E-Paper
Advertisement

T20 World Cup 2026: T20 ప్రపంచ కప్ ఆడే బంగ్లాదేశ్ టీం ఇదే..ఓ హిందువుకు కెప్టెన్సీ !

T20 World Cup 2026: T20 ప్రపంచ కప్ ఆడే బంగ్లాదేశ్ టీం ఇదే..ఓ హిందువుకు కెప్టెన్సీ !

T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు ( T20 World Cup 2026 ) వచ్చే నెలలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా తమ జట్లను ప్రకటిస్తున్నాయి అన్ని క్రికెట్ బోర్డులు. ఇప్పటికే టీమిండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించగా, తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ( Bangladesh ) కూడా తమ జట్టును ప్రకటించేసింది. ఈ నేపథ్యంలోనే కొత్త కెప్టెన్ ను కూడా నియామకం చేసింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ జట్టుకు లిట‌న్ దాస్ ( Litton Das) కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ( Bangladesh Cricket Board). అలాగే ఎండి సైఫ్ హస్సన్ ను వైస్ కెప్టెన్ గా నియామకం చేశారు. అయితే, బంగ్లాదేశ్‌లో అల్ల‌ర్లు జ‌రుగుతోన్న నేప‌థ్యంలో లిట‌న్ దాస్ ( Litton Das) లాంటి హిందువుకు కెప్టెన్సీ ఇచ్చి, అంద‌రికీ షాక్ ఇచ్చింది బంగ్లా క్రికెట్ బోర్డు.

Also Read:  BCCI-Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్..బీసీసీఐ కీల‌క ఆదేశాలు, రూ.9.20 కోట్లు గంగ‌పాలు

ప్రపంచ కప్ ఆడే బంగ్లాదేశ్ టీం ఇదే..ఓ హిందువుకు కెప్టెన్సీ !

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మార్చి 8వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ నిర్వహిస్తారు. అంటే దాదాపు నెలరోజుల పాటు ఈ మెగా టోర్నమెంట్ జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించేసింది. ఈ జట్టుకు లిట‌న్ దాస్ ( Litton Das) కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ తాజాగా ప్రకటించింది. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ గా కొత్తగా ఎంపికైన లిట‌న్ దాస్ పైన సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహమాన్ లాంటి ప్లేయర్ ను ఐపీఎల్ లో ఆడకుండా బీసీసీఐ ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో హిందూ మతానికి చెందిన లిట‌న్ దాస్ ను తమ జట్టు కెప్టెన్ గా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించడం జరిగింది. హిందువులంటే తమకు గౌరవం అనే అర్థం వచ్చేలా ఇతన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

టి20 ప్రపంచ కప్ ఆడే బంగ్లాదేశ్ జట్టు ఇదే

టీ20 ప్రపంచకప్‌ కోసం బంగ్లాదేశ్‌ జట్టు: లిట్టన్‌ కుమార్‌ దాస్‌ (కెప్టెన్‌), మహ్మద్‌ సైఫ్‌ హసన్‌ (వైస్‌ కెప్టెన్‌), తాంజిద్‌ హసన్‌, మహ్మద్‌ పర్వేజ్‌ హొస్సేన్‌ ఎమోన్‌, తౌహిద్‌ హృదయ్‌, షమీమ్‌ హొస్సేన్‌, ఖాజీ నూరుల్‌ హసన్‌ సోహన్‌, మహేదీ హసన్‌, రిషాద్‌ హొస్సేన్‌, రిషాద్‌ హోస్సేన్‌, తంజిమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్, Md షైఫుద్దీన్, షోరిఫుల్ ఇస్లాం

 

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×