AUS Vs ENG 4th Test : మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు క్రీడా ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. స్టేడియంలో పరుగుల వరద పారుతుందని ఆశించిన అభిమానులకు, అక్కడ బౌలర్ల ప్రతాపం చూసి మైండ్ బ్లాక్ అయింది. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పిచ్ ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతోంది. ఏ జట్టు కూడా 200 పరుగుల మార్కును అందుకోలేకపోయింది.ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తాజా ఎడిషన్ లో ఇంగ్లండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్ట్ స్టోక్స్ బృందం విజయం సాధించింది. ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ లో కంగారుల ఆధిక్యాన్ని తగ్గించింది. యాషెస్ సిరీస్ లో భాగంగా 5 టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
Also Read : Dhruv Shorey : వరుసగా 5 సెంచరీలతో రికార్డు.. వరల్డ్ రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్..!
ఇందులో భాగంగా పెర్త్, బ్రిస్బేన్, ఆడిలైడ్ టెస్టుల్లో ఆసీస్ చేతిలో ఇంగ్లీషు జట్టు చిత్తుగా ఓడింది. దీంతో 3-0 కంగారులు సిరీస్ మరోసారి కైవసం చేసుకోగా.. ఇంగ్లండ్ జట్టు తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. ఇలాంటి తరుణంలో ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయపడటంతో మరో ఎదురుదెబ్బ తగిలింది. అతను లేకుండానే బాక్సింగ్ డే టెస్టు బరిలో దిగింది. మెల్ బోర్న్ వేదికగా శుక్రవారం మొదలైన ఈ నాలుగో టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. యువ పేసర్ జోష్ టంగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. ఆసీస్ ను తొలి ఇన్నింగ్స్ లో 152 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ సంతోషం ఇంగ్లండ్ కి ఎక్కువ సేపు నిలవలేదు. తొలిరోజే తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన స్టోక్స్ బృందం.. 110 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ పేసర్లు నాసర్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2 వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్.. వికెట్ నష్టపోకుండా నాలుగు పరుగులు చేసింది.
ఇక 4/0 ఓవర్ నైట్ తో శనివారం నాటి రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్.. మరో 128 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్ 46, స్టీవ్ స్మిత్ 24 మాత్రమే మెరుగైన స్కోర్ సాధించారు. మిగతా వారందరూ చేతులెత్తేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడర్ కార్స్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కెప్టెన్ స్టోక్స్ మూడు, జోష్ టంగ్ రెండు, గస్ అట్కిన్సన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అది నుంచే నిప్పులు చెరుగుతూ 34.3 ఓవర్లలో ఆసీస్ ను 132 పరుగులకు ఆలౌట్ చేశారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 42 పరుగులుకలుపుకొని ఆసీస్.. ఇంగ్లండ్ కి 175 పరుగుల లక్ష్యాన్ని విధించింది. పేసర్లకు అనుకూలించిన పిచ్ పై భారీ స్కోర్ ను ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ సఫలమైంది. టాప్ ఆర్డర్ లో ఓపెనర్లు జాక్ క్రాలీ(37), బెన్ డకెట్ (34) రాణించగా.. వన్ డౌన్ లో వచ్చిన పేసర్ బ్రైడన్ కార్స్ (6) విఫలం చెందాడు. బేకబ్ బెతెల్ (40) బాధ్యతాయుతంంగా ఆడాడు. జో రూట్ 15 పరుగులు చేశాడు. స్టోక్స్ 2 నిరాశ పరిచాడు. జెమీ స్మిత్ 3తో కలిసి అజేయంగా నిలిచిన హ్యారీ బ్రూక్ 18 పరుగులు చేసి ఇంగ్లండ్ ను విజయతీరాలకు చేర్చాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, రిచర్డ్ సన్, స్కాట్ బోలాండ్ తలో రెండు వికెట్లు తీశారు. ఇంగ్లండ్ 32.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు తీసి గెలుపు అందుకుంది.
Also Read : INDW vs SLW: షెఫాలీ బీభత్సం..మూడో టీ20లోనూ టీమిండియా విజయం.. సిరీస్ కైవసం