E-Paper
Advertisement

Ban On Rashid Khan: రషీద్ ఖాన్ కు బిగ్ షాక్‌.. ఆఫ్ఘనిస్తాన్‌లోకి రాకుండా బ్యాన్ వేసిన‌ తాలిబన్స్ !

Ban On Rashid Khan: రషీద్ ఖాన్ కు బిగ్ షాక్‌.. ఆఫ్ఘనిస్తాన్‌లోకి రాకుండా బ్యాన్ వేసిన‌ తాలిబన్స్ !
Advertisement

Ban On Rashid Khan:  పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan) మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. అతనిపై తాలిబ‌న్స్ ( Talibans ) బ్యాన్ విధించారని వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న రషీద్ ఖాన్ ( Rashid Khan).. మళ్లీ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అడుగుపెట్టకుండా బ్యాన్ విధించారట తాలిబన్స్. ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read:  Inzamam-ul-Haq: కోహ్లీ యావ‌రేజ్ ప్లేయ‌ర్..వాడి కంటే బెట‌ర్ క్రికెట‌ర్లు పాకిస్థాన్‌లో గల్లీకొకడు ఉంటాడు

ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ పై బ్యాన్ వేసిన తాలిబన్స్

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రషీద్ ఖాన్ పైన బ్యాన్ విధించినట్లు తాలిబన్ సీనియర్ నాయకుడు అనస్ హక్కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మళ్ళీ రషీద్ ఖాన్ అడుగుపెట్టకుండా పర్మినెంట్ గా బ్యాన్ విధించినట్లు ఈ తాలిబన్ సీనియర్ నాయకుడు అనస్ హక్కానీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు గానీ లేదా తాలిబన్ సర్కార్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే రషీద్ ఖాన్ పైన బ్యాన్ ( Ban On Rashid Khan) విధించినట్లు లోకల్ మీడియాలో ఈ తాలిబన్ సీనియర్ అధికారి అనస్ హక్కానీ పేర్కొన్నట్లు చెబుతున్నారు.

అసలు బ్యాన్ విధించడానికి కారణం ఏంటి ?

ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబన్స్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రషీద్ ఖాన్ వాళ్ల విధానాలను వ్యతిరేకించారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మహిళల విద్యపై తాలిబ‌న్స్‌ విధించిన ఆంక్షలు వ్యతిరేకించాడు రషీద్ ఖాన్. మెడికల్ కోర్సులలో మహిళలు ఉండకూడదని తాలిబ‌న్స్, ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆదేశాలపై బహిరంగంగానే రషీద్ ఖాన్ విమర్శలు చేశారు. దీంతో అప్పటి నుంచి రషీద్ ఖాన్ పైన కన్నేసింది తాలిబన్ సర్కార్. అయితే ఇప్పుడు అతనిపై బ్యాన్ విధించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ తాలిబన్ సర్కార్ ఇంకా అధికారికంగా దీనిపై నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.

Advertisement

త్వరలో ఈ నిర్ణయం ఉంటుందని కూడా అంచనాలు వేస్తున్నారు విశ్లేషకులు. ఇది ఇలా ఉండగా ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ ఆస్పత్రి పై ఇటీవల పాకిస్తాన్ వైమానిక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో దాదాపు 400 మంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మరణించారు. ఈ సంఘటనపై రషీద్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇది యుద్ద నీతి కాదని… పాకిస్తాన్ ది పిరికిపంద చర్య అంటూ మండిపడ్డారు. దీనిపై అంతర్జాతీయంగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు రషీద్ ఖాన్. అయితే ఇంతలోనే రషీద్ ఖాన్ పైన తాలిబన్స్ బ్యాన్ విధించాలని వార్తలు వైరల్ కావడం హాట్ టాపిక్ అయింది.

Also Read: Tanveer Ahmed: PSL జోక‌ర్ లీగ్ అయిపోయింది..ఐపీఎల్ కోసం డ్రామాలు ఆడే దుర్మార్గుల‌పై 3 ఏళ్ల బ్యాన్ వేయాల్సిందే

 

https://www.facebook.com/photo/?fbid=909017628710665&set=a.106276752318094

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×