Karishma Kapoor: మనసా.. వాచా.. కర్మణా.. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ.. పెద్దల ఆశీర్వాదంతో మూడు ముళ్ళు ఏడడుగులతో ఒక్కటైన జంట.. జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని వాగ్దానం చేసుకుంటారు. ముక్కు మొహం తెలియని వాడిని.. పెద్దలు చెప్పారని వివాహం చేసుకొని, ఆ కుటుంబం కోసం సర్వస్వాన్ని ధారపోస్తుంది మహిళ.. అయితే అలాంటి ఇంట్లోనే ఆ మహిళకు ఇబ్బందులు ఎదురైతే.. ఇక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం వర్ణనాతీతం. ఇలాంటి ఎన్నో సమస్యలు ఎంతోమంది ఆడవారు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు తానేమి ఇందుకు అతీతం కాదు అని చెబుతోంది ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కరిష్మా కపూర్ (Karishma Kapoor). జీవితాంతం తోడుంటానని, కష్టసుఖాల్లో భాగం పంచుకుంటానని , కంటికి రెప్పలా చూసుకుంటానని హామీ ఇచ్చిన భర్త.. డబ్బుల కోసం తనను బానిసను చేసుకొని ఇంకొకరి దగ్గరకు పంపిస్తున్నాడు అని చెప్పి కన్నీటి పర్యంతం అయింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మొదటి భర్తకు అందుకే విడాకులు ఇచ్చాను..
కరిష్మా కపూర్.. ఈ జనరేషన్ వారికి ఈమె గురించి పెద్దగా తెలియకపోయినా 1990లలో వారికి కరిష్మా కపూర్ ఒక డ్రీమ్ గర్ల్. ఈమె ఎవరో కాదు కరీనాకపూర్ (Kareena Kapoor) సొంత అక్కే కావడం గమనార్హం. 1990లో తన అంద చందాలతో, నటనతో బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కెరియర్ మొత్తం నాశనం అయిందని చెప్పాలి. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే సంజయ్ కుమార్ (Sanjay Kumar) అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే పెళ్లయిన కొన్నాళ్లకే అతడికి విడాకులు ఇచ్చింది కరిష్మా కపూర్. ఇక తన భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి? అనే విషయాన్ని తాజాగా బయటపెట్టింది కరిష్మా కపూర్.
ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే.. ఆరోజు రాత్రికి వారి దగ్గరే..
కరిష్మా కపూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. ఈ విషయాలన్నీ బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. “మా పెళ్లయిన తర్వాత.. ఆయన అసలు స్వరూపం బయటపడింది. ఆయన ప్రతిరోజు తన స్నేహితుల వద్ద నన్ను వేలం పాట వేసేవారు. ఎవరైతే ఎక్కువ డబ్బులు చెల్లిస్తారో.. ఆ రోజు రాత్రికి ఆ వ్యక్తి దగ్గర గడపాల్సి ఉంటుంది. ఇలా ఆయన పెట్టే టార్చర్ భరించలేక అతడికి విడాకులు ఇచ్చాను” అంటూ కరిష్మా కపూర్ వెల్లడించింది.అయితే ఇతడికి విడాకులు ఇచ్చిన తర్వాత మళ్లీ రెండో పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత కూడా కరిష్మా పలు సినిమాలలో నటించింది . ఇటీవల కాలంలో ఈమె సినిమాలు చాలా వరకు తగ్గించిందని చెప్పాలి. ఏది ఏమైనా పెళ్లి చేసుకొని ఆ టార్చర్ భరించలేక విడాకులు తీసుకున్న కరిష్మా కపూర్ ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకొని జీవితాన్ని సంతోషంగా లీడ్ చేస్తోందని చెప్పవచ్చు. ఈ విషయాలు తెలుసుకున్న కరీనాకపూర్ అభిమానులు కూడా.. కరీనా సోదరి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొందా అని చింతిస్తున్నారు.