E-Paper
Advertisement

యూట్యూబ్ పిక్చర్-ఇన్-పిక్చర్ ఫీచర్ ఇకపై ఉచితంగా.. ఎలా యాక్టివేట్ చేయాలంటే?

యూట్యూబ్ పిక్చర్-ఇన్-పిక్చర్ ఫీచర్ ఇకపై ఉచితంగా.. ఎలా యాక్టివేట్ చేయాలంటే?
Advertisement

YouTube PiP Mode: యూట్యూబ్ పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) మోడ్ ను ఇకపై ప్రపంచ వ్యాప్తంగా ఉచితంగా అందిస్తోంది. మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో ఇతర యాప్‌లను ఉపయోగిస్తూ.. కూడా యూట్యూబ్ వీడియోను PiP విండోలో చూడవచ్చు. 2022 నుంచి యూఎస్ లో PiP ను ఫ్రీ యాక్సెస్‌ను చేస్తున్నారు. ఇతర దేశాల్లో ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే యాక్సెస్ చేస్తున్నారు. త్వరలో ప్రపంచవ్యాప్తంగా పిక్చర్-ఇన్-పిక్చర్ సపోర్ట్‌ను ఫ్రీగా అందిస్తోంది యూట్యూబ్.

ప్రీమియం సబ్ స్క్రైబర్లకు మరిన్ని ఫీచర్లు

రాబోయే కొన్ని నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ వినియోగదారులందరూ పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP)ను ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రైబర్లు మెరుగైన PiP పీచర్స్ పొందవచ్చు. ఉచిత వినియోగదారులు పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌లో మ్యూజిక్ లేని లాంగ్ కంటెంట్‌ను మాత్రమే చూడవచ్చు. ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లు ఏ యూట్యూబ్ వీడియోనైనా PiP మోడ్ లో చూడవచ్చు. ప్రీమియం లైట్ సబ్‌స్క్రైబర్‌లకు కూడా ఈ పరిమితులు వర్తిస్తాయి.

పీఐపీ మోడ్ యాక్టివేట్ ఎలా?

Advertisement

యూట్యూబ్ లో PiPని యాక్టివేట్ చేయడం చాలా సులభం. యూట్యూబ్ వీడియో చూస్తూ.. మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్ లో హోమ్ స్క్రీన్‌కి వెళ్లడానికి పైకి స్వైప్ చేస్తే చాలు. PiP విండో ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. మీరు ఈ విండోను ఎలాగైనా కదపవచ్చు, మీకు నచ్చినట్లుగా పరిమాణాన్ని మార్చుకోవచ్చు. మీరు యూట్యూబ్ ను ఉపయోగించే విధానాన్ని బట్టి PiP కాస్త భిన్నంగా ప్రవర్తిస్తుంది. ఉదాహరణకు ప్లేలిస్ట్‌లోని వీడియోలు లేదా యాప్‌లోని కొన్ని విభాగాలు పిక్చర్-ఇన్-పిక్చర్‌ను సరిగ్గా ట్రిగ్గర్ చేయకపోవచ్చు.

Also Read: ఏమిటీ.. YouTube Ask YouTube ఫీచర్? గూగుల్ తెస్తున్న ఈ కొత్త అప్డేట్ ఎలా పనిచేస్తుంది?

Advertisement

కొన్ని సందర్భాల్లో PiPని యాక్టివేట్ చేయడానికి పైకి స్వైప్ చేసే ముందు ఫుల్-స్క్రీన్ మోడ్ నుంచి వెనక్కి రావాలి. కొన్నిసార్లు బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్ ప్రీమియంతో లింక్ అయి ఉంటుంది. అంటే యూట్యూబ్ సబ్‌స్క్రైబర్ కాకపోతే ఫోన్ లాక్ అయినప్పుడు ఆడియో ఆగిపోవచ్చు. మరికొన్ని నెలల్లో ఈ ఫీచర్స్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని యూట్యూబ్ తెలిపింది.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×