E-Paper
Advertisement

Champion Movie : రిలీజ్ కు ముందే హిట్ కొట్టేసిన ‘ఛాంపియన్’.. భారీ ధరకు ఓటీటీ డీల్..

Champion Movie : రిలీజ్ కు ముందే హిట్ కొట్టేసిన ‘ఛాంపియన్’.. భారీ ధరకు ఓటీటీ డీల్..
Advertisement

Champion Movie : టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. హీరో శ్రీకాంత్ తనయుడు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈయన గతంలో చేసిన సినిమా పెళ్లి సందడి.. ఆ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఛాంపియన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు రోషన్.. స్పోర్ట్స్ డ్రామా ఈ మూవీ స్టోరీ ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన అప్డేట్స్ చూస్తే అర్థమవుతుంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. మరి ఈ సినిమా ఓటీటీ డీల్ ఎన్ని కోట్లకు క్లోజ్ అయ్యిందో ఒకసారి తెలుసుకుందాం..

భారీ ధరకు ‘ఛాంపియన్’ ఓటీటీ డీల్…

పెళ్లి సందడి తర్వాత రోషన్ నటిస్తున్న ఛాంపియన్ మూవీ పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న మూవీ కావడంతో జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తుంది. ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ప్రతి అప్డేట్ కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా తాజాగా ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దాదాపు 16 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తుంది. ఓ మిడ్ రేంజ్ సినిమాకు ఇది మంచి డీల్ అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.. నిర్మాణ సంస్థ స్వప్న సినిమాస్ ‘ఛాంపియన్’ మూవీని రూపొందించింది. ఛాంపియ‌న్ సినిమాపై దాదాపు రూ.45 కోట్లు పెట్టింది స్వ‌ప్న సినిమాస్ సంస్థ‌.. ఈ సినిమాకు దాదాపు ఓటీటీ వల్లే లాభాలు వచ్చినట్లు తెలుస్తుంది. అటు శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైన విషయం తెలిసిందే.. మొత్తానికి ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే కోట్లు రాబట్టేసింది.

Advertisement

Also Read :క్రికెటర్ అవ్వాలనుకొని హీరోలైన టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా..?

రోషన్ తో మరో ప్రాజెక్ట్.. 

ఛాంపియన్ మూవీలో రోషన్ సరసన అనస్వర రాజన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమెకు టాలీవుడ్లో ఇదే ఫస్ట్ మూవీ.. నటుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, హీరోయిన్ అర్చన ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా మూవీని నిర్మించాయి.. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఈనెల 24న ఈ చిత్రం ప్రీమియ‌ర్ షోలు పడబోతున్నాయి. ఇకపోతే రిలీజ్ అవ్వకముందే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ నిర్మాణ సంస్థ హీరో రోషన్ తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. ఈసారి ఓ స్టార్ డైరెక్ట‌ర్ ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తారు.. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అనౌన్స్ చెయ్యనున్నట్లు సమాచారం..

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×