First Rajdhani Express Train: భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నిత్యం వేలాది రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. లక్షలాది మంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. దేశ వ్యాప్తంగా జనరల్ రైళ్ల నుంచి అత్యాధునిక వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల వరకు సేవలను అందిస్తున్నాయి. అయితే.. ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజధానికి ఎక్స్ ప్రెస్ పట్టాలు ఎక్కి 56 ఏండ్లు పూర్తి చేసుకుంది. మార్చి 1, 1969న రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు తన సేవలను మొదలు పెట్టింది. రాష్ట్ర రాజధానులను జాతీయ రాజధానితో అనుసంధానించే లక్ష్యంతో ఈ రైళ్లను ప్రారంభించింది. ప్రస్తుతం, దేశ వ్యాప్తంగా 20కి పైగా రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు పలు మార్గాల్లో నడుస్తున్నాయి.
రాజధాని ఎక్స్ ప్రెస్ తొలుత ఎక్కడ ప్రారంభం అయ్యిందంటే?
దేశంలో తొలి రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు హౌరా- న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ల మధ్య మధ్య ప్రారంభం అయ్యింది. ఈ రైలు అందుబాటులోకి వచ్చి 56 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రాజధాని ఎక్స్ ప్రెస్ ను భారతీయ రైల్వే నెట్ వర్క్ లోని ప్రీమియం రైళ్లలో ఒకటిగా ఇప్పటికీ పరిగణిస్తారు. ఈ రైలును ప్రస్తుతం తూర్పు రైల్వే (ER) జోన్ నిర్వహిస్తోంది.
ఎన్ని కిలో మీటర్లు.. ఎంత సమయం..
హౌరా- న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు 1449 కిలో మీటర్ల దూరాన్ని 17:15 గంటల్లో చేరుకుంటుంది. బికనీర్ సీల్దా దురంతో ఎక్స్ ప్రెస్, సీల్దా న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ తో పోల్చితే ఈ రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. ఈ రెండు రైళ్లు సుమారు 18:00 గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటాయి.
ఎన్ని స్టేషన్లలో ఆగుతుందంటే?
12301/12302 నెంబర్ గల హౌరా- న్యూఢిల్లీ- హౌరా రాజధాని ఎక్స్ ప్రెస్ మార్గ మధ్యంలో ఏడు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. అసన్సోల్ జంక్షన్, ధన్ బాద్ జంక్షన్, పరస్నాథ్, గయా జంక్షన్, డిడి ఉపాధ్యాయ జంక్షన్, ప్రయాగ్ రాజ్ జంక్షన్, కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది. ఇక హౌరా నుంచి న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు రెండు మార్గాల్లో వెళ్లే అవకాశం ఉంటుంది. పాట్నాతో పాటు గయా మీదుగా ప్రయాణిస్తాయి.
Read Also: ఇండియన్ రైల్వే సరికొత్త నిర్ణయం, ఇక టికెట్ లేకుండా స్టేషన్ లోకి అడుగు పెట్టడం అసాధ్యం!
కంపార్ట్ మెంట్లు, టికెట్ ధరలు
ఇక హౌరా నుంచి న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులో మూడు రకాల కంపార్ట్ మెంట్లు ఉంటాయి. వాటిలో ఒకటి AC 3 టైర్ (3A) కాగా, మరొకటి AC 2 టైర్ (2A), ఇంకొకటి AC ఫస్ట్ క్లాస్ (1A). ఇక ఛార్జీల విషయానికి వస్తే, 3A లో ప్రయాణించడానికి ఛార్జీ రూ. 2840గా ఇండియన్ రైల్వే నిర్ణయించింది. 2A రూ. 3880, 1A రూ. 5155గా నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఛార్జీ డైనమిక్ గా ఉంటుంది.
Read Also: ప్యాసింజర్లకు అలర్ట్, ఇకపై ఈ రైళ్లు ఆ స్టేషన్ లో ఆగవట!