E-Paper
Advertisement

Mohammad Amir: అభిషేక్ శర్మకు టెక్నిక్ లేదు, కండ్లు మూసుకుని సిక్సులు కొడ‌తాడు

Mohammad Amir: అభిషేక్ శర్మకు టెక్నిక్ లేదు, కండ్లు మూసుకుని సిక్సులు కొడ‌తాడు
Advertisement

Mohammad Amir:  పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ మహ్మద్ అమీర్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ ( T20 World Cup 2026)  నేప‌థ్యంలో ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ ( Team India Vs Pakistan) మ‌ధ్య మ్యాచ్ జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ సంద‌ర్భంగా అభిషేక్ శర్మను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ మహ్మద్ అమీర్ ( Mohammad Amir) హాట్ కామెంట్స్ చేశారు. అభిషేక్ శర్మకు టెక్నిక్ లేదు, క‌ళ్లు మూసుకుని సిక్సులు కొడ‌తాడంటూ మ‌హ‌మ్మ‌ద్ అమీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏదో ఆడాల‌ని ఆడ‌తాడు, కానీ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) డేంజ‌ర్ ఆట‌గాడు కాదంటూ వ్యాఖ్యానించారు. అభిషేక్ శర్మను చూసి భ‌యపడాల్సిన ప‌ని లేద‌ని చుర‌క‌లు అంటించారు. దీంతో పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ మహ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Also Read: T20 World Cup 2026: అరుణ్ జైట్లీ స్టేడియం ద‌గ్గ‌ర దారుణం…మిగిలిపోయిన డ్రింక్స్ రీ-యూజ్?, ఇండియా ప‌రువు తీస్తున్నారు క‌ద‌రా

అభిషేక్ శర్మకు టెక్నిక్ లేదు, కండ్లు మూసుకుని సిక్సులు కొడ‌తాడు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15వ తేదీన జరగనుంది. శివరాత్రి రోజు జరగనున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఆడే అవకాశాలు కనిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడితే.. కచ్చితంగా ఇండియా గెలుస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ బౌలర్లు భయపడిపోతున్నారని వార్తలు వస్తున్నాయి.

అయితే, అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మను చూసి భయపడకండి అని.. అతడు భయంకరమైన ఆటగాడు కాదంటూ వ్యాఖ్యానించారు. కండ్లు మూసుకొని బ్యాట్ జులిపిస్తాడు కానీ.. బలంగా కచ్చితత్వంతో సిక్సర్లు కొట్టలేదని పరువు తీశారు. అసలు అభిషేక్ శర్మకు బ్యాటింగ్ చేసే టెక్నిక్ లేదని ఇజ్జత్ తీశారు మహమ్మద్ అమీర్. అతనిలో బ్యాటింగ్ స్కిల్స్ ఎక్కడ కనిపించబోవు అంటూ చురకలు అంటించారు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ వెనుక ఇలాంటి రహస్యం లేదని… అదృష్టం కొద్ది మాత్రమే అతడు స్టార్ క్రికెటర్ అయ్యాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇండియా వ‌ర్షెస్ పాక్ కు వ‌ర్షం గండం

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15వ తేదీన జరగనుంది. అయితే కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ సందర్భంగా వర్షం విలన్ గా మారనుందట. ఈ మ్యాచ్ జరిగే రోజున 80% వర్షపాతం కురిసే ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ఇదే జరిగితే మ్యాచ్ రద్దు అయ్యే ప్రమాదం కూడా వస్తుంది.

Also Read: Gerhard Erasmus Bowling Action: న‌మీబియాలో మ‌రో ఉస్మాన్ తారిక్‌..ఇండియాతో జ‌రిగిన‌ మ్యాచ్ లో ఎరాస్మ‌స్ త్రో బౌలింగ్

 

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×