BigTV English

Mausami Singh: పాకిస్తాన్ ను ఓడించినందుకు.. రోహిత్ శర్మ పై కాంగ్రెస్ కుట్రలు?

Mausami Singh: పాకిస్తాన్ ను ఓడించినందుకు.. రోహిత్ శర్మ పై  కాంగ్రెస్ కుట్రలు?

Mausami Singh: కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ షమా మహమ్మద్ భారత్ – న్యూజిలాండ్ మధ్య ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్ జరుగుతుండగా ఎక్స్ {ట్విట్టర్} వేదికగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రోహిత్ ని బాడీ షేమింగ్ చేసింది షమా మొహమ్మద్. రోహిత్ శర్మ ఒక స్పోర్ట్స్ మెన్ గా ఉండడానికి వీలులేనంత లావుగా ఉన్నాడని వ్యాఖ్యానించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ 17 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.


 

ఆ సమయంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రోహిత్ శర్మని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రోహిత్ శర్మ టీం ఇండియా కెప్టెన్ లలో చెత్త రికార్డు ఉన్న వ్యక్తిగా ఆమె పేర్కొంది. దీంతో షమా మహమ్మద్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ కూడా ఘాటుగా స్పందించింది. బిజెపి అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి షమా వ్యాఖ్యలను తప్పు పట్టడమే కాకుండా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.


రాజకీయంగా అన్ని విధాలుగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు క్రికెట్ ని కూడా విఫల క్రీడగా మార్చాలనుకుంటుందా..? అని ప్రశ్నించారు. రాజకీయాలలో విఫలమైన ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పుడు క్రికెట్ ఆడాలని పార్టీ భావిస్తుందా.? అంటూ ఎగతాళి చేశారు. మరోవైపు ఆమె వ్యాఖ్యలపై బీసీసీఐ కూడా ఘాటుగా స్పందించింది. ఓ బాధ్యతాయుతమైన వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకీయా.

అయితే షమా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ పక్కకి తప్పుకుంది. ఆమె వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా అన్నారు. షమా మహమ్మద్ వ్యాఖ్యలతో దిద్దుబాటు చర్యలకు దిగిన కాంగ్రెస్ పార్టీ.. ఆమె కామెంట్లకు, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. భవిష్యత్తులో ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశించామని, క్రీడాకారులను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటుందని పవన్ పేర్కొన్నారు.

 

అయితే ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇంకా వేడి తగ్గట్లేదు. తాజాగా ఓ నేషనల్ మీడియా డిబేట్ లో షమా మహమ్మద్ నీ ఓ యాంకర్ ప్రశ్నిస్తూ.. మీరు రోహిత్ శర్మను టార్గెట్ చేశారని మండిపడింది. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో.. భారత జట్టు పాకిస్తాన్ ని ఓడించినందుకే మీరు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ కి సపోర్ట్ గా కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలు చేయించిందని ఆ యాంకర్ ప్రశ్నించింది. అయితే దీనిపై షమా మొహమ్మద్ స్పందిస్తూ.. పాకిస్తాన్ కి, కాంగ్రెస్ కి ఎటువంటి సంబంధం లేదని.. తాము పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం లేదని తెలిపింది. తాను కేవలం రోహిత్ శర్మ ఫిట్నెస్ గురించే మాట్లాడానని.. దానికి, కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తెలిపింది.

https://twitter.com/TimesAlgebraIND/status/1896694284071612504

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×