E-Paper
Advertisement

IND VS SA 4th T20I: ల‌క్నో టీ20 ర‌ద్దు కావ‌డంపై ఫ్యాన్స్ సీరియ‌స్‌, ఇక మధ్యాహ్నమే మ్యాచ్ లు జ‌రిగేలా బీసీసీఐ ప్లాన్ ?

IND VS SA 4th T20I: ల‌క్నో టీ20 ర‌ద్దు కావ‌డంపై ఫ్యాన్స్ సీరియ‌స్‌, ఇక మధ్యాహ్నమే మ్యాచ్ లు జ‌రిగేలా బీసీసీఐ ప్లాన్ ?
Advertisement

IND VS SA 4th T20I:   టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టి 20 సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తయ్యాయి. నిన్న నాలుగో మ్యాచ్ జరగాల్సి ఉండగా అర్ధాంతరంగా రద్దయిపోయింది. ఒక మంచి కారణంగా లక్నో మ్యాచ్ ను రద్దు చేసింది బీసీసీఐ. దీనిపై లక్నో మ్యాచ్ కు ( Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow ) వచ్చిన అభిమానులు సీరియస్ అవుతున్నారు. వేలకు వేలు పెట్టి టికెట్లు కొంటే, ఒక బంతి పడకుండానే మ్యాచ్ ఎందుకు రద్దు చేశారని స్టేడియం బయట ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. త‌మ డ‌బ్బులు వెన‌క్కి ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్‌. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

Also Read: IPL Auction 2026: మినీ వేలం త‌ర్వాత 10 జ‌ట్ల ప్లేయ‌ర్ల ఫుల్ లిస్ట్ ఇదే, అన్ సోల్డ్ ప్లేయ‌ర్లు వీళ్లే

ఇకపై టి20 లో మధ్యాహ్నమే.. బీసీసీఐ కీలక నిర్ణయం?

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 4th T20I) మధ్య లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహార్ వాజ్ పేయ్‌ ఏకన క్రికెట్ స్టేడియంలో నిన్న జరగాల్సిన 4వ టి20 మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 9:30 దాటినా కూడా ప్రారంభం కాలేదు. ఉత్తర భారత దేశంలో ఉన్న లక్నో ప్రాంతంలో విపరీతమైన పొగ మంచు ఉంటుంది. చలికాలం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. అలాగే AQI ఏకంగా 391 పాయింట్లుగా నిన్న రికార్డు అయింది. అలాంటి సమయంలో మ్యాచ్ ఆడిస్తే క్రికెటర్ల ఆరోగ్యం పై దెబ్బ పడుతుంది. అందుకే అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే దీనిపై సోషల్ మీడియా వేదికగా చాలా విమర్శలు వస్తున్నాయి. చలికాలంలో నార్త్ లో మ్యాచ్ లు నిర్వహించడం కంటే సౌత్ ఇండియాలో నిర్వహిస్తే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే మధ్యాహ్నం పూట ఈ టి20 లో నిర్వహిస్తే, సరిపోతుందని ఫైర్ అవుతున్నారు. అయితే దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. చలికాలంలో జరిగే మ్యాచ్ లు అన్నీ కూడా మధ్యాహ్నం నిర్వహించేలా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాధ్యమైనంతవరకు సౌత్ ఇండియాలో చలికాలం టి20 లు నిర్వహించేలా స్కెచ్ వేస్తోందట. లక్నోలో జరిగిన తప్పిదం మళ్లీ జరగకుండా చూసుకోవాలని బీసీసీఐ అధికారులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా  టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa) మధ్య చివ‌రి 5వ టీ20 మ్యాచ్ డిసెంబ‌ర్ 19 వ తేదీన అంటే రేపు అహ్మ‌ద‌బాద్ లోని మోడీ స్టేడియంలో నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

Also Read: Yashasvi Jaiswal: మ్యాచ్ ఆడుతుండగా కలకలం.. ఆసుపత్రిలో చేరిన జైస్వాల్.. అసలు ఏమైంది అంటే

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×