Maxwell : ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్ వెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఐపీఎల్ ని కాదని 2026 సీజన్ లో పీఎస్ఎల్ తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్ 2026 వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ విడుదల చేసిన తరువాత మ్యాక్స్ వెల్ PSLలో అడుగుపెట్టాడు. ఈ సీజన్ లో హైదరాబాద్ కింగ్స్‌మెన్ (Hyderabad Kingsmen) జట్టుకు ఆడుతున్నాడు. అయితే ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ కరాచీలోని ఓ హోటల్ కి వచ్చినప్పుడు పాకిస్తాన్ జాతీయ దుస్తులైన తెల్లని కమీజ్ సల్వార్ ధరించి కనిపించాడు.
Also Read : Preity Zinta: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ప్రీతి జింటా !
మాక్స్ వెల్ తెల్లని దుస్తులు ధరించడంతో మాక్సి మామ ఇస్లాంలోకి మారాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఎండకు తెల్లని దుస్తులు చలువ ఉంటాయని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ మాక్స్ వెల్ తెల్లని డ్రెస్ ధరించడం.. అది పాకిస్తాన్ గెటప్ కావడంతో అక్కడి వాతావరణానికి ఇస్లాం మతానికి దగ్గరగా ఉందని కొందరూ ఇస్లాం మతంలోకి మారాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మాక్స్ వెల్ క్రికెట్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇటీవలే సెంట్రల్ కాంట్రాక్ట్ ని ప్రకటించింది. 2026-27 సీజన్ కి సంబంధించి 21 మందికి అవకాశం కల్పించినప్పటికీ అందులో మాక్స్ వెల్ కి అవకాశం రాకపోవడం గమనార్హం. మాక్స్ వెల్ 2017లో ఆస్ట్రేలియా తరపున చివరిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడాడు. రాబోయే సీజన్ లో ఎక్కువగా టెస్ట్ మ్యాచ్ లు ఎక్కువ ఆడే వారికే సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కడం గమనార్హం. మాక్స్ వెల్ ఇండియా ని కాదని.. పాకిస్తాన్ లీగ్ లో ఆడటంతో పలువురు టీమిండియా అభిమానులు కాస్త ఆగ్రహం గా ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read : డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరేట్ తాగుతూ దొరికిపోయిన రియాన్ పరాగ్..బ్యాన్ వేసేందుకు బీసీసీఐ నిర్ణయం !
ఇక ఆస్ట్రేలియా జట్టు.. భారత్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లతో టెస్ట్ సిరీస్ లను ఆడనుంది. టెస్ట్ జట్టులో స్థానం లేని మాక్స్ వెల్ గత ఏడాదే వన్డే మ్యాచ్ లకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం కేవలం అంతర్జాతీయ టీ-20ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. గత టీ-20వరల్డ్ కప్ లో కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు మ్యాక్స్ వెల్. మళ్లీ దాదాపు రెండు సంవత్సరాల తరువాత టీ-20 వరల్డ్ కప్ రానుంది. అందులో గ్లెన్ మ్యాక్స్ వెల్ కి చోటు కల్పించడం దాదాపు కష్టమే అని తెలుస్తోంది. అంతే కాదు.. మ్యాక్స్ వెల్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసిందని క్రీడా వర్గాలు అంచెనా వేస్తున్నాయి. ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ ను చూసినట్టయితే టెస్ట్ ఫార్మాట్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అద్భుతమైన ఆటగాళ్లకు అవకాశం లేకుండా పోయింది. మ్యాక్స్ వెల్ కి కూడా అదే పరిస్థితి అయింది. మ్యాక్సీ మామ ఐపీఎల్ లో ఆడితే బాగుండు అని టీమిండియా ఫ్యాన్స్ కోరుతున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==