Aakash Chopra: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా కూడా 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి, విధ్వంసం సృష్టించాడు వైభవ్. ఈ దెబ్బకు చాలా బలంగా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి చోటుచేసుకుంది. అటు నిన్న రాజస్థాన్ రాయల్స్ జట్టును ఒంటి చేత్తో గెలిపించి, క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ దాకా తీసుకువెళ్లాడు ఈ 15 ఏ ళ్ల బుడ్డోడు వైభవ్. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ ఈ సమయంలో ఇలా ఆడుతుంటే…. భవిష్యత్తులో అతన్ని ఊహించుకుంటేనే భయమేస్తోందంటూ క్రీడా విశ్లేషకులు కూడా చెబుతున్నారు.
Also Read: Vaibhav-Parag: వైభవ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బయటపెట్టిన రియాన్ పరాగ్, ఇదిగో షాకింగ్ వీడియో
ప్రపంచ వ్యాప్తంగా వైభవ్ సూర్య వంశీ మారుమోగుతున్న నేపథ్యంలో ఇండియన్ మాజీ క్రికెటర్లు మాత్రం అతడి పై విషం కక్కుతున్నారు. తాజాగా వైభవ్ సూర్య వంశీ పైన హాట్ కామెంట్స్ చేశారు ఆకాష్ చోప్రా. వేలంలోకి వైభవ్ వస్తే 30 కోట్లు పెట్టడం దండగే అంటూ పరువు తీశారు. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag), హర్భజన్ సింగ్ (Harbhajan Singh), ఆకాష్ చోప్రా ( Aakash Chopra ) కామెంట్రీ చేశారు. ఈ సందర్భంగా వాళ్ళ మధ్య వైభవ్ సూర్యవంశీ టాపిక్ వచ్చింది. ఒకవేళ వచ్చే సీజన్ సందర్భంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi ) వేలంలోకి వస్తే పరిస్థితి ఏంటని హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు. హర్భజన్ సింగ్ ఈ ప్రశ్న వేయగానే వెంటనే ఆకాష్ చోప్రా స్పందించారు. వైభవ్ సూర్య వంశీకి రూ. 30 కోట్లు దండగే అంటూ బాంబు పేల్చారు. ఒక్క ప్లేయర్ కే రూ.30 కోట్లు పెడితే.. మిగిలిన ఆటగాళ్లకు ఫ్రాంచైజీ ఎక్కడి నుంచి డబ్బులు తీసుకువస్తుందని ప్రశ్నించారు. వాళ్ల పర్స్ వ్యాల్యూ కూడా సరిపోదని వ్యాఖ్యానించారు.
ప్రతి ప్లేయర్ కు ఒక లిమిట్ ధర ఉండాలని వెల్లడించారు. అప్పుడే పర్స్ వ్యాల్యూకు తగ్గట్టు ఫ్రాంచైజీలు కూడా కొనుగోలు చేస్తాయని వివరించారు. కానీ ఒక్క ప్లేయర్ కే 30 కోట్లు పెడితే.. సదరు జట్టుకు 11 మంది ప్లేయర్లను కొనుగోలు చేసే డబ్బు సరిపోదు కదా ? అంటూ ప్రశ్నించారు. ఇక దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ రాయల్స్ లో చాలామంది టాలెంటెడ్ కుర్రాళ్ళు ఉన్నారు.. అవసరమనుకుంటే వైభవ్ సూర్యవంశీని కూడా ఆ జట్టు యాజమాన్యం వదిలేస్తుందని బాంబు పేల్చారు. అప్పుడు ఇతర ఫ్రాంచైజీలు కొనుగోలు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయని తెలిపారు. దీంతో వీళ్లు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. దీనిపై వైభవ్ సూర్య వంశీ అభిమానులు సీరియస్ అవుతున్నారు. 15 ఏళ్లకు కుర్రాడి ఆత్మవిశ్వాసం పై దెబ్బతీసేలా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు.
Also Read: Abdul Razzaq: PSL అల్లా కంటే పవిత్రమైనది..ఐపీఎల్ అతిపెద్ద ఫిక్సింగ్ హబ్ Abdul Razzaq: PSL
Hindi Commentary standards are literally worst man 🤷♂️
Harbhajan Singh raised a question: If by chance Vaibhav Suryavanshi comes to the auction, how far would you go for him? 🤔
Aakash Chopra replied: “At least 30 crores. After that, we also have to keep our purse value in… pic.twitter.com/TgLx9XeOCO
— ` (@OxygenKohlii18) May 27, 2026