Gerhard Erasmus Bowling Action: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంటులో ఇప్పటి వరకు 17 మ్యాచులు పూర్తయ్యాయి. ఇవాళ 18 వ మ్యాచ్ లో భాగంగా ఇండియా వర్సెస్ నమీబియా మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ ( Gerhard Erasmus ) వేసిన బౌలింగ్ వివాదంగా మారింది. ఈ మ్యాచ్ లో త్రో బౌలింగ్ ( Gerhard Erasmus Bowling Action ) వేశాడని పాకిస్తాన్ అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. మరోవైపు నమీబియాలో కూడా మరో ఉస్మాన్ తారిక్ ( Usman Tariq ) ఉన్నాడని రచ్చ రచ్చ చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్.
ఇండియా వర్సెస్ నమీబియా ( India vs Namibia, 18th Match) మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ (Arun Jaitley Stadium, Delhi )వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ త్రో బౌలింగ్ చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ లాగానే నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ బౌలింగ్ చేశాడని అంటున్నారు. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ నాలుగు ఓవర్లు వేశాడు. ఈ సందర్భంగా 20 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు.
అయితే ఈ మ్యాచ్ లో అచ్చం ఉస్మాన్ తారిక్, కేదార్ జాదవ్ తరహా లోనే బౌలింగ్ చేశాడు నమిబియా కెప్టెన్ ఎరాస్మాస్. అందుకే అతడు ఎక్కువగా వికెట్లు తీశాడు అని ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అటు పాకిస్తాన్ అభిమానులు కూడా ఈ అంశంపై మండిపడుతున్నారు. ఉస్మాన్ తారిక్ ను విమర్శించిన మాజీ క్రికెటర్లు ఇప్పుడు నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ విషయంలో ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు. వెంటనే అతడిపై ఐసీసీ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ, నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ ( Gerhard Erasmus ) వేసిన బౌలింగ్ వివాదంగా ఉందని ఐసీసీ ఎక్కడా పేర్కొనలేదు. ఐసీసీ సీరియస్ అయితే, మాత్రం గెర్హార్డ్ ఎరాస్మస్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియాతో జరిగిన గురువారం మ్యాచ్లో కెప్టెన్ ఎరాస్మస్ అద్భుతంగా రాణించాడు. ఇషాన్ కిషన్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా అలాగే అక్షర్ పటేల్ లాంటి కీలక వికెట్లు పడగొట్టాడు అరాస్మస్. ఈ నేపథ్యంలో 4 ఓవర్లు సంధించి నాలుగు టికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియా భారీ స్కోర్ చేయకుండా ఆపగలిగాడు.