E-Paper
Advertisement

INDW vs SLW: షెఫాలీ బీభ‌త్సం..మూడో టీ20లోనూ టీమిండియా విజ‌యం.. సిరీస్ కైవ‌సం

INDW vs SLW: షెఫాలీ బీభ‌త్సం..మూడో టీ20లోనూ టీమిండియా విజ‌యం.. సిరీస్ కైవ‌సం
Advertisement

INDW vs SLW :  తిరువ‌నంత‌పురం వేదిక‌గా శ్రీలంక వ‌ర్సెస్ భార‌త్ మ‌ధ్య మూడో టీ-20 మ్యాచ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇక  మూడో టీ20 మ్యాచ్‌లో కూడా  భారత మహిళల జట్టు సర్వశక్తులూ ఒడ్డి శ్రీలంకను ఓడించింది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి తొలుత‌ బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టుకు భారత పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ చుక్కలు చూపించింది.

Also Read : AUS Vs ENG 4th Test : పిచ్‌లో 10 మిమీల గడ్డి.. 131 ఏళ్ల నాటి రికార్డ్ బ్రేక్..!

భార‌త బౌల‌ర్ల విజృంభ‌ణ‌..

Advertisement

పవర్ ప్లే లోనే కీలక వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బ తీసింది. రేణుకా 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. మరోవైపు స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ 3 వికెట్లతో చెలరేగింది. ఈ క్రమంలోనే టీ20ల్లో 150 వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. వీరిద్దరి ధాటికి శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. 113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు షఫాలీ వర్మ వీరోచిత ఆరంభాన్ని ఇచ్చింది. మొదటి ఓవర్ నుంచే లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగిన షఫాలీ, మైదానాన్ని బౌండరీలతో హోరెత్తించింది. కేవలం 42 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆమె స్ట్రైక్ రేట్ (188.09) చూస్తే లంక బౌలర్లను ఆమె ఎంతలా ఆడుకుందో అర్థం చేసుకోవచ్చు.

షఫాలీ వర్మ మారణహోమం

షఫాలీ  ధాటికి భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది. స్మృతి మంధాన త్వరగానే అవుట్ అయినప్పటికీ, షఫాలీ జోరుతో భారత్ ఎక్కడా తడబడలేదు. ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో 2 మ్యాచ్‌లు ఉండగానే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. శ్రీలంక‌తో జ‌రిగిన టీ-20 సిరీస్ లో భాగంగా విశాఖ‌లో జ‌రిగిన తొలి రెండు టీ20 మ్యాచ్ ల్లో విజ‌యం సాధించిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు.. తాజాగా తిరువ‌నంత‌పురంలో కూడా విజ‌యం సాధించ‌డంతో తిరుగులేద‌ని నిరూపించింది. ఈ విజ‌యంలో భార‌త బౌల‌ర్లు వేసిన పునాదిని బ్యాట‌ర్లు స‌ద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా ఫీల్డింగ్ లో కూడా భార‌త క్రీడాకారిణులు చురుకుగా క‌దిలి లంక బ్యాట‌ర్ల పై ఒత్తిడి పెంచారు. ఈ విజ‌యం తో భార‌త జ‌ట్టు సిరీస్ లో త‌న ఆధిప‌త్యాన్ని చాటుకుంది. 2024లో చివ‌ర‌గా భార‌త్ పై గెలిచింది శ్రీలంక‌. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ తో జ‌రిగిన 11 టీ-20 మ్యాచ్ ల్లో శ్రీలంక 9 మ్యాచ్ ఓడిపోవ‌డం విశేషం. ఈ మ్యాచ్ లో టీమిండియా విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. స్మృతి మంధాన‌ గ‌త మ్యాచ్ ల్లో 25, 14 ప‌రుగులు చేస్తే.. ఈ మ్యాచ్ లో మాత్రం కేవ‌లం 1 ప‌రుగులు చేసి ఔట్ కావ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

Also Read : MICT vs DSG: SA 20 సీజన్ 4 షురూ.. ఈ మ్యాచ్ లు ఉచితంగా ఎక్కడ చూడాలంటే

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×