IND vs PAK: హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్ ( Hong Kong Sixes 2025 ) ఇవాళ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇవాల్టి నుంచి జరగనున్న ఈ టోర్నమెంట్ ఈనెల 9వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan, Pool C ) మధ్య రసవత్తర ఫైట్ జరిగింది. అయితే, ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కొంప ముంచింది వర్షం. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో భారీ వర్షం పడింది. దీంతో మ్యాచ్ ను అర్థాంతరంగా ఆపేశారు. మళ్లీ మ్యాచ్ ప్రారంభం అయ్యే పరిస్థితులు లేకపోవడంతో, డక్ వర్త్ లూయిస్ పద్ధతి ( (DLS Method)) ప్రకారం…టీమిండియాను విజేతగా ప్రకటించారు. దీంతో 2 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇప్పటికే కువైట్ పైన విజయం సాధించిన పాకిస్తాన్..ఇందులోనూ గెలిచేది. కానీ వర్షం కారణంగా టీమిండియా విజయం సాధించింది.
హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్ లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట టీమిండియా బ్యాటింగ్ చేసి,86 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అద్భుతంగానే రాణించింది పాకిస్తాన్. 3 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయిన పాకిస్తాన్.. 41 పరుగులు చేసింది. ఈ తరుణంలోనే వర్షం పడింది. అప్పటికీ టీమిండియా కంటే 2 పరుగులు వెనకపడింది పాకిస్తాన్. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం…టీమిండియాను విజేతగా ప్రకటించారు.
హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్ ( Hong Kong Sixes 2025 ) లో భాగంగా జరిగిన ఇవాల్టి మ్యాచ్ లో టాస్ ఓడిపోయి టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఆరు ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి కేవలం 86 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ గా వచ్చిన రాబిన్ ఉతప్ప ( Robin Uthappa) 11 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు అలాగే రెండు బౌండరీలు ఉన్నాయి. మరో ఓపెనర్ చిలిపి 13 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లతో పాటు రెండు బౌండరీలు ఉన్నాయి.
ఇక బిన్నీ రెండు బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. చివరలో వచ్చిన కెప్టెన్ దినేష్ కార్తీక్ ( Dinesh Karthik) 6 బంతుల్లో 17 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సిక్సర్ తో పాటు రెండు బౌండరీలు కూడా ఉన్నాయి. దీంతో ఆరు ఓవర్లలో 86 పరుగులు చేసింది టీం ఇండియా. అయితే, వర్షం వల్లే, టీమిండియా విజయం సాధించింది. ఇక ఈ విజయంతో పాయిట్ల పట్టికలో పాకిస్తాన్ రన్ రేట్ ప్రకారం మొదటి స్థానంలో నిలిచింది. టీమిండియా రెండో స్థానంలో నిలిచింది.