E-Paper
Advertisement

అకాష్ అంబానీపై పంజాబ్ ఫ్యాన్స్ దాడి…ముఖంపైకి ఫోన్లు విసిరేసి మ‌రీ !

అకాష్ అంబానీపై పంజాబ్ ఫ్యాన్స్ దాడి…ముఖంపైకి ఫోన్లు విసిరేసి మ‌రీ !
Advertisement

PBKS VS MI:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంటులో ఇప్పటికే 75 శాతానికి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. రెండు జట్లు ఎలిమినేట్ కూడా అయ్యాయి. ఇలాంటి క్రమంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (Punjab Kings vs Mumbai Indians) మధ్య నిన్న కీలక మ్యాచ్ జరిగింది. ధర్మశాల వేదికగా (Himachal Pradesh Cricket Association Stadium, Dharamsala) జరిగిన ఈ మ్యాచ్ లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది ముంబై ఇండియన్స్. అయితే ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత ముంబై ఇండియన్స్ ఓనర్ ఆకాష్ అంబానీకి (Akash Ambani ) పెను ప్రమాదం చోటు చేసుకుంది. అతనిపై మొబైల్ ఫోన్లు విసిరారు పంజాబ్ అభిమానులు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

అకాష్ అంబానీపై పంజాబ్ ఫ్యాన్స్ దాడి..? వీడియో వైర‌ల్

Advertisement

ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరిగింది. కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. దీంతో పంజాబ్ కింగ్స్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో కనిపించారు. అయితే ఆ కోపాన్ని ముంబై ఓన‌ర్ ఆకాష్ అంబానీ పైన చూపించే ప్రయత్నం చేశారు. మ్యాచ్ గెలిచిన తర్వాత ఆకాష్ అంబానీ స్టేడియాన్ని వదిలి హోటల్ రూమ్ కు బయలుదేరారు. ఈ క్రమంలో స్టేడియంలో ఉన్న కొంత మంది అభిమానులు సెల్ఫీ కావాలంటూ ఆకాష్ అంబానీని కోరారు. దానికి చాలా మంచి హృదయంతో ఒప్పుకున్నారు అంబానీ కుమారుడు ఆకాష్. అయితే మీ మొబైల్స్ ఇవ్వండి అంటూ ఓ అభిమానికి సూచనలు చేశారు ఆకాష్ అంబానీ.

ఇక ఇది విన్న పంజాబ్ కింగ్ అభిమానులు.. మొబైల్స్ అన్ని ఆకాష్ అంబానీ ముఖాన కొట్టారు. దీంతో అతనికి చిన్నపాటి గాయం కూడా జరిగింది. ఈ సంఘటన జరగగానే ఉలిక్కిపడ్డాడు ఆకాష్. అటు వెంటనే అలర్ట్ అయిన పోలీసులు… పంజాబ్ కింగ్స్ అభిమానులను మందలించారు. అనంతరం ఆకాష్ అంబానీని అక్కడి నుంచి తీసుకువెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ సీరియస్ అవుతున్నారు. సెల్ఫీ అడిగిన పంజాబ్ కింగ్స్ అభిమానులు.. ఇలా దాడి చేయడం ఎంత మేరకు కరెక్ట్ అంటూ ఫైర్ అవుతున్నారు. ఓట‌మి త‌ట్టుకోలేక ఇలా దాడిచేసిన వాళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముంబై ఫ్యాన్స్ కూడా డిమాండ్ చేశారు. అయితే, ఇది పాత వీడియో అని కొంద‌రు అంటున్నారు.

Advertisement

Also Read: రాజీవ్ శుక్లా భాగోతం బ‌య‌ట‌పెట్టిన ల‌లిత్ మోడీ…ఐపీఎల్ లో ఛాన్స్ ఇస్తామ‌ని డ‌బ్బులు వ‌సూళ్లు, ప్రైవేట్ వీడియోలు చూపించి !

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×