E-Paper
Advertisement

Shubman Gill: గిల్ కెరీర్ బొంద‌పెట్టారు క‌దరా..తెర వెనుక న‌డిపించింది వీళ్లే..గంభీర్ కూడా తెలియ‌కుండానే ?

Shubman Gill: గిల్ కెరీర్ బొంద‌పెట్టారు క‌దరా..తెర వెనుక న‌డిపించింది వీళ్లే..గంభీర్ కూడా తెలియ‌కుండానే ?
Advertisement

Shubman Gill: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన టీమిండియా జట్టును రెండు రోజుల కిందట ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అజిత్ అగార్కర్, ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ, టి20 వరల్డ్ కప్ ఆడే టీమిండియా జట్టును ప్రకటించి పెను సంచలనం సృష్టించింది. ఎవరు ఊహించని విధంగా జట్టు ఉండడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతుంటే, గంభీర్ అలాగే గిల్ మాత్రం చాలా డీలా పడిపోతున్నారు. గౌతమ్ గంభీర్ కు తెలియకుండానే గిల్ పేరును తొలగించిందట టీమ్ ఇండియా సెలెక్షన్ కమిటీ. అందుకే శనివారం రోజున మధ్యాహ్నం ఒకటిన్నరకు ప్రకటించాల్సిన జట్టును కాస్త ఆలస్యం చేశారు. చివరి క్షణంలో గంభీర్ అలాగే గిల్ కు సమాచారం ఇచ్చారట. ఆ తర్వాత జట్టును ప్రకటించారు. దీంతో అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి.

Also Read: U19 Asia Cup 2025: ఊర కుక్క‌ల్లాగా రెచ్చిపోయిన పాకిస్తాన్ ప్లేయ‌ర్లు..బ్యాన్ చేసేందుకు ఐసీసీ స్కెచ్ ?

తెర వెనుక నడిపించింది ఈ ఇద్దరు తోపుగాళ్లే

Advertisement

గత ఏడాది కాలంగా టి20 టీమిండియా జట్టులో తిష్ట వేసి కూర్చున్నాడు గిల్. ఈ ఏడాది కాలంగా ఒక్క అర్థ సెంచరీ కూడా నమోదు చేయలేదు. అయినప్పటికీ గంభీర్ కారణంగా గిల్ టి20 వైస్ కెప్టెన్సీ కూడా అందించారు. అయినా కూడా గిల్ ఆటతీరులో ఎలాంటి మార్పు లేదు. అయితే 20 పరుగులు కొట్టడం లేదా డకౌట్ అవ్వడం జరుగుతోంది. ఇక ఇవన్నీ పరిశీలించిన సెలక్షన్ కమిటీ సభ్యులు ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్ ఇద్దరు కలిసి గిల్ స్థానానికి ఎసరు పెట్టారు. అదే సమయంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇశాన్ కిషన్ అద్భుతంగా రాణించిన విషయాన్ని గమనించారు. వెంటనే జితేష్ శర్మను వెనక్కి లాగేసి.. సంజు శాంసన్ కు లైన్ క్లియర్ చేశారు.

ఇటు గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ ను టి20 ప్రపంచ కప్ ఆడే టీమిండియా జట్టులోకి తీసుకువచ్చారు. ఈ దెబ్బకు సంజు శాంసన్, ఇశాన్ కిషన్ కు న్యాయం జరిగింది. టి20 జంటలో వీళ్ళిద్దరూ కచ్చితంగా స్క్వాడ్ లో ఉండేలా లైన్ క్లియర్ అయింది. అటు అభిషేక్ శర్మకు సంజు రూపంలో మంచి ఓపెన్ దొరికాడు. అగార్కర్ ను ఎదిరించి ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే జట్టును ప్రకటించిన తర్వాత ఆ టీమిండియా అభిమానులు ఫుల్ ఖుషి గా కనిపిస్తున్నారు. ఇక ఈ దెబ్బకు గిల్ టి20 ముగిసినట్లే అని చెబుతున్నారు.

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడే టీమిండియా జ‌ట్టు

Advertisement

టీమిండియా జ‌ట్టు: సూర్య కుమార్ యాద‌వ్ (కెప్టెన్), బుమ్రా, అభిషేక్, హర్షిత్, సంజు, అర్ష్‌దీప్, తిలక్, కుల్దీప్, హార్దిక్, వరుణ్, దుబే, సుందర్, అక్షర్, ఇషాన్ (వికెట్ కీపర్), రింకు

Also Read:  INDW vs SLW 1st T20I: పెళ్లి త‌ర్వాత స‌రికొత్త రికార్డు..4 వేల ప‌రుగుల క్ల‌బ్ స్మృతి, వైజాగ్ టీ20లో టీమిండియా విజ‌యం

 

Related News

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

Big Stories

Advertisement
×