Jacob Bethell Gold chain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో 85% దాదాపు పూర్తయ్యాయి. ఇందులో భాగంగానే రాయ్ పూర్ వేదికగా ( Shaheed Veer Narayan Singh International Stadium, Raipur) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ( Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఏకంగా ఆరు వికెట్ల తేడాతో బంపర్ విషయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసి విరోచిత పోరాటం చేశాడు విరాట్ కోహ్లీ. ఇక ఈ మ్యాచ్ జరుగుతుండగా బెంగళూరు ఆటగాడు జాకబ్ బెథెల్ ( Jacob Bethell) కు ఊహించని పరిణామం ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. అతని గోల్డ్ చైన్ ను దొంగిలించారని సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో భాగంగా రాయల్ చాలెంజెస్ బెంగళూరు అభిమానులు చాలా ఓవర్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ప్రారంభంలోనే స్టేడియం కి వచ్చిన కొంత మంది మొబైల్ ఫోన్లను బెంగళూరు అభిమానులు దొంగిలించారు. ఇక లేటెస్ట్ గా తమ సొంత జట్టు ఆటగాడు జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ కూడా బుధవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా దొంగిలించారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ గోల్డ్ చైన్ బెంగళూరు ఆటగాడు దేవదత్ పడిక్కల్ కు లభ్యం కాగా… వెంటనే అంపైర్ నితిన్ కు ఇచ్చిన ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో ఆ గోల్డ్ చైన్ తీసుకున్న అంపైర్.. ఐపిఎల్ యాజమాన్యానికి సమాచారం అందించాడు. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత జాకబ్ బెథెల్ ను పిలిచి ఆ గోల్డ్ చైన్ అప్పగించినట్లు తెలుస్తోంది. అటు ఆర్సీబీ అభిమానులు దొంగిలించారన్న వార్తలు రావడంతో ట్రోలింగ్ కూడా మొదలైంది. పాకిస్తాన్ వెధవల్లాగా తయారు అవుతున్నారంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్నారు నెటిజెన్స్.
బెంగళూరు వర్సెస్ కేకేఆర్ మధ్య నిన్న మ్యాచ్ జరగగా జాకబ్ బెథెల్ బ్యాటింగ్ కు దిగాడు. అయితే కేకేఆర్ బౌలర్ వేసిన ఓ బంతి తన హెల్మెట్ కి తగిలింది. ఆ క్రమంలోనే గోల్డ్ చైన్ కూడా తెగి కిందపడింది. ఇది చూసుకోకుండా పెవిలియన్ కు వెళ్లిపోయాడు జాకబ్. అయితే గ్రౌండ్ లో దొరికిన ఆ చైన్ ను అంపైర్ కు ఇచ్చాడు పడిక్కల్. అయితే ఈ విషయాన్ని చెప్పకుండా బెంగళూరు అభిమానులను కించపరిచేలా కొంతమంది పోస్టులు పెడుతున్నారు. వాళ్లే ఈ గోల్డ్ చైన్ దొంగతనం చేసే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.
Jacob Bethell's lost his Gold chain. pic.twitter.com/vPvQxOEhTV
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) May 13, 2026