E-Paper
Advertisement

Inzamam-ul-Haq: కోహ్లీ యావ‌రేజ్ ప్లేయ‌ర్..వాడి కంటే బెట‌ర్ క్రికెట‌ర్లు పాకిస్థాన్‌లో గల్లీకొకడు ఉంటాడు

Inzamam-ul-Haq: కోహ్లీ యావ‌రేజ్ ప్లేయ‌ర్..వాడి కంటే బెట‌ర్ క్రికెట‌ర్లు పాకిస్థాన్‌లో గల్లీకొకడు ఉంటాడు
Advertisement

Inzamam-ul-Haq:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) మరో ఎనిమిది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ టోర్నమెంట్ లో పాల్గొనే 10 జట్లు తమ ప్లేయర్లతో సిద్ధమవుతున్నాయి. విదేశీ క్రికెటర్లు కూడా ఇండియాకు చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి ఫైట్ కోసం సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే లండన్ లో ఉన్న విరాట్ కోహ్లీ ( Virat Kohli) తన కుటుంబాన్ని ఇండియాకు తీసుకువచ్చాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) శిబిరంలో చేరి ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ( Pakistan) మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్. పొద్దున లేస్తే ఇండియా పై ఏడ్చే పాకిస్తాన్ విరాట్ కోహ్లీ గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. తాజాగా ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ) కూడా అదే పని చేశాడు. విరాట్ కోహ్లీ యావరేజ్ ప్లేయర్ అని, అంతకంటే బెటర్ క్రికెటర్లు పాకిస్తాన్ లో చాలా మంది ఉన్నారని బాంబు పేల్చాడు. దీంతో ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Kavya Maran: దేశ ద్రోహి అంటూ కావ్య పాప‌ను ట్రోల్ చేస్తున్నారు, కానీ క‌రోనా, తుఫాన్లు వ‌చ్చిన‌ప్పుడు ఇండియాను ఆదుకున్న దేవ‌త !

కోహ్లీ కంటే బెట‌ర్ క్రికెట‌ర్లు పాకిస్థాన్‌లో గల్లీకొకడు ఉంటాడు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీపై విషం కక్కాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ). విరాట్ కోహ్లీ అంటూ చాలామంది డబ్బా కొడతారు.. కానీ అతనిలో సత్తా ఏమి ఉండదని చురకలు అంటించారు. విరాట్ కోహ్లీ జస్ట్ యావరేజ్ ప్లేయర్ అంటూ పరువు తీశారు. పాకిస్తాన్ లోని ప్రతి గల్లీలో తోపు ఆటగాళ్లు ఉంటారు… విరాట్ కోహ్లీ కంటే మంచి ఆట తీరును కనబరుస్తారని బాంబు పేల్చాడు ఇంజమామ్ వుల్ హక్.

పాకిస్తాన్ లోని ప్రతి గల్లీలో విరాట్ కోహ్లీ కంటే ప్రతిభావంతులైన ఎంతోమంది క్రికెటర్లు చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు. వాళ్ల ముందు విరాట్ కోహ్లీ యావరేజ్ ప్లేయర్ అంటూ పరువు తీశారు. అయితే ఇండియన్ క్రికెటర్ కాబట్టి విరాట్ కోహ్లీ గురించి బాగా చెబుతారని.. వాస్తవంలో అతడు పెద్ద ప్లేయరేం కాదని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఇంజమామ్ వుల్ హక్ చేసిన ఈ వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ అభిమానులు సీరియస్ అవుతున్నారు. చాలా సార్లు పాకిస్తాన్ క్రికెట్ జట్టును చీల్చి చెండాడింది విరాట్ కోహ్లీ అని మర్చిపోవద్దని చురకలు అంటిస్తున్నారు. పాక్ ప్రీమియ‌ర్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడ‌ని గుర్తు చేస్తున్నారు. అది మర్చిపోయి ఇంజమామ్ వుల్ హక్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

Advertisement

Also Read: Inzamam-ul-Haq: అల్లా మీద ఒట్టు..ఇకపై టీమిండియాకు ఒక్క ట్రోఫీ రాదు, పాకిస్తానే వరుసగా 5 వరల్డ్ కప్ లు గెలుస్తుంది

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×