E-Paper
Advertisement

T20 World Cup 2026: అరుణ్ జైట్లీ స్టేడియం ద‌గ్గ‌ర దారుణం…మిగిలిపోయిన డ్రింక్స్ రీ-యూజ్?, ఇండియా ప‌రువు తీస్తున్నారు క‌ద‌రా

T20 World Cup 2026: అరుణ్ జైట్లీ స్టేడియం ద‌గ్గ‌ర దారుణం…మిగిలిపోయిన డ్రింక్స్ రీ-యూజ్?, ఇండియా ప‌రువు తీస్తున్నారు క‌ద‌రా
Advertisement

T20 World Cup 2026:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 15 మ్యాచ్ లకు పైగా పూర్తయ్యాయి. గురువారం ఇండియా వర్సెస్ నమీబియా ( India vs Namibia) మధ్య మ్యాచ్ కూడా జరుగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇండియా పరువు తీసేలా ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియం ( Arun Jaitley Stadium) దగ్గర మిగిలిపోయిన కూల్ డ్రింక్స్ ( drinks) మళ్లీ సేల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. ఇండియా పరువు తీస్తున్నారు కదరా అంటూ.. ఆ విక్రియదారులపై మండిపడుతున్నారు.

Also Read: Trolls on Usman Tariq: ఐసీసీ కళ్లు మూసుకుపోయాయా ? ఉస్మాన్ తారిక్ పై బ్యాన్ వేయండి..USA, శ్రీలంక ఫ్యాన్స్ ట్రోలింగ్‌

అరుణ్ జైట్లీ స్టేడియం ద‌గ్గ‌ర దారుణం…మిగిలిపోయిన డ్రింక్స్ రీ-యూజ్?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా ఢిల్లీ వేదికగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియం లో ఈ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. ఇక గురువారం ఇదే వేదికగా ఇండియా వర్సెస్ నమీబియా మధ్య మ్యాచ్ కూడా జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే అరుణ్ జెట్లీ స్టేడియం ( Arun Jaitley Stadium) దగ్గర జరిగే షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్టేడియంలో కూల్ డ్రింక్స్ అమ్మే విక్రయదారులు… జనాలను దారుణంగా మోసం చేస్తున్నారు. మిగిలిపోయిన కూల్ డ్రింక్స్ ను మళ్లీ.. బాటిల్స్ లో పోస్తున్నారు. బాటిల్స్ లో పోసి, కూలింగ్ పెట్టిన తర్వాత క్రికెట్ అభిమానులకు విక్రయిస్తున్నారు. అయితే ఓ అజ్ఞాత వ్యక్తి ఈ వీడియోను క్యాప్చర్ చేశాడు.

గ్లాసుల్లో ఉన్న కూల్ డ్రింక్ ను.. బాటిల్స్ లో విక్రయ దారుడు పోస్తున్నట్లు ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇది చూసిన అభిమానులు, నెటిజెన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. అంతర్జాతీయ టోర్నమెంట్ జరుగుతున్న సందర్భంగా ఇలాంటి పనులు చేయడం ఏంటని ఇండియన్స్ ఫైర్ అవుతున్నారు. విదేశాలకు చెందిన అభిమానులు కూడా అరుణ్ జెట్లీ స్టేడియానికి వస్తారు… వాళ్ళు ఈ వీడియో చూస్తే ఇండియా పరువు ఏమవుతుందని నిలదీస్తున్నారు. ఇలాంటి చర్యలపై బీసీసీఐ ( BCCI) అలాగే ఐసీసీ ( ICC) చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్స్.

బీసీసీఐ, ఐసీసీ రియాక్ట్

Advertisement

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదిక‌గా మిగిలిపోయిన కూల్ డ్రీంక్స్ మ‌ళ్లీ విక్ర‌యించిన సంఘ‌ట‌న‌పై బీసీసీఐ ( BCCI), ఐసీసీ రియాక్ట్ అయిన‌ట్లు స‌మాచారం అందుతోంది. ఈ దుకాణాదారుడి పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. దీనిపై నివేదిక అందిన త‌ర్వాత‌, యాక్ష‌న్ తీసుకుంటార‌ని స‌మాచారం అందుతోంది.

Also Read: BAN – T20 WC Boycott: మా బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లు, పిరికి స‌న్నాసులు..మాట మార్చిన ఆసిఫ్ నజ్రుల్

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×