E-Paper
Advertisement

Jahanara Alam : సె**క్స్ కోసం పీరియడ్స్ డేట్ అడిగేవాడు.. ఏడ్చేసిన బంగ్లా క్రికెటర్

Jahanara Alam : సె**క్స్ కోసం పీరియడ్స్ డేట్ అడిగేవాడు.. ఏడ్చేసిన బంగ్లా క్రికెటర్
Advertisement

Jahanara Alam : బంగ్లాదేశ్ మాజీ ఉమెన్ క్రికెట‌ర్ జ‌హ‌నారా ఆలం ఇటీవ‌ల బంగ్లాదేశ్ కెప్టెన్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. ముఖ్యంగా మాజీ సెలెక్ట‌ర్ మంజూరుల్ ఇస్లాం లైంగికంగా వేధించేవాడ‌ని జ‌హ‌నారా ఆలం ఆరోపించారు. ఇత‌ర ఉమెన్ క్రికెట‌ర్లూ ఇత‌ని బాధితులేన‌ని ఓ యూట్యూబ్ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. 2022 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రాక్టీస్ స‌మ‌యంలో నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి భుజాల‌పై చేతులు వేసి, పీరియ‌డ్స్ డేట్ ఏంటి..? అని అడిగాడు. ఎందుకు భ‌య్యా అని అడిగితే.. నేను రెడీ కావాలిగా అన్నాడ‌ని పేర్కొన్నారు. ఆయ‌న‌కు నో చెప్ప‌డంతో కెరీర్ ను అడ్డుకున్నాడ‌ని వాపోయారు. ప్ర‌స్తుతం బంగ్లా క్రికెట‌ర్ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

Also Read : IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వ‌ర్షం..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

బంగ్లాదేశ్ క్రికెట్‌లో సంచలనం..

Advertisement

తాను ఒక్క‌సారి కాదు.. ప‌లుమార్లు అస‌భ్య‌క‌ర‌మైన ప్ర‌తిపాద‌న‌లు ఎదుర్కొన్నాన‌ని తెలిపారు. ప‌లుమార్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారుల‌కు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ ప‌ట్టించుకోలేద‌ని ఆమె వెల్ల‌డించింది. “జీవనాధారం క్రికెట్ అయినప్పుడు, కొందరికే తెలిసిన వ్యక్తి అయినప్పుడు, మీరు ఇష్టపడకపోయినా అనేక విషయాలను వ్యతిరేకించలేరు” అని ఆమె పేర్కొంది. ఈ విష‌యం పై తాను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులోని సీనియర్ అధికారులైన మహిళా కమిటీ అధిపతి నాదెల్ చౌదరి, బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి సంప్రదించినప్పటికీ.. వారు మాత్రం తన ఫిర్యాదులను పరిష్కరించలేదని జహనారా తెలిపింది. క్రికెట్‌లో అత్యున్నత స్థాయిలోని వ్యక్తులే తమ సమస్యలను పట్టించుకోకపోవడం, ఆటగాళ్లకు రక్షణ కల్పించడంలో బోర్డు వైఫల్యం చెందింద‌ని తెలిపారు. జహనారా తన కెరీర్ దెబ్బతినడానికి మాజీ సెలెక్టర్ మంజురుల్ ఇస్లాంను వ్యతిరేకించడమే కారణమని ఆరోపించింది. 2021లో కోఆర్డినేటర్ సర్ఫరాజ్ బాబు ద్వారా తౌహిద్ భాయ్ తనను సంప్రదించారని జహనారా గుర్తు చేసుకుంది. తాను తెలివిగా ఆ ప్రతిపాదనను తప్పించుకున్న తరువాత, మంజురుల్ భాయ్ మరుసటి రోజు నుంచే తనను అవమానించడం, అగౌరవపరచడం మొదలుపెట్టినట్లు ఆమె వివరించింది.

జహనారా ఆరోపణలను ఖండించిన మాజీ సెలెక్టర్ మంజురుల్ ఇస్లాం

ఇది జట్టు సెలక్షన్లలో, ట్రైనింగ్ ప్రక్రియల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే ప్రశ్నలను లేవనెత్తుతుంది. ట్రైనింగ్ సెషన్ల సమయంలో మంజురుల్ మహిళా ఆటగాళ్లకు చాలా దగ్గరగా వచ్చి వారి భుజాలపై చేయి వేయడం, వారిని తన ఛాతీకి దగ్గరగా లాగి చెవిలో మాట్లాడటం వంటి అలవాటు ఉండేదని జహనారా ఆరోపించింది. ఇది మహిళా క్రీడాకారుల ప్రైవసీకి భంగం కలిగించడమే కాకుండా, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. మానసిక వేధింపులకు గురిచేసే ఒక నిర్దిష్ట సంఘటనను జహనారా వెల్లడించింది. “ఒకసారి అతను నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకుని నా భుజంపై చేయి వేసి నా చెవి దగ్గర వంగి నీకు పీరియడ్స్ వచ్చి ఎన్ని రోజులైంది? అని అడిగాడు అని జహనారా చెప్పింది. ఐసీసీ మార్గదర్శకాల ప్రకారం ఫిజియోలు ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆటగాళ్ల పీరియడ్స్ సైకిల్స్‌ను ట్రాక్ చేస్తారు. ఆ విషయం అతనికి ముందే తెలుసని, అయినప్పటికీ అతను ఇలా అడగడం అనుచితమని ఆమె పేర్కొంది. మ‌రోవైపు జహనారా ఆరోపణలను మాజీ సెలెక్టర్ మంజురుల్ ఇస్లాం, కోఆర్డినేటర్ సర్ఫరాజ్ బాబు ఖండించారు.

Advertisement

Also Read : Sree Charani : శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. గ్రూప్-1 జాబ్, రూ.2.5 కోట్లు, ఇంటి స్థలం

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×