Harbhajan Singh : పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్… ఈ సిరీస్ కోల్పోయింది. వైట్ వాష్ అయ్యే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అటు ఇంగ్లాండ్ గడ్డపై ఓటమి నేపథ్యంలో ఏడుగురు క్రికెటర్లను వెనక్కి తీసుకువచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… ఇద్దరు కోచ్ లపై కూడా వేటు వేసింది. మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది.
ఇంగ్లాండ్ గడ్డపై దారుణంగా విఫలమైన పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు గతంలో పనిచేసిన షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిదిలను కోచ్ లుగా నియామకం చేసుకోవాలని సూచనలు చేశారు. కోచ్ లుగా షోయబ్ అక్తర్, అఫ్రిదిలను పెట్టుకుంటే, పాకిస్తాన్ క్రికెట్ జట్టు తలరాత మారడం గ్యారెంటీ అన్నారు. ఒకప్పుడు షోయబ్ అక్తర్, అఫ్రిది ఇద్దరూ పాకిస్తాన్ జట్టులో కొనసాగారని గుర్తు చేశారు. ఈ ఇద్దరి వల్లే, పాకిస్తాన్ జట్టు ఎన్నో విజయాలను నమోదు చేసుకున్నట్లు వివరించారు. ప్రత్యర్థి జట్టుకు నరకం చూపించారు. ఇలాంటి తరుణంలోనే షోయబ్ అక్తర్, అఫ్రిది కోచ్ లుగా నియమాకం చేసుకుంటే, మంచి ఫలితాలు వచ్చాయన్నారు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh).
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనవసరంగా విదేశీ కోచ్ ల కోసం పాకులాడుతున్న విషయాన్ని కూడా హర్భజన్ సింగ్ గుర్తు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులోనే చాలా మంది సీనియర్ క్రికెటర్లు ఉన్నారని.. వాళ్లందరూ రిటైర్మెంట్ తీసుకొని రిలాక్స్ గా ట్లు వివరించారు. అలాంటి వారిలో షాహిద్ అఫ్రిది.. షోయబ్ అక్తర్ ఇద్దరూ కీలకమైన ప్లేయర్లు అని తెలిపారు. ఈ ఇద్దరినీ కోచ్ లుగా నియామకం చేసుకుంటే, పాకిస్తాన్ క్రికెట్ జట్టు తలరాత మారడం గ్యారెంటీ అంటూ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ బ్యాటింగ్ కోచ్ గా షాహిద్ అఫ్రిది, బౌలింగ్ షోయబ్ అక్తర్ బాగా వర్క్ చేస్తారని నమ్మకం ఉందన్నారు. ఈ ఇద్దరికి ఫుల్ పవర్స్ ఇస్తే.. పాకిస్తాన్ జట్టు ( Pakistan team) వరల్డ్ కప్ కూడా సులభంగా కొడుతుందని స్పష్టం చేశారు. మొహ్సిన్ నఖ్వీ లాంటి వెధవలను పక్కకు పెట్టాల్సిన అవసరం ఉందని కూడా వ్యాఖ్యానించారు. లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి మారబోదని హెచ్చరించారు.