LALIT MODI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 75% టోర్నమెంట్ కూడా ఫినిష్ అయింది. రెండు జట్లు కూడా ఎలిమినేట్ అయ్యాయి. మరో నాలుగు రోజులు పోతే ప్లే ఆఫ్స్ ఆడే జట్లు ఏంటనేవి తేలిపోతాయి. అయితే ఇలాంటి క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లలిత్ మోడీ. ఐపీఎల్ పేరుతో భారీ స్కాం జరుగుతోందని బాంబు పేల్చారు. ఐపీఎల్ జట్లల్లో అవకాశాల కోసం బీసీసీఐ సెక్రటరీ రాజీవ్ శుక్లా బృందం డబ్బులు వసూలు చేస్తున్నట్లు షాకింగ్ ఆరోపణలు చేశారు లలిత్ మోడీ. ఒకవేళ డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే పర్సనల్ విషయాలు లీక్ చేస్తానని బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నట్లు లలిత్ మోడీ సోషల్ మీడియా వేదికగా షాకింగ్ నిజాలను బయటపెట్టారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) విజయవంతంగా ముందుకు కొనసాగుతున్న నేపథ్యంలో లలిత్ మోడీ ( Lalith Modi) షాకింగ్ ఆరోపణలు చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి సభ్యులైన రాజీవ్ శుక్లా పిఏ బాగోతం బయటపెట్టారు. ఐపీఎల్ జటలో సెలక్షన్ కోసం ప్లేయర్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఓ క్రికెటర్ డబ్బులు ఇవ్వలేనని చెబితే.. అతని పర్సనల్ గా బ్లాక్మెయిల్ చేసి భయభ్రాంతులకు గురి చేశారని కూడా ఆరోపించారు. సదరు క్రికెటర్ కెరీర్ నాశనం చేస్తానని.. రాజీవ్ శుక్లా ( RAjeevi Shukla) పీఏ.. కొన్ని ప్రవేట్ వీడియోలను చూపించి బెదిరింపులకు దిగాడట. ఈ వ్యవహారాన్ని బయటపెట్టి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు లలిత్ మోడీ.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అంటే ఒక బ్రాండ్ అని.. బ్లాక్మెయిల్ దందాతో ఆ టోర్నమెంట్ కెరీర్ దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దందా వెనుక రాజీవ్ శుక్లా హస్తం ఉందంటూ కూడా తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. రాజీవ్ శుక్లా భాగోతం బయటపెట్టిన లలిత్ మోడీ…దీనిపై బీసీసీఐ కచ్చితంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే క్రికెటర్ల జీవితాలు నాశనం అయ్యే ప్రమాదం ఉందని బాంబ్ పేల్చారు. ఈ కుట్రలకు పాల్పడిన వాళ్లను జైలుకు పంపించాల్సిందేనన్నారు. ఈ క్రమంలో రాజీవ్ శుక్లా పైన లలిత్ మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంత మేరకు ఉందో తెలియదు కానీ… దీన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి కచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు.
🚨 LALIT MODI EXPOSED BCCI SECRETARY RAJIV SHUKLA 🚨
– Various reports have revealed a sensational allegation that BCCI Secretary Rajeev Shukla allegedly demanded money from players in exchange for helping them play in the IPL. However, when the player refused to agree, he was… pic.twitter.com/No4LVjFIhP
— lndian Sports Netwrk (@IS_Netwrk29) May 14, 2026