E-Paper
Advertisement

Gadget Control Home Display: మినీ టివి స్క్రీన్‌తో ఇంట్లో గాడ్జెట్స్‌ కంట్రోల్, వీడియో కాలింగ్.. కొత్త స్మార్ట్ డిస్‌ప్లే లాంచ్

Gadget Control Home Display: మినీ టివి స్క్రీన్‌తో ఇంట్లో గాడ్జెట్స్‌ కంట్రోల్, వీడియో కాలింగ్.. కొత్త స్మార్ట్ డిస్‌ప్లే లాంచ్
Advertisement

Xiaomi Home Display| షావోమీ తన స్మార్ట్ హోమ్ ప్రొడక్ట్స్ లైనప్‌ను విస్తరించింది. ఈ కేటగిరిలో తాజాగా చైనా మార్కెట్‌లో షావోమీ కొత్త డివైస్ లాంచ్ చేసింది. ఈ ప్రొడక్ట్ పేరు షావోమీ స్మార్ట్ హోమ్ డిస్‌ప్లే 11. స్మార్ట్ హోమ్ కంట్రోల్, ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ప్రత్యేకంగా ఈ డివైజ్ తయారు చేయబడింది. పెద్ద డిస్‌ప్లేలోనే వాయిస్ కంట్రోల్ ఇంటిగ్రేట్ చేశారు. మినీ టివి లాంటి ఈ డివైజ్ ఉపయోగించి సింపుల్ కమాండ్స్‌తో మల్టిపుల్ గాడ్జెట్లు మేనేజ్ చేయవచ్చు. చాలా తక్కువ ధరకే లభించే ఈ హోమ్ డిస్‌ప్లే ఫీచర్లు, డిజైన్, వివరాలు చూద్దాం.

ఐ ప్రొటెక్షన్ కలిగిన పెద్ద డిస్‌ప్లే

ఈ కొత్త స్మార్ట్ హోమ్ డిస్‌ప్లే లో 11 ఇంచుల స్క్రీన్ ఉంది. ఈ డిస్‌ప్లే ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ ఇస్తుంది. 1920 x 1200 పిక్సెల్స్‌తో క్లియర్ విజువల్స్ లభిస్తాయి. స్క్రీన్ 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. ఇండోర్ లైటింగ్‌లో సౌకర్యవంతంగా చూడవచ్చు. TUV రైన్‌ల్యాండ్ ఐ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ ఉంది. లాంగ్ యూసేజ్‌లో కళ్లు అలసట రాకుండా చేస్తుంది.

స్ట్రాంగ్ ఆడియో పెర్ఫామెన్స్

Advertisement

ఈ డివైజ్‌లో షావోమీ రియర్-మౌంటెడ్ (వెనుకవైపు) స్పీకర్లు పెట్టింది. స్పీకర్ సెటప్ లౌడ్, క్లియర్ సౌండ్ ఇస్తుంది. రోజువారీ ఎంటర్‌టైన్‌మెంట్, వీడియో కాలింగ్‌కు సూటెబుల్. మ్యూజిక్, వీడియోలు, వాయిస్ కమాండ్స్‌కు మంచి ఆడియో క్వాలిటీ ఉంటుంది.

ఏఐ సపోర్ట్‌తో స్మార్ట్ హోమ్ కంట్రోల్

ఈ డివైస్ ఏఐ పవర్డ్ ఫ్యామిలీ హబ్‌గా పనిచేస్తుంది. స్మార్ట్ హోమ్ గాడ్జెట్లు సులభంగా కంట్రోల్ చేయవచ్చు. లైట్స్, కెమెరాలు, ఇతర కనెక్టెడ్ డివైస్‌లు సపోర్ట్ చేస్తుంది. వాయిస్ కమాండ్స్ తో ఆపరేషట్ చేయవచ్చు. సిస్టమ్ త్వరగా, కచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. క్రాస్-ప్లాట్‌ఫామ్ వాయిస్ కంట్రోల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అందే ఇతర బ్రాండ్స్ తో పాటు వివిధ కంపాటిబుల్ స్మార్ట్ హోమ్ ప్రొడక్ట్స్‌తో కూడా పనిచేస్తుంది.

షావోమీ హైపర్ ఓఎస్‌తో పవర్

Advertisement

స్మార్ట్ హోమ్ డిస్‌ప్లే 11 షావోమీ హైపర్ ఓఎస్‌పై రన్ అవుతుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. స్మూత్ నావిగేషన్, పెర్ఫామెన్స్ లభిస్తుంది. ఇంటర్‌ఫేస్ క్లీన్, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. రోజువారీ హోమ్ యూసేజ్ కోసం డిజైన్ చేశారు. ఆడియో, వీడియో కంటెంట్ సపోర్ట్ చేస్తుంది. పోర్టబుల్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ లాగా పనిచేస్తుంది.

వీడియో కాలింగ్ కోసం కెమెరా

షావోమీ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా జోడించింది. కెమెరా HD వీడియో కాలింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫ్యామిలీ తో వర్చువల్ కమ్యూనికేషన్‌ చేయడానికి చాలా సౌలభ్యం ఉంటుంది. కెమెరా ఫ్రంట్ ప్యానెల్‌పై ఉంటుంది. రోజువారీ కాల్స్‌కు క్లియర్ వీడియో క్వాలిటీ ఇస్తుంది.

సింపుల్ డిజైన్ కిక్‌స్టాండ్‌

డివైస్ మినిమల్ డిజైన్‌తో ఉంటుంది. ఏ సర్ఫేస్‌పైనా క్లీన్, మోడర్న్‌గా కనిపిస్తుంది. షావోమీ బిల్ట్-ఇన్ కిక్‌స్టాండ్ ఇచ్చింది. కిక్‌స్టాండ్‌తో అప్‌రైట్ ప్లేస్‌మెంట్ చేయవచ్చు. టేబుల్స్, షెల్ఫ్‌లపై పెట్టవచ్చు. కాంపాక్ట్ టెలివిజన్ లాగా అనిపిస్తుంది. ట్రెడిషనల్ ట్యాబ్లెట్ లాగా పనిచేయదు.

అడ్వాన్స్‌డ్ ఏఐ, స్మార్ట్ ఫీచర్లు

ఈ డివైజ్‌లో షావోమీ ఏఐ లార్జ్ మోడల్ క్వశ్చన్ ఆన్సరింగ్ జోడించింది. ప్రశ్నలు అడిగితే తక్షణం రెస్పాన్స్ వస్తుంది. పిక్చర్ ఫ్రేమ్ మోడ్ సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ ఐడిల్‌గా ఉన్నప్పుడు ఫోటోలు డిస్‌ప్లే చేయవచ్చు. హోమ్ డెకార్, యూజబిలిటీ పెరుగుతుంది. 7 కంటే ఎక్కువ భాషా డయలెక్ట్స్ గుర్తిస్తుంది. వాయిస్ ఇంటరాక్షన్ కచ్చితత్వం మెరుగుపడుతుంది.

Also Read: ఏఐతో డబ్బు సంపాదించడం ఎలా? సింపుల్ టిప్స్ ఇవిగో

ధర, లభ్యత వివరాలు

షావోమీ స్మార్ట్ హోమ్ డిస్‌ప్లే 11 చైనాలో లాంచ్ అయింది. చైనా మార్కెట్‌లో దీని ధర 1,299 యువాన్. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.16,600కు సమానం. ప్రపంచవ్యాప్తంగా కూడా మరి కొన్ని నెల్లలో ఈ సూపర్ డిస్‌ప్లే అందుబాటులో ఉంటుంది.

ఈ డివైస్ చాలా ప్రత్యేకం ఎందుకంటే

ఈ డిస్‌ప్లే స్మార్ట్ హోమ్ మేనేజ్‌మెంట్ సులభతరం చేస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్, కంట్రోల్ కలగలిపిన ఫీచర్లు ఉన్నాయి. వాయిస్ కమాండ్స్‌తో మాన్యువల్ ఇంటరాక్షన్ తగ్గుతుంది. కెమెరాతో ఫ్యామిలీ కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. పెద్ద స్క్రీన్ రోజువారీ యూజబిలిటీ పెంచుతుంది. మోడర్న్ స్మార్ట్ హోమ్స్‌కు ఇది సూటెబుల్ డివైజ్.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×