E-Paper
Advertisement

కుట్రలు చేసినా గెలవని పాకిస్తాన్..మరోసారి ఆసియా కప్ ట్రోఫీ లేపేసిన మొహ్సిన్ నఖ్వీ?

కుట్రలు చేసినా గెలవని పాకిస్తాన్..మరోసారి ఆసియా కప్ ట్రోఫీ లేపేసిన మొహ్సిన్ నఖ్వీ?
Advertisement

Mohsin Naqvi Trophy Chor: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026) విజేతగా యంగ్ శ్రీలంక క్రికెట్ జట్టు నిలిచింది. పాకిస్తాన్ జూనియర్లపై ఒకే ఒక్క వికెట్ తేడాతో విక్టరీ సాధించిన శ్రీలంక.. మూడోసారి ఛాంపియన్ గా నిలిచింది. అయితే, ఈ ఫైనల్ లో గెలిచిన శ్రీలంక యంగ్ జట్టును మొహ్సిన్ నఖ్వీ మోసం చేసినట్టు ట్రోల్స్ మొదలయ్యాయి. పాకిస్తాన్ ఓడిపోతుందని, భావించి.. చివరి క్షణంలో ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ ట్రోఫీని మార్చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఒరిజినల్ ట్రోఫీ స్థానంలో డమ్మీ టైటిల్ ను పెట్టేసి, కుట్రలకు తెరలేపినట్టు వార్తలు పోస్టులు వైరల్ అవుతున్నాయి.

కుట్రలు చేసినా గెలవని పాకిస్తాన్..మరోసారి ఆసియా కప్ ట్రోఫీ లేపేసిన నఖ్వీ?

టీమిండియాకు గతంలో రెండు సార్లు టైటిల్ ఇవ్వకుండా తన కార్యాలయంలోనే దాచేసిన నఖ్వీ, ఇప్పుడు డమ్మీ టైటిల్ లంకకు ఇచ్చి.. మోసం చేసినట్టు ప్రచారం మొదలైంది. అంతేకాదు, ట్రోఫీ చోర్ నఖ్వీ (Mohsin Naqvi Trophy Chor) అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేస్తున్నారు. అయితే, ఈ పోస్టులకు పాక్ అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. కావాలనే నఖ్వీపై టీమిండియా క్రికెట్ అభిమానులు దుష్పప్రచారం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. సెమీ ఫైనల్ లో టీమిండియా ఓడిపోయిందని కుళ్లు కుంటూ, నఖ్వీపై తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆగ్రహిస్తున్నారు.

Advertisement

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 విజేతగా శ్రీలంక

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026) ఫైనల్ మ్యాచ్ లో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక జూనియర్ జట్ల (Sri Lanka A vs Pakistan A, Final) మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట పాకిస్తాన్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. ఈ తరుణంలోనే 50 ఓవర్లు ఆడింది. దీంతో 9 వికెట్లు నష్టపోయిన పాకిస్తాన్ 216 పరుగులు సాధించింది. షమీల్ హుస్సేన్, షహజైబ్ ఖాన్, అబ్దుల్ సమద్, రోహైల్ నజీర్ అద్భుతంగా రాణించడంతో ఆ మాత్రం స్కోరు సాధించింది. ఇక ఈ టార్గెట్ ఛేదించే క్రమంలో నిషాన్ మధుశంక 87 పరుగులతో రాణించాడు. చివరలో లాహీరు, గరుక ఓపికగా ఆడి మ్యాచ్ గెలిపించారు. దీంతో 41.3 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి మ్యాచ్ గెలిచింది లంక. ఈ తరుణంలోనే శ్రీలంక జూనియర్ జట్టు తన ఖాతాలో మూడు ట్రోఫీలు వేసుకుంది.

Advertisement

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

Related News

నఖ్వీపై ఫిక్సింగ్ ఆరోపణలు.. పాక్ ఓటమి, ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ విజేతగా శ్రీలంక

IPL పరమ చెత్త టోర్నమెంట్.. దాని కంటే PSL 200 శాతం బెటర్.. షేన్ వాట్సన్ సంచలనం

బాటిల్ మూత‌ల‌తోనే కాదు.. బూట్లు, నోటితో పాకిస్తాన్ క్రికెట‌ర్లు బాల్ టాంప‌రింగ్ చేసేవాళ్లు!

గంభీర్ ను చాపెల్ లాంటి దుర్మార్గుడితో పోల్చొద్దు.. అత‌డు టీమిండియా ద‌క్కిన వ‌రం!

బాబ‌ర్ చిల్ల‌ర‌గాడు.. స్లోగా బ్యాటింగ్ చేస్తున్నావ‌ని అన్నందుకు వారం రోజులు మాట్లాడ‌లేదు

బ‌ల‌మైన టీమిండియానే ఓడించాం, ఫైన‌ల్ లో శ్రీలంక‌ను న‌లిపేస్తాం.. హ‌స‌న్ న‌వాజ్ వార్నింగ్

మిస్ట‌ర్ కూల్ కాదు.. న‌ర‌రూప రాక్ష‌సుడు, ధోనిపై కేదార్ జాద‌వ్ సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×