E-Paper
Advertisement

కదంతొక్కిన అంబటి.. నా కుక్క కూడా భయపడదంటూ.. లోకేశ్‌కు మాస్ వార్నింగ్!

కదంతొక్కిన అంబటి.. నా కుక్క కూడా భయపడదంటూ.. లోకేశ్‌కు మాస్ వార్నింగ్!
Advertisement

Ambati Rambabu: కడప జిల్లా వేంపల్లె పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబు విచారణకు హాజరుకావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ నేత మునిరెడ్డి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో భాగంగా ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైల సమక్షంలో సుమారు రెండు గంటల పాటు ఈ విచారణ సాగింది. విచారణ అనంతరం స్టేషన్ బయట మీడియాతో మాట్లాడిన అంబటి, కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా 36 కేసులు

Advertisement

ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దూషించానన్న నెపంతో రాష్ట్రవ్యాప్తంగా తనపై 36 కేసులు పెట్టడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఇదే కేసులో తనను అరెస్టు చేసి రిమాండ్‌కు కూడా పంపారని, ఇప్పుడు మళ్లీ అదే పాత కేసుల్లో భాగంగా పులివెందులలో కూడా విచారణకు పిలిచారని పేర్కొన్నారు. ఒకే నేరానికి సంబంధించి ఇన్ని మల్టిపుల్ కేసులు పెట్టడం చట్టవిరుద్ధమని ఆయన గుర్తు చేశారు. ఇదంతా కేవలం చంద్రబాబు, లోకేష్ ఆదేశాల మేరకే జరుగుతోందని, వైసీపీ నేతలను మానసిక ఒత్తిడికి గురిచేయడమే వీరి ప్రధాన లక్ష్యమని ధ్వజమెత్తారు.

పార్టీ నాయుకులపై అక్రమ కేసులు

Advertisement

కేవలం తనపైనే కాకుండా శ్రీహరి, సజ్జల భార్గవ్‌రెడ్డి వంటి పార్టీ నాయకులపై కూడా అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారు తమపై అనుచిత వ్యాఖ్యలు చేసినా ఎలాంటి చర్యలు ఉండవని, కానీ వైసీపీ నేతల మీద మాత్రం కక్ష సాధింపులు కొనసాగుతున్నాయని విమర్శించారు. ‘ఏపీలో ఏమైనా రెండు రకాల చట్టాలు అమలవుతున్నాయా’ అంటూ పోలీసు యంత్రాంగాన్ని సూటిగా ప్రశ్నించారు.

పోలీసులపై అంబటి ఫైర్

ఐపీఎస్ చదివిన పోలీసు అధికారులు చట్టాన్ని కాపాడాల్సింది పోయి, పాలకుల ఒత్తిడికి తలొగ్గి పని చేయడం దారుణమని మండిపడ్డారు. లోకేష్ పర్యవేక్షణలోనే ఈ అరాచకాలన్నీ జరుగుతున్నాయని ఆరోపించిన అంబటి.. ‘లోకేష్ పెట్టే కేసులకు నా కుక్క కూడా భయపడదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేపు వచ్చేది జగన్ ప్రభుత్వమేనని, అప్పుడు ఇలాంటి పోలీసులను కోర్టు ముందు నిలబెడతామని హెచ్చరించారు. మరో మూడు ఏళ్ళ పాటు జాగ్రత్తగా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని పోలీసులకు హితవు పలికారు. జైళ్లకు వెళ్లడానికైనా సిద్ధమే తప్ప, ఇలాంటి బెదిరింపులకు తాము లొంగే ప్రసక్తే లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

Also Read: అన్న చేసిన తప్పుకు చెల్లి బలి.. వికారాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య!

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×