E-Paper
Advertisement

Dr Ganesh Baraiya: నువ్వు పొట్టోడివి అంటూ ఎగతాళి చేశారు, ఏకంగా డాక్టరై నోళ్లు మూపించాడు!

Dr Ganesh Baraiya: నువ్వు పొట్టోడివి అంటూ ఎగతాళి చేశారు, ఏకంగా డాక్టరై నోళ్లు మూపించాడు!
Advertisement

Dr. Ganesh Baraiya Biography: జీవితంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్లిన వాళ్లే విజేతలుగా నిలుస్తారు. కాదని పోటారాన్ని వదిలేస్తే జీవితం తెగిన గాలిపటంలా మారిపోతుంది. మనుషులకు కొన్నిసార్లు తమ కులం, మతంతో పాటు రంగు, రూపు కూడా సమస్యలు తెచ్చిపెడుతుంది. ఆ సమస్యలను చీల్చుకుని ముందుకు సాగితేనే బరిలో నిలబడగలం. అచ్చంగా ఇలాంటి పనే చేశాడు డాక్టర్ గణేష్ బరేయా. తన వైకల్యాన్ని హేళన చేసిన వారికి ముఖం మీద కొట్టినట్టు సమాధానం చెప్పాడు. జీవితంలో అనుకున్నది సాధించాడు.

ఇంతకీ ఎవరీ డాక్టర్ గణేష్ బరేయా?

డాక్టర్ గణేష్ బరేయా గుజరాత్‌కు చెందిన వ్యక్తి. ఆయన ఎత్తు కేవలం 3 అడుగులు. బరువు సుమారు 20 కేజీలు. గ్రోత్ హార్మోన్ లోపం డ్వార్ఫిజంతో చిన్నప్పటి నుంచే ఆయన బాధపడ్డాడు. ఆయనకు 72 శాతం లోకోమోటర్ డిసేబిలిటీ ఉంది. అయినప్పటికీ తాను MBBS పూర్తి చేసి డాక్టర్ అయ్యాడు. ప్రపంచంలోనే అత్యంత చిన్న డాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

డాక్టర్ గణేష్ ఎందుకు వార్తల్లో నిలిచాడు?  

Advertisement

గణేష్ 2004లో గుజరాత్‌ భావ్ నగర్ జిల్లా గోరఖీ గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి అతడికి డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. కలను నెరవేర్చుకునేందుకు బాగా చదువుకున్నాడు. 2018లో NEET క్వాలిఫై అయ్యాడు. కానీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. గణేష్ ఎత్తును సాకుగా చూపిస్తూ అతడికి MBBS అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరించింది.

సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన గణేష్

తన వైకల్యాన్ని సాకుగా చూపిస్తూ MBBS సీటు ఇవ్వకపోడం పట్ల గణేష్ న్యాయపోరాటం చేశాడు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాపై న్యాయపోరాటానికి దిగాడు. తన కాలేజీ ప్రిన్సిపాల్ సాయంతో గుజరాత్ హైకోర్టులో కేసు వేశాడు. కానీ, ఆ కేసును కొట్టివేసింది. అయినా, తను నిరాశ చెందలేదు. సుప్రీం కోర్టుకు వెళ్లాడు. సుప్రీంకోర్టు అతడి ఆవేదనలో నిజం ఉందని గ్రహించింది. 2019లో ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. భావ్‌ నగర్ మెడికల్ కాలేజీలో MBBS సీటు కేటాయించింది.

భావ్‌ నగర్‌ లోని సర్ టీ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్‌గా

Advertisement

చక్కగా చదివి MBBS, ఇంటర్న్‌ షిప్ పూర్తి చేశాడు. 2025 నవంబర్ 27న భావ్‌ నగర్‌ లోని సర్ టీ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్‌గా జాయిన్ అయ్యారు. పేషెంట్లు మొదట అతడిని చూసి ఆశ్చర్యపోయారు. కానీ, ఆయన ట్రీట్‌మెంట్ చూసి పెద్ద సంఖ్యలో పేషెంట్స్ రావడం మొదలు పెట్టారు. పిల్లలు కూడా అతడిని చూసి భయపడకుండా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.  ప్రస్తుతం గణేష్ బరేయా స్టోరీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  సంకల్ప బలం బాగుంటే, ఎత్తు, డిసేబిలిటీ ఏమీ అడ్డు కాదని నిరూపించాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గణేష్ ఈకాలం యువతీ యువకులకు ఇన్‌స్పిరేషన్ అంటున్నారు.

Read Also: సఫారీ వెహికిల్స్ మీద జంతువులు అటాక్ చేయవు, ఎందుకో తెలుసా?

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×