E-Paper
Advertisement

Zebronics Pixaplay 22: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే బంపర్ ఆఫర్.. జెబ్రానిక్స్ పిక్సాప్లే 22 ప్రొజెక్టర్‌పై ఏకంగా 76% డిస్కౌంట్!

Zebronics Pixaplay 22: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే బంపర్ ఆఫర్.. జెబ్రానిక్స్ పిక్సాప్లే 22 ప్రొజెక్టర్‌పై ఏకంగా 76% డిస్కౌంట్!
Advertisement

Zebronics Pixaplay 22: ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా Zebronics Pixaplay 22 స్మార్ట్ ప్రొజెక్టర్‌పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. అసలు ధరతో పోలిస్తే.. ఏకంగా 76 శాతం తగ్గింపుతో ఈ ప్రొజెక్టర్‌ను ప్రస్తుతం రూ.8,999కే కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు.. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే మరో రూ.450 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఈ రెండు ఆఫర్లతో కలిపి చూస్తే.. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్‌‌ను కేవలం రూ.8,549 ధరకే సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..

150 అంగుళాల స్క్రీన్‌కు సపోర్ట్..

Zebronics Pixaplay 22 విషయానికి వస్తే.. చిన్న రూమ్స్ నుంచి పెద్ద హాల్స్ వరకు ఉపయోగించుకునేలా దీనిని రూపొందించారు. 63.5 సెం.మీ. నుంచి 406 సెం.మీ. వరకు ప్రొజెక్షన్ సపోర్ట్ ఇస్తూ.. గరిష్టంగా 150 అంగుళాల స్క్రీన్‌పై విజువల్స్ ప్రదర్శించగలదు. దీనిలో 1280 x 720 పిక్సెల్స్ నేటివ్ రిజల్యూషన్ ఉండగా.. 1920 x 1080 పిక్సెల్స్ వరకు వీడియోలను ప్లే చేయగలదు. అంతేకాదు ఫుల్ హెచ్‌డీ, 1080p, 720p వీడియోలకు కూడా ఈ ప్రొజెక్టర్ పూర్తిగా సపోర్ట్ ఇస్తుంది.

Advertisement

Also Read: ఏఐ కోసం చేతులు కలిపిన యాపిల్, గూగుల్.. గుత్తాదిపత్యమేనని ఎలాన్ మస్క్ ఆందోళన!

30వేల గంటల ల్యాంప్ లైఫ్..

ఈ ప్రొజెక్టర్‌లో 3400 లూమెన్స్ బ్రైట్‌నెస్ ఉండటం వలన లైటింగ్ ఉన్న రూమ్‌లో కూడా క్లియర్‌గా కంటెంట్ చూడవచ్చు. దీనిలో LED డిస్‌ప్లే టెక్నాలజీతో తయారైన ఈ మోడల్‌లో 30,000 గంటల ల్యాంప్ లైఫ్ ఇవ్వడం విశేషం. స్మార్ట్ ఫీచర్ల పరంగా మిరాకాస్ట్, iOS స్క్రీన్ మిర్రరింగ్ సపోర్ట్ లభిస్తుంది. అలాగే ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైసులతో సులభంగా కనెక్ట్ అవుతుంది. ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8GB ఇంటర్నల్ మెమరీ ఉండటం వల్ల OTT యాప్స్‌తో పాటు ఇతర యాప్స్‌ను కూడా నేరుగా ఉపయోగించవచ్చు.

మెరుగైన ఫీచర్లు..

Advertisement

ఇక కనెక్టివిటీ విషయంలో కూడా ఈ ప్రొజెక్టర్ బలమైనదిగా చెప్పవచ్చు. బ్లూటూత్ v5.1, డ్యూయల్ బ్యాండ్ వై-ఫైతో పాటు HDMI, USB, AUX అవుట్ వంటి ఆప్షన్లు దీనిలో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ ప్రొజెక్టర్‌లో బిల్ట్ ఇన్ స్పీకర్ ఉండటంతో చిన్న రూమ్స్‌లో అదనపు స్పీకర్లు అవసరం లేకుండానే ఉపయోగించుకోవచ్చు. ఇక దీనిలోని రిమోట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ ఫోకస్ ఫీచర్లు వినియోగాన్ని మరింత సులభంగా మారుస్తాయి.

790 గ్రాముల బరువు..

డిజైన్ పరంగా ఈ ప్రొజెక్టర్ గ్రీన్ కలర్ వేరియంట్‌లో లభిస్తుంది. కేవలం 790 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లేలా దీనిని రూపొందించారు. ఇక ప్రొటెక్టివ్ స్లీవ్, క్యారీ లూప్ కూడా ఇవ్వడంతో ట్రావెల్ సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సినిమాలు, టీవీ షోలు, గేమింగ్ మాత్రమే కాదు.. హోమ్ థియేటర్ అవసరాల కోసం కూడా ఈ Zebronics Pixaplay 22 ఒక మంచి ఎంపికగా నిలుస్తోంది.

ఈ బాక్స్‌లో ప్రొజెక్టర్‌తో పాటు రిమోట్ కంట్రోల్, పవర్ అడాప్టర్, HDMI కేబుల్, ప్రొటెక్టివ్ స్లీవ్, క్యారీ లూప్ లాంటి అవసరమైన యాక్సెసరీస్ అందిస్తున్నారు. మొత్తం మీద.. తక్కువ బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్ అనుభవం కావాలనుకునే వారికి ఈ ఆఫర్ నిజంగా ఆకర్షణీయంగా ఉంటుంది.

Also Read: ఇండియా మార్కెట్లోకి మరో రియల్‌మీ బ్యాటరీ బీస్ట్ వచ్చేస్తోంది.. ధర, స్పెసిఫికేషన్లు, కీలక వివరాలు ఇవిగో!

 

 

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×