E-Paper
Advertisement

JC Prabhakar Reddy: న్యూ ఇయర్ వేడుకలకు మాధవీలతే చీఫ్ గెస్ట్: జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy: న్యూ ఇయర్ వేడుకలకు మాధవీలతే చీఫ్ గెస్ట్: జేసీ ప్రభాకర్ రెడ్డి
Advertisement

JC Prabhakar Reddy: తాడిపత్రి పట్టణంలో న్యూ ఇయర్‌ వేడుకల నిర్వహణకు మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈసారి మూడు రోజుల పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తామని జేసీ ప్రకటించారు. న్యూ ఇయర్ వేడుకలకు సినీ నటి మాధవీలతను ఆహ్వానిస్తామన్నారు. పెన్నానది ఒడ్డున ఉన్న పార్కులోనే వేడుకలకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సారి న్యూ ఇయర్‌ వేడుకలకు సినీనటి మాధవీలతను ఆహ్వానిస్తున్నాం, ఆమె వస్తారో, రారో తెలియదన్నారు.

మూడు రోజుల పాటు వేడుకలు

గతేడాది పెన్నానది ఒడ్డున పార్కులో న్యూ ఇయర్‌ వేడుకల నిర్వహించారు జేసీ. మహిళలకు మాత్రమే అనుమతి అంటూ జేసీ చెప్పడంతో వివాదాస్పదం అయింది. ఈ వేడుకలపై మాధవీలత విమర్శలు చేశారు. ఆ వ్యవహారంలో తాము రాజీ అయ్యామనీ, దీంతో మాధవీలతను న్యూ ఇయర్ వేడుకలకు ఆహ్వానించాలనుకున్నామన్నారు. రావడం ఆమె ఇష్టమని చెప్పారు. ఈ నెల 29న చిన్నపిల్లలకు అనుమతి అని అందుకు ఏర్పాట్లు చేశామన్నారు. డిసెంబర్ 30న యువకులకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 31న పెద్దలను అనుమతిస్తామని జేసీ చెప్పారు. 29, 30 తేదీల్లో జరిగే వేడుకలకు అందరూ రావొచ్చన్నారు.

ఈసారి మాధవీలత చీఫ్ గెస్ట్

Advertisement

గ‌తంలో హీరోయిన్ మాధ‌వీల‌త త‌మ‌పై అభాండాలు వేశారని, ఈసారి ఆమెతో కాంప్రమైజ్ అయ్యామ‌న్నారు. ఇద్దరం స్వారీ చెప్పుకున్నామ‌ని జేసీ అన్నారు. ఈ సారి మాధ‌వీల‌త‌నే న్యూ ఇయర్ వేడుకలకు చీఫ్ గెస్ట్ అని చెప్పారు. త‌ప్పైందని స్వారీ చెప్పాన‌ని, ఆమె కూడా స్వారీ చెప్పడంతో కాంప్రమైజ్ అయ్యామ‌ని అన్నారు. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను ఒక్కో రోజు ఒక్కో విధంగా నిర్వహించాలని ప్లాన్ చేశామని జేసీ అన్నారు.

Also Read: Parakamani Theft Case: పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం.. కొత్త ఎఫ్ఐఆర్ దిశగా సీఐడీ అడుగులు!

గతేడాది వివాదం

Advertisement

గతేడాది డిసెంబర్ 31న తాడిపత్రి పార్కులో జేసీ ప్రభాకర్ రెడ్డి న్యూఇయర్ వేడుకలు నిర్వహించారు. మహిళల కోసం జేసీ ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకలకు వెళ్లొద్దంటూ మాధవీలత సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. దీంతో ఆమెపై జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×