Finale Sale: స్మార్ట్‌ఫోన్స్, టివి, టాబ్లెట్, వాచ్‌లపై రూ.35,000 డిస్కౌంట్.. షావోమి స్పెషల్ సేల్
Advertisement

Xiaomi Grand Finale Sale 2025 India| చైనా టెక్ కంపెనీ షావోమీ.. భారతదేశంలో గ్రాండ్ ఫినాలే సేల్ ప్రకటించింది. 2025 సంవత్సరం ముగింపుని సెలబ్రేషన్ తో ముగించాలని షావోమీ కోరుకుంటోంది. అందుకే ఈ గ్రాండ్ ఫినాలే సేల్ లో కస్టమర్లకు రూ.35,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్స్, వాచెస్, ఇయర్‌బడ్స్ ఈ సేల్ లో ప్రత్యేక ఆఫర్లతో లభిస్తాయి. షావోమీ, రెడ్మీ రెండు బ్రాండ్ ప్రొడక్ట్స్ పై ఆ సేల్ లో భాగం. ఈ సేల్ ఇయర్-ఎండ్ అప్‌గ్రేడ్స్ ప్లాన్ చేసే బయర్లకు టార్గెట్ చేసింది.

స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్స్.. ఎంతంటే

ఈ సేల్ లో స్మార్ట్ టీవీ లైనప్‌పై షావోమీ పెద్ద డిస్కౌంట్స్ ఇస్తోంది. షావోమీ స్మార్ట్ టీవీ FX ప్రో 43 ఇప్పుడు రూ.24,999కు లభిస్తుంది. దీని అసలు ధర రూ.44,999. మూడు సంవత్సరాల ఫ్రీ వారంటీ (రూ.4,999 విలువ) కూడా ఉంది.
షావోమీ స్మార్ట్ టీవీ F32 2025 ఇప్పుడు రూ.11,499. ఈ టివి అసలు ధర రూ.24,999.
షావోమీ స్మార్ట్ 4K టీవీ F 43 2025 రూ.23,499కు వస్తోంది. అసలు ధర రూ.37,999.
షావోమీ QLED టీవీ X ప్రో సిరీస్ 65 ఇప్పుడు రూ.57,999. ముందు దీని ధర రూ.89,999.

ట్యాబ్లెట్ పై స్పెషల్ డీల్స్

Advertisement

షావోమీ ట్యాబ్లెట్స్‌పై మంచి డిస్కౌంట్స్ ఇస్తోంది.
రెడ్మీ ప్యాడ్ 2 ఇప్పుడు రూ.14,999కు లభిస్తుంది. అసలు ధర రూ.19,999. ఒక సంవత్సరం షావోమీ కంప్లీట్ ప్రొటెక్షన్ ఫ్రీ (రూ.1,999 విలువ) కూడా ఉంది.
షావోమీ ప్యాడ్ 7 ఇప్పుడు రూ.27,999కు వస్తోంది. దీని అసల ధర రూ.34,999. ఫ్రీగా రెడ్మీ బడ్స్ 5A కూడా దక్కుతుంది.

షావోమీ స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ తగ్గింపు

రెడ్మీ స్మార్ట్‌ఫోన్స్‌పై ఈ సేల్ లో మంచి ఆఫర్స్ ఉన్నాయి. రెడ్మీ నోట్ 14 5G ఇప్పుడు రూ.16,499కు దొరుకుతుంది. దీని అసలు ధర రూ.21,999. ఫ్రీ రెడ్మీ బడ్స్ కూడా ఉన్నాయి. రెడ్మీ 15C 5G ఇప్పుడు రూ.12,499. అంతకుముందు రూ.14,999. రెడ్మీ A4 5G ఇప్పుడు రూ.8,299కు వస్తోంది. అసలు ధర రూ.11,999. ఈ డీల్స్ రెడ్మీ ఫోన్‌లను బడ్జెట్ జీవులకు మరింత చేరువ చేశాయి.

Advertisement

Also Read: వాట్సాప్‌ స్టేటస్‌, చానల్‌లో యాడ్స్ వస్తున్నాయా? తొలగించాలంటే ఇలా చేయండి

స్మార్ట్‌వాచెస్, ఇయర్‌బడ్స్‌పై డిస్కౌంట్స్

షావోమీ వేరబుల్స్, ఆడియో ప్రొడక్ట్స్‌పై కూడా డిస్కౌంట్స్ ఇస్తోంది. రెడ్మీ వాచ్ మూవ్ ఇప్పుడు రూ.1,999కు లభిస్తుంది. ముందు రూ.3,999. రెడ్మీ బడ్స్ 5C రూ.1,799కు దొరుకుతున్నాయి. ముందు దీని ధర రూ.4,999. ఈ ఆఫర్లు యాక్సెసరీలను బడ్జెట్ ఫ్రెండ్లీ చేస్తాయి.

ఈ సేల్ చాలా స్పెషల్

గ్రాండ్ ఫినాలే సేల్ అన్ని కేటగిరీల్లో బలమైన వాల్యూ ఇస్తుంది. కస్టమర్లు తక్కువ ధరలకు మల్టిపుల్ డివైస్‌లు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఫ్రీ వారంటీలు, బండిల్డ్ యాక్సెసరీలు మరింత వాల్యూ యాడ్ చేస్తాయి. బడ్జెట్, ప్రీమియం బయర్లకు రెండింటికీ బెనిఫిట్. లిమిటెడ్ టైమ్ ఆఫర్లు కాబట్టి త్వరగా షాపింగ్ చేయడం మంచిది.

Related News

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×