Earn Money Using AI| చాలా మంది డిగ్రీలు, ఇంజినీరింగ్ సర్టిఫికేట్లు, మెడికల్ క్వాలిఫికేషన్లు గర్వంగా చూపిస్తారు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్కిల్స్ లేకపోలే ఈ సర్టిఫికేట్ల విలువ తగ్గిపోతోంది. కంపెనీలు ఇంటర్వ్యూలో ముందు ఏఐ గురించి మీకు ఎంత తెలుసు అని చూస్తున్నాయి. మార్కులు, కాలేజీ, అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్ కంటే ఏఐ స్కిల్స్ ఉద్యోగార్హతకు కీలకంగా మారాయి. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీ ఇప్పుడు ఏఐ టూల్స్‌పై ఆధారపడుతోంది.
అద్భుతమైన క్రియేటివ్ కంటెంట్ సృష్టించడంలో ఏఐ సహాయపడుతోంది. ఉదాహరణకు మీకు ఎలాంటి వీడియో కావాలో వివరంగా చాట్‌జిపిటి, గూగుల్ జెమిని ఏఐ ప్రో లాంటి టూల్స్ ని అడిగితే.. అవి అందమైన, అద్భుతమైన వీడియోలు తయారు చేస్తుంది. సింపుల్ ప్రాంప్ట్స్‌తో రియలిస్టిక్ విజువల్స్ జనరేట్ చేస్తుంది. ఏఐతో ఎవరైనా తమ ఊహను శక్తివంతమైన విజువల్ స్టోరీస్‌గా మార్చవచ్చు. ఇదంతా చేయడానికి క్రియేటివిటీగా ఆలోచించాలి. ఖరీదైన ఎక్విప్‌మెంట్‌పై అవసంర లేదు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సామాన్యులకు పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా డబ్బు సంపాదించడంలో సహాయపడుతుంది. అడ్వాన్స్‌డ్ డిగ్రీలు లేదా ఖరీదైన ఎక్విప్‌మెంట్ అవసరం లేదు. బేసిక్ ఇంటర్నెట్, నేర్చుకోవాలనే ఆసక్తి మాత్రమే చాలు.
ఏఐ వీడియోలు, ఇమేజెస్, పోస్ట్‌లు త్వరగా తయారు చేస్తుంది. యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయవచ్చు. స్క్రిప్ట్స్, క్యాప్షన్స్, ఐడియాలు ఏఐ రాస్తుంది. యాడ్స్, స్పాన్సర్‌షిప్స్, అఫిలియేట్ లింక్స్‌తో సంపాదించవచ్చు.
ఏఐ మీకు ప్రాఫిటబుల్ కంటెంట్ ఐడియాలు సజెస్ట్ చేస్తుంది. ఏఐ బిజినెస్, ఏఐ మనీ టాపిక్స్‌పై వీడియోలు చేయండి. ఈ టాపిక్స్ భారీ ఆడియన్స్, మంచి రెవెన్యూ తెస్తాయి. ఇలాంటి టాపిక్స్ ఉన్న వీడియోలు చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తాయి. వారికి లక్షల్లో ఆదాయం వస్తుంది. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ వంటి టూల్స్ డైలీ ఉపయోగించాలి. ఇవి టైమ్ సేవ్ చేసి ప్రొడక్టివిటీ పెంచుతాయి.
ఏఐ ఫ్రీలాన్సర్లకు పని త్వరగా, మెరుగ్గా చేయిస్తుంది. రైటింగ్, డిజైన్, ట్రాన్స్‌లేషన్ సర్వీసెస్ ఆఫర్ చేయవచ్చు. ఫైవర్, అప్‌వర్క్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో గ్లోబల్ క్లయింట్స్ మీ నైపుణ్యం, పనితీరు చూసి మంచి పారితోషికం ఇస్తున్నారు.
ఏఐతో ఆన్‌లైన్ కోర్సులు సులువుగా తయారు చేయవచ్చు. నోట్స్, ప్రెజెంటేషన్స్, క్విజ్‌లు రెడీ చేస్తుంది. స్పోకెన్ ఇంగ్లీష్, ఎగ్జామ్ ప్రిపరేషన్ బోధించవచ్చు. పాసివ్ ఇన్‌కమ్ వస్తుంది.
షాప్ ఓనర్లు ఏఐతో మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్ చేస్తారు. చాట్‌బాట్స్ ఆటోమాటిక్‌గా ఆన్సర్స్ ఇస్తాయి. పోస్టర్లు, యాడ్స్ డిజైన్ చేస్తుంది. సేల్స్ పెరుగుతాయి.
ఈబుక్స్, ప్లానర్స్, టెంప్లేట్స్ ఏఐతో తయారు చేయవచ్చు. వెబ్‌సైట్లలో అమ్మి పాసివ్ ఇన్‌కమ్ వస్తుంది.
ఏఐ ప్రొడక్ట్ రివ్యూలు, ప్రమోషనల్ కంటెంట్ రాస్తుంది. లింక్స్ షేర్ చేసి కమిషన్స్ సంపాదించవచ్చు.
Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం
బేసిక్ ఇంగ్లీష్, నేర్చుకోవాలనే ఆసక్తి, ఇంటర్నెట్, క్రియేటివిటీ, కన్సిస్టెన్సీ చాలు.
స్టూడెంట్స్ గూగుల్‌పై మాత్రమే ఆధారపడొద్దు. ఏఐ టూల్స్ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయాలి. మీ కాలేజీ విద్యతో పాటు మంచి ప్రాంప్ట్స్ రాయడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాంప్ట్ స్కిల్స్.. ఏఐ టూల్స్‌ను బెటర్ కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి.
మన స్కూల్స్‌లో వీక్లీ ఏఐ క్లాసులు నిర్వహించాలి. చైనా, జపాన్ వంటి దేశాలు ఇప్పటికే ఏఐ సబ్జెక్ట్ తో కూడిన విద్య అమలు చేస్తున్నాయి. ఇండియా కూడా త్వరగా ఈ విద్యా విధానాన్ని అప్‌డేట్ చేయాలి. లేకపోతే మిగతా ప్రపంచ దేశాల కంటే వెనబడిపోతాం.
ఏఐ అందరికీ స్మార్ట్ అసిస్టెంట్ లాంటిది. ఎఫర్ట్ తగ్గించి టైమ్ సేవ్ చేస్తుంది. మారుతున్న కాలంతో పాటు మనం ముందుకుసాగాలి. ఈ ఏఐ యుగంలో టెక్నాలజీ నైపుణ్యం నేర్చుకున్న వారే సక్సెస్ అవుతారు. దాన్ని పట్టించుకోని వారు భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఏఐ ఇప్పుడు మనిషి వాయిస్, ఫేస్ లేకుండా పని చేస్తుంది. అందుకే కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం తప్పనిసరి అయింది.