E-Paper
Advertisement

కొత్త కలర్స్‌ తో కవాసకి Z సిరీస్.. నయా లుక్ సూపరో సూపరు!

కొత్త కలర్స్‌ తో కవాసకి Z సిరీస్.. నయా లుక్ సూపరో సూపరు!
Advertisement

Kawasaki Z900 2027 Update: కవాసకి అభిమానులకు గుడ్‌న్యూస్. 2027 మోడల్ ఇయర్ Z సిరీస్ బైక్‌లకు కొత్త కలర్స్ ను తీసుకొచ్చింది. ముఖ్యంగా Z650 S, Z900, Z900 SE మోడళ్లలో కొత్త కలర్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఈసారి కంపెనీ బైక్‌లకు సంబంధించిన ఇంజిన్, మెకానికల్ అంశాల్లో ఎలాంటి ఛేంజెస్ చేయలేదు.

మూడు కొత్త రంగుల్లో Z650 S

కవాసకి 2025 చివర్లో యూరోపియన్ మార్కెట్ కోసం Z650 Sను పరిచయం చేసింది. ఇది Z650 ప్లాట్‌ ఫామ్‌పైనే రూపొందినప్పటికీ, డిజైన్ విషయంలో పెద్ద Z900కు దగ్గరగా కనిపించేలా మార్పులు చేశారు. బైక్‌కు సూపర్ లుక్ ఇవ్వడంతో పాటు రైడింగ్ పొజిషన్‌ను కూడా అప్ డేట్ చేశారు. వెడల్పు అయిన హ్యాండిల్‌ బార్, రీ పొజిషన్ ఫుట్‌ పెగ్స్ తో రైడర్‌ కు మరింత సౌకర్యవంతమైన ఎర్గోనామిక్స్ అందించేందుకు ప్రయత్నించారు. యూరప్‌లో Z650తో పాటు Z650 S కూడా అమ్ముతున్నారు. 2027 మోడల్‌ లో Z650 S మూడు కొత్త రంగుల్లో లభించనుంది. బ్లాక్, రెడ్, గ్రీన్ హైలైట్స్‌ తో కూడిన వైట్ కలర్ ఇందులో ఉన్నాయి. అయితే, భారత మార్కెట్‌లో ప్రస్తుతం Z650 S అందుబాటులో లేదు. ఇక్కడ స్టాండర్డ్ Z650 మాత్రమే అమ్ముతున్నారు.

Z900కు కూడా కొత్త కలర్ ఆప్షన్స్

Advertisement

దేశంలో ఇప్పటికే Z900 అందుబాటులో ఉంది. 2025లో అప్‌ డేట్ చేసిన Z900ను మన మార్కెట్లో బ్లాక్ విత్ గోల్డ్ హైలైట్స్, సిగ్నేచర్ లైమ్ గ్రీన్ రంగుల్లో అమ్ముతున్నారు. ఇక 2027 యూరోపియన్ వెర్షన్‌లో మాత్రం మూడు కొత్త రంగులను కవాసకి తీసుకొచ్చింది. గోల్డ్ హైలైట్స్ లేకుండా పూర్తిగా బ్లాక్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ హైలైట్స్‌ తో కూడిన వైట్ కలర్ ఇందులో ఉన్నాయి. దీంతో Z900కు మరింత సూపర్ లుక్ లభించనుంది.

Z900 SEలో గ్రే కలర్

స్టాండర్డ్ Z900తో పోలిస్తే మరింత ప్రీమియం పరికరాలు కలిగిన Z900 SE కూడా కొత్త రంగుతో రానుంది. ఈ మోడల్‌ లో బ్రెంబో బ్రేకులు, ఓహ్లిన్స్ సస్పెన్షన్ లాంటి అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. 2027లో Z900 SEను గ్రే రంగులో అందిస్తున్నారు. దీనికి కాంట్రాస్ట్‌ గా గ్రీన్ ఫ్రేమ్, గ్రీన్ వీల్స్ ఉండటం ఆకట్టుకుంటుంది. కవాసకి సిగ్నేచర్ గ్రీన్ కలర్‌ ను ఇష్టపడే వారికి ఈ కాంబినేషన్ ఆకట్టుకుంటుంది.

దేశీ మార్కెట్ లోకి కొత్త కలర్స్ వస్తాయా?

Advertisement

కొత్త కలర్ ఆప్షన్లు మినహా 2027 Z650 S, Z900, Z900 SE మోడళ్లలో పెద్దగా మార్పులు లేవు. ఇవి 2026 మోడళ్లలో ఉన్న ఇంజిన్, మెకానికల్ సెటప్‌ నే కొనసాగించనున్నాయి. అయితే, యూరప్‌ లో తీసుకొచ్చిన ఈ కొత్త కలర్స్ ఇండియన్ Z900కు కవాసకి తీసుకొస్తుందా? Z650 Sను భారత్‌లో కూడా లాంచ్ చేస్తుందా? అనే విషయంపై కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read Also: హిమాలయన్ 440 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Tags

Related News

పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!

హీరో, హోండాకు టీవీఎస్ షాక్.. ఆగస్టులో నంబర్ వన్ టూ వీలర్ కంపెనీగా రికార్డ్!

కియా సోరెంటో వచ్చేసింది.. ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!

హిమాలయన్ 440 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

టాటా కర్వ్‌ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

హోండా ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్.. ఎలివేట్, సిటీ, అమేజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు!

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

Big Stories

Advertisement
×