Aus vs Eng: యాషెస్ సిరీస్ 2025-26 టోర్నమెంట్ ( The Ashes, 2025-26 ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్ ఆస్ట్రేలియా వశం అయింది. అయినప్పటికీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Australia vs England, 5th Test ) మధ్య ఐదవ టెస్ట్ సిడ్నీ వేదికగా కొనసాగుతోంది. అయితే ఈ టెస్ట్ లో రెండు జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మధ్య గొడవ చోటు చేసుకుంది. బౌలింగ్ చేసే క్రమంలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ తో ( MARNUS LABUSCHANGE.) గొడవ పెట్టుకున్నాడు కెప్టెన్ బెెన్ స్టోక్స్ ( BEN STOKES ). ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరగగా, ఆ తర్వాత మార్నస్ లబుషేన్ భుజాలపై చేయి కూడా వేశాడు. ఈ నేపథ్యంలోనే ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకొని గొడవను చల్లబరిచాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs England, 5th Test ) మధ్య జరుగుతున్న ఐదవ టెస్టు మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బౌలింగ్ చేస్తున్న క్రమంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేసే ప్రయత్నం చేశాడు బెన్ స్టోక్స్. సాధారణంగా గ్రౌండ్ లోకి దిగాడు అంటే ఫుల్ యాక్టివ్, దూకుడుగా ముందుకు వెళుతూ ఉంటాడు బెన్ స్టోక్స్ ( BEN STOKES ). ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ ( MARNUS LABUSCHANGE) తో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవకు దారితీసింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Australia vs England, 5th Test ) మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్లో రెండు జట్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్ లో 384 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ ఆటగాడు రూట్ ఒక్కడే 160 పరుగులతో దుమ్ము లేపాడు. అలాగే హ్యారీ బ్రూక్ 84 పరుగులతో రఫ్ఫాడించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ 384 పరుగులు సాధించింది ఇంగ్లాండు. అటు మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా దూకుడుగానే ఆడుతోంది. ఓపెనర్ హెడ్ 91 పరుగులతో బ్యాటింగ్ చేస్తుండగా మార్నస్ లబుషేన్ ( MARNUS LABUSCHANGE) 48 పరుగులతో రాణించాడు. రెండవ రోజు ముగిసే సమయానికి రెండు వికెట్లు నష్టపోయిన ఆస్ట్రేలియా ( Australia Team )166 పరుగులు సాధించింది.
Also Read: Ravichandran Ashwin: టీ20 వరల్డ్ కప్ 2026 కంటే సీరియల్స్ చూడటం బెటర్..టీమిండియా ఆడటం దండగే
THE HEATED MOMENTS BETWEEN BEN STOKES & MARNUS LABUSCHANGE. 🥶
– This is Ashes, The Cinema..!!!!
— Tanuj (@ImTanujSingh) January 5, 2026