Asia Cup Rising Stars 2026 Finals Pak vs Sl: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026) విజేతగా అందరూ ఊహించినట్టుగానే శ్రీలంక నిలిచింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ లో పాకిస్తాన్ జూనియర్ జట్టుపై 1 వికెట్ తేడాతో విజయం సాధించిన శ్రీలంక, టైటిల్ ఎగురేసుకుపోయింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ అండర్ 19 జట్టు 50 ఓవర్లు ఆడింది. ఈ తరుణంలోనే 9 వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చాలా జాగ్రత్తగా ఆడుతూ శ్రీలంక చేధించింది. పాకిస్తాన్ విధించిన లక్ష్యాన్ని 41.3 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి విజయం సాధించింది. చివరలో లాహీరు, గరుక ఓపిగ్గా ఆడి మ్యాచ్ గెలిపించారు. దీంతో శ్రీలంక మూడో ట్రోఫీని దక్కించుకుంది.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026) ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్, శ్రీలంక (Sri Lanka A vs Pakistan A, Final) జట్ల మధ్య జరిగింది. అయితే, ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి అంపైర్లు పాకిస్తాన్ జట్టుకు అనుకూలంగా వ్యవహరించినట్టే సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలోనే షాజైబ్ ఖాన్ ((Shahzaib Khan)) వికెట్ల ముందు అడ్డంగా దొరికినా, అంపైర్ మాత్రం బ్యాట్ కు బంతి తగిలిందని, నాటౌట్ గా ప్రకటించేశాడు. ఈ లైఫ్ రావడంతో రెచ్చిపోయిన షాజైబ్ ఖాన్, ఏకంగా 60 పరుగులు బాదేశాడు. లేకపోతే పాకిస్తాన్ 150 పరుగులు కూడా దాటకపోయేది. అటు సినెత్ జయవర్ధనే కూడా హసన్ నవాజ్ బౌలింగ్ భారీ షాట్ ఆడబోయాడు. కానీ షాట్ మిస్సై, వికెట్ కీపర్ రహీల్ నజీర్ చేతిలో బంతి పడింది. దీంతో పాకిస్తాన్ అంపైర్లు అప్పీల్ చేశారు.
ఈ తరుణంలోనే అంపైర్ వెంటనే ఔట్ ఇచ్చేశాడు. దీంతో సినెత్ జయవర్ధనే..అసహనం వ్యక్తం చేస్తూ, మైదానం వీడాడు. ఈ టోర్నమెంట్ డీఆర్ఎస్ తీసుకునే వెసులుబాటు లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్ నిర్ణయమే ఫైనల్ అవుతోంది. దీంతో శ్రీలంకకు అన్యాయం జరిగిందనే పోస్టులు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, టైటిల్ ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో అంపైర్లను ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ కొనుగోలు చేశాడని ఆరోపణలు కూడా వస్తున్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిన తరుణంలోనే ఈ పరిస్థితి చోటు చేసుకుందని పోస్టులు వైరల్ చేస్తున్నారు.
Mohsin Naqvi fixing the match with the umpires AGAIN? 🤡
A CLEAR NOT OUT GIVEN OUT. What a shameless robbery! 💀 pic.twitter.com/Gm3d2jSZz9
— VARAHA WARRIOR (@VarahaWarrior) November 29, 2026
?cnvx=MTdmaXo0NjgxY3piYQ==