E-Paper
Advertisement

Youtube Shorts: యూట్యూబ్ షార్ట్స్‌లో పెద్ద మార్పు.. ఇక ఆ బటన్ కనిపించదు.. ఎందుకంటే

Youtube Shorts: యూట్యూబ్ షార్ట్స్‌లో పెద్ద మార్పు.. ఇక ఆ బటన్ కనిపించదు.. ఎందుకంటే
Advertisement

Youtube Shorts Dislike| యూట్యూబ్ షార్ట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లాగా ఈ షార్ట్ వీడియోలను యూజర్లు నిరంతరం స్క్రోల్ చేస్తుంటారు. కానీ ఈ షార్ట్ వీడియోల ఇంటరాక్షన్‌ల కోసం ఇప్పుడు యూట్యూబ్ ముఖ్యమైన మార్పును ప్లాన్ చేస్తోంది. ఈ మార్పు ప్రధానంగా డిస్‌లైక్ బటన్‌పై దృష్టి పెట్టింది.

ఇప్పటికే చాలా మంది యూజర్లు దీన్ని గమనించారు. యూట్యూబ్ ఈ మార్పుని ప్రయోగాత్మకంగా ప్రయత్నిస్తోంది. షార్ట్స్‌లో డిజ్‌లైక్ బటన్ కొందరికి కనిపించడం లేదు. మీకు కూడా కనిపించకపోతే ఆశ్చర్యపోవద్దు. యూట్యూబ్ ఈ బటన్ ప్లేస్‌మెంట్ ఆప్షన్లను టెస్ట్ చేస్తోంది.

యూట్యూబ్ ప్లాన్ ఏంటి?

Advertisement

ఇటీవలి రిపోర్ట్స్ ప్రకారం.. షార్ట్స్ డిజ్‌లైక్ చేయడం త్వరలో కష్టమవుతుంది. థంబ్స్-డౌన్ బటన్, లైక్ బటన్ కింద కనిపించకపోవచ్చు. ప్రస్తుతం ఇది షార్ట్స్ ప్లేబ్యాక్ స్క్రీన్‌లో స్పష్టంగా ఉంటుంది. యూట్యూబ్ దీన్ని ఈ డైరెక్ట్ పొజిషన్ నుంచి తొలగించాలని ప్లాన్ చేస్తోంది. యూజర్లు “డిజ్‌లైక్,” “నాట్ ఇంటరెస్టెడ్” బటన్ల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారని కంపెనీ భావిస్తోంది. చాలా మంది రెండు బటన్లను ఒకేలా ఉపయోగిస్తున్నారు. యూట్యూబ్ ఈ ఆప్షన్స్‌ని సింపుల్ చేయాలని చూస్తోంది.

డిజ్‌లైక్, నాట్ ఇంటరెస్టెడ్ బటన్లు మర్జ్ అవుతాయా?

యూట్యూబ్ డిజ్‌లైక్, నాట్ ఇంటరెస్టెడ్ బటన్లు మర్జ్ చేసే అవకాశం ఉంది. రెండు యాక్షన్లు ఒకే ఆప్షన్ ద్వారా పనిచేయవచ్చు. షార్ట్ డిస్‌లైక్ చేసినా ఆ బటన్ ఫీడ్‌బ్యాక్ రిజిస్టర్ చేస్తుంది. నాట్ ఇంటరెస్టెడ్ అయినా ఆ బటన్ పనిచేస్తుంది. ఈ మర్జ్‌డ్ బటన్ యూట్యూబ్ అల్గారిథమ్‌కు సిగ్నల్ ఇస్తుంది. యూజర్ ప్రిఫరెన్స్‌లను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. తక్కువ విజిబుల్ బటన్లతో కన్ఫ్యూజన్ తగ్గుతుంది. నెగెటివ్ రియాక్షన్లు కూడా తగ్గవచ్చు.

డిజ్‌లైక్ బటన్ కొత్త ప్లేస్‌మెంట్

Advertisement

యూట్యూబ్ డిజ్‌లైక్ బటన్ ప్లేస్‌‌ని మార్చబోతోంది. కొందరు యూజర్లకు “డిస్‌లైక్”గా కనిపిస్తుంది. మరికొందరికి “నాట్ ఇంటరెస్టెడ్”గా కనిపిస్తుంది. ఇది టెస్టింగ్ రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. రిపోర్ట్స్ ప్రకారం.. బటన్ ఓవర్‌ఫ్లో మెనూలోకి మూవ్ అవుతుంది. ఈ మెనూ థ్రీ డాట్స్ ఐకాన్ ట్యాప్ చేస్తే కనిపిస్తుంది. షార్ట్స్ టాప్-రైట్ కార్నర్‌లో ఈ ఐకాన్ ఉంటుంది. ఇందలో ఐకాన్ డిజ్‌లైక్ చేయడానికి అదనపు స్టెప్స్ జోడిస్తుంది.

Also Read: ఈ స్క్రీన్ షేరింగ్ యాప్స్‌ వెంటనే డిలీట్ చేయండి.. ప్రభుత్వ సైబర్‌క్రైమ్ హెచ్చరిక

షార్ట్స్ డిజ్‌లైక్ చేయడానికి అదనపు స్టెప్స్

యూజర్లు ముందు థ్రీ-డాట్ మెనూ ట్యాప్ చేయాలి. తర్వాత డిజ్‌లైక్ లేదా నాట్ ఇంటరెస్టెడ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇది డిజ్‌లైక్‌ను డైరెక్ట్‌గా కాకుండా తక్కువ విజిబుల్‌ చేస్తుంది. లైక్ బటన్ మెయిన్ స్క్రీన్‌లోనే ఉంటుంది. ఈ డిజైన్ పాజిటివ్ ఎంగేజ్‌మెంట్‌ను ఫేవర్ చేస్తుంది. షార్ట్ లైక్ చేయడం త్వరగా, సులభంగా ఉంటుంది. డిజ్‌లైక్ చేయడానికి యూజర్లు అదనపు ఎఫర్ట్ పెట్టాలి. యూట్యూబ్ పాజిటివ్ ఇంటరాక్షన్లను ప్రమోట్ చేయాలని చూస్తోంది.

యూట్యూబ్ ఈ మార్పు ఎందుకు చేస్తోంది?

యూట్యూబ్ క్రియేటర్ ఫ్రెండ్లీ ఫీచర్లపై బలంగా దృష్టి పెడుతోంది. విజిబుల్ డిజ్‌లైక్స్ తగ్గిస్తే క్రియేటర్ల ఎమోషనల్ ప్రొటెక్షన్ లభిస్తుంది. మరిన్ని క్రియేటర్లు షార్ట్స్ పోస్ట్ చేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది. పాజిటివ్ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ యాక్టివిటీని పెంచుతుంది. రెగ్యులర్ వీడియోల్లో డిస్‌లైక్ కౌంట్స్ హైడ్ చేసింది. ఫీడ్‌బ్యాక్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ బ్యాలెన్స్ చేయాలని చూస్తోంది. టెస్టింగ్ పూర్తి అయిన తరువాతే యూట్యూబ్ ఫైనల్ ఇంప్లిమెంటేషన్ నిర్ణయిస్తుంది. త్వరలోనే పూర్తిస్థాయిలో డిజ్‌లైక్ బటన్ ప్లేస్ మారిపోవచ్చు.

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×